breaking news
avoid Droght
-
పశుగ్రాసం కొరతను..నివారించండి ఇలా..
విజయనగరం ఫోర్ట్: వేసవిలో పశువులను ఎక్కువగా వేధించే సమస్య పశుగ్రాసం కొరత. మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఎండ తీవ్రత ఎక్కువ. ఆ నెలల్లో పశుగ్రాసం దొరకదు. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని రాయితీపై పశుగ్రాసాన్ని రైతులకు అందించేందుకు సిద్ధమవుతున్నామని పశుసంవర్థక శాఖ జేడీ వై.సింహాచలం తెలిపారు. ఈ మేరకు రైతులకు పశుసంవర్థకశాఖ ద్వారా రైతులకు అందించే పథకాల గురించి వివరించారు. సైనేజ్గడ్డి.. సైనేజ్గడ్డిని బేళ్లు రూపంలో రైతులకు అందిస్తున్నారు. కిలో గడ్డి ధర రూ. 6.92. కానీ రాయితీపై కిలో రూ.2కే అందిస్తున్నారు. ఒక రైతుకు గరిష్టంగా 3600 కేజీల గడ్డి ఇస్తారు. కావాల్సిన వారు సంబంధిత పశువైద్యాధికారిని గాని, గోపాలమిత్రను గాని సంప్రదించాలి. ఈ గడ్డి వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. వారం పాటు పశువులకు అలవాటు చేయాలి. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు.. ఈ పథకంలో భాగంగా గడ్డిని సాగు చేసే రైతులకు భూమి లీజు, ఉత్పత్తి వ్యయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు భూమి లీజు చెల్లిస్తోంది. ఉత్పత్తి వ్యయాన్ని ఉపాధి పథకం ద్వారా చెల్లిస్తారు. బహువార్షిక గడ్డి అయితే ఎకరానికి రూ.37వేలు, ఏకవార్షిక గడ్డి అయితే రూ.15వేల చొప్పన అందిస్తారు. గడ్డిని సాగు చేసిన రైతు కిలో గడ్డిని రూ.1కే మిగతా రైతులకు అందించాలి. దాణామృతం.. దాణామృతం గడ్డిలో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని రోజుకి ఒక పశువుకు 10 నుంచి 12 కిలోలు పెట్టాలి. గరిష్టంగా ఒక రైతుకు 3500 కిలోలు ఇస్తాం. కిలో విలువ రూ.12.50 కాగా రాయితీపై రైతులకు రూ.3.50 పైసలకు అందిస్తాం. -
మొక్కలు పెంచితే కరువు దూరం
– నాటిన మొక్కను దత్తత తీసుకోవాలి – 24శాతం అడవులు ఉంటే ప్రకతి బాగుంటుంది – ఐజి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్ క్రైం : హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కను దత్తత తీసుకుని పెంచితే భవిష్యత్‌లో వనసంపదకు కొదవ ఉండదని పోలీస్ శిక్షణ విభాగం ఐజి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో హరిత హారం కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వం బాగా చొరవ చూపిస్తుందని, మొక్కలు నాటడానికి రాష్ట్రం మొత్తం కదిలిందన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో శిశుమందిర్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. 24శాతం అడవులు ఉండే ప్రాంతాల్లో పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని, అడవులు, చెట్లు తగ్గిపోవడం వల్ల కరువు వస్తుందని అన్నారు. జీవకోటికి ప్రాణవాయువును అందిస్తూ, మనిషి మనుగడకే ప్రధానమైన చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో ఉన్నతమైనదని అన్నారు. పిల్లలకు మొక్కలు నాటి పోషించే అలవాటును ప్రతి తల్లిదండ్రులు నేర్పించాలని పిలుపునిచ్చారు. చిన్నారులతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎస్పీని అభినందించారు. ఈ సందర్భంగా మైనర్లు, డ్రంక్అండ్డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులతో, పాత నేరస్థులతో పోలీసులు మొక్కలు నాటించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు, డీఎస్పీ క్రిష్ణమూర్తి, ఇన్స్పెక్టర్లు సీతయ్య, సైదయ్య, రాజు, రామకష్ణ, గిరిబాబు, రామకష్ణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. హడావుడితో సరిపెట్టారు... జిల్లా కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి ఐజీ వస్తున్నారని పోలీస్ శాఖ చాలా హడావుడి చేసింది. చివరకు రెండు మొక్కలు నాటి ఆయన వెళ్లిన తర్వాత పోలీసులు కూడా అక్కడి నుంచి మొక్కలు నాటకుండానే వెళ్లిపోయారు.