breaking news
autographs
-
చెన్నై స్టేడియం లో ధోని చేసిన పనికి ...
-
అభిమానుల మనసులు గెల్చిన కోహ్లి
సెలబ్రిటీలకు అభిమానులతో సెల్ఫీలు దిగడమన్నా, వారికి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడమన్నా కాస్త ఇబ్బందే. కానీ టీమిండియా సారథి విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు భిన్నం. మైదానంలోనే కాకుండా, బయటకూడా అభిమానులను ఉత్తేజపరచటానికి కోహ్లి ఎప్పుడూ ముందుంటాడు. టీమిండియా సారథి వీరాభిమాని అయిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్‌కు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చి కోహ్లి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. మూడో టెస్టు విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నట్టు చెప్పి కోహ్లి తన ఉదారతను చాటుకున్న విషయం తెలిసిందే. నాటింగ్‌హామ్ టెస్టు అనంతరం స్టేడియం బయట అభిమానులు తమ అభిమాన క్రికెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ అనంతరం హోటల్‌కు వెలుతున్న సమయంలో మిగిలిన ఆటగాళ్లు బస్సు ఎక్కి కూర్చోగా.. కోహ్లి మాత్రం అభిమానులతో ఆనందం పంచుకోవడానికి వెళ్లాడు. దేశవిదేశీ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. అయితే ఓ పిల్లవాడు మాత్రం కోహ్లి.. కోహ్లి అంటూ బిగ్గరగా అరుస్తుండటంతో అది గమనించిన కోహ్లి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి ఆటోగ్రాఫ్‌తో పాటు, సెల్ఫీ కూడా ఇచ్చాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కోహ్లికి అభిమానుల పట్ల ఉన్న నిబద్దతకు అందరూ దటీజ్ కోహ్లి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో కూడా మిగతా క్రికెటర్లు అభిమానులను పట్టించుకోకుండా వెళ్లినా.. కోహ్లి మాత్రం ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. -
పుష్టిగా ఉంటేనే బెస్టు!
బల్లిని చూస్తే బేర్మంటారు... కారు వేగం పెరిగితే క్యార్మంటారు... చాక్లెట్స్ అంటే ఇష్టంగా చప్పరించేస్తారు... ఇలా సోనాక్షీ సిన్హాకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటి గురించి మీకు తెలుసా?! * హీరోయిన్ కాకముందే సోనాక్షీ సిన్హా ఆటోగ్రాఫ్స్ ఇచ్చేవారట. ఆమె తండ్రి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాది పాట్నా. స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు తండ్రితోపాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనాక్షి పాట్నా వెళ్లినప్పుడు అక్కడివాళ్లు ఆటోగ్రాఫ్స్ అడిగితే, సిగ్గుపడుతూ ఇచ్చారట. * ఫ్యాషన్ డిజైనర్ కావాలనే ఆకాంక్షతో ముంబయ్‌లోని ‘శ్రీమతి నాతీబాయ్ దామోదర్ తాకర్సే ఉమన్స్’ యూనివర్శిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. * ‘దబాంగ్’ చిత్రం ద్వారా కథానాయిక కాకముందు ‘మేరా దిల్ లేకే దేఖో’ అనే చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ‘దబాంగ్’ చిత్రానికి సల్మాన్ ఖాన్ కథానాయికగా అడగ్గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. * దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు.. ముంబయ్‌లో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా లేక వేరే ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా తనతో పాటు అదనంగా ఓ డ్రెస్ తీసుకెళతారు సోనాక్షి. ఒంటి మీద ఉన్న డ్రెస్ పొరపాటున చిరిగినా, అసౌకర్యంగా అనిపించినా నలుగురిలో నవ్వులపాలు కాకూడదు కాబట్టి, ఇలా ముందు జాగ్రత్త తీసుకుంటారు. * యాక్టర్స్ అందరూ కాంప్లికేటెడ్ అనుకుంటారు. కానీ తాను ఆ జాబితాకు చెందనని పలు సందర్భాల్లో సోనాక్షి పేర్కొన్నారు. అందుకే హీరోలను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటున్నారు. అన్‌కాంప్లికేటెడ్ పర్సన్స్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అది కూడా సినిమా రంగానికి చెందినవాళ్లని చేసుకోరట. * సైజ్ జీరో అంటే చాలా చిరాకు. పుష్టిగా ఉంటేనే అందంగా ఉంటామంటున్నారు. అందుకే తననెవరైనా బొద్దుగా ఉంటావని విమర్శించినా వాటిని ప్రశంసలుగా భావిస్తారు. * ఖరీదు గల కార్లు చూపించి అమ్మాయిలను పడగొట్టాలనుకునే అబ్బాయిలంటే పడదు. కాలేజ్ డేస్‌లో అలా బిల్డప్ ఇచ్చిన అబ్బాయిల బుర్ర తిరిగిపోయేలా క్లాస్ తీసుకునేవారు. * బల్లులంటే తెగ భయం. సాలీడులంటే అలర్జీ. బల్లులంటే సోనాక్షీకి భయం అని తెలిసి, ‘జోకర్’ సినిమాలో నటించేటప్పుడు అక్షయ్ కుమార్ సరదాగా రబ్బర్ బల్లిని చూపిస్తూ, ఆమెను ఏడిపించేవారు. మొదటిసారి ఆ రబ్బర్ బల్లిని చూసి, నిజమైనదని నమ్మి, షూటింగ్ లొకేషన్లో పరుగులు పెట్టారు. * చదువుకునే రోజుల్లో ఆటల్లో ఫస్ట్. వాలీబాల్, ఫుట్‌బాట్, త్రో బాల్, టెన్నిస్ బాగా ఆడేవారు. వేగంగా కారు నడపడం అంటే టెన్షన్. అలా నడిపేవాళ్లతో ప్రయాణం చేయరు. * చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అవి తినకుండా ఉండలేరు. తిన్న తర్వాత గిల్టీగా అనిపిస్తుందని అంటుంటారు. అలాగే, డైట్ కోలా తెగ తాగుతారు. అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా తాగుతారట. * పెయింటింగ్ అంటే సోనాక్షీకి ఇష్టం. తీరిక చిక్కినప్పుడల్లా బొమ్మలు గీస్తుంటారు. అలాగే ఖాళీ సమయాల్లో ఐప్యాడ్‌లో గేమ్స్ ఆడుతుంటారు. -
ఆటోగ్రాఫ్ ఔట్.. సెల్ఫీ ఇన్!
లక్నో: 'సెల్ఫీ' ఈ పదం ఇప్పుడు యువత ఫాలో అవుతున్న సరికొత్త ట్రెండ్. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఎప్పుడైనా ఎక్కడైనా చక్కగా సెల్ఫీలు తీసేసుకోవచ్చు. ఎవరైనా సెలబ్రిటీలు వస్తే చాలు.. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ పుస్తకాలు పట్టుకుని యువత హడావుడి చేసేవారు. ఇప్పుడు చేతిలో ఫోన్ పట్టకుని.. సెల్ఫీ ప్లీజ్ అని అడుగుతున్నారు. కెమెరా మోసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా, అత్యాధునిక ఫీచర్లు, మంచి కెమెరాలతో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఎక్కడిపడితే అక్కడ సెల్ఫీలకు పోజులిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం తన పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న సందర్భంగా సెల్ఫీలపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నేటి యువత ఆటోగ్రాఫ్‌ల కంటే సెల్ఫీలనే ఎక్కువగా కోరుకుంటున్నారని చెప్పారు. అంతేకాక తన చిన్ననాటి తరానికి ఇప్పటి తరానికి మధ్య చాలా మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా అభినందించడానికి వచ్చినవాళ్లలో కూడా ఆటోగ్రాఫ్ అడిగిన వాళ్ల కంటే సెల్ఫీలు అడిగినవాళ్లే ఎక్కువగా ఉన్నారన్నారు.