breaking news
Australian Prime Minister Tony Abbott
-
అబాట్‌కు ఉద్వాసన
- ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా టర్న్‌బుల్ కాన్బెర్రా: నాటకీయ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తన పదవిని కోల్పోయారు. అధికార పీఠం ఎక్కిన రెండేళ్ల తర్వాత అబాట్‌ను సోమవారం పార్టీ అంతర్గత ఓటింగ్‌లో తొలగించారు. అర్ధరాత్రి దాటాక లిబరల్ పార్టీ నిర్వహించిన ఓటింగ్‌లో అబాట్‌కు 44 ఓట్లే దక్కాయి. అబాట్ వ్యతిరేక వర్గం నేత మాల్కం టర్న్‌బుల్‌కు 54 ఓట్లు దక్కాయి. కమ్యూనికేషన్ల మంత్రి పదవికి టర్న్‌బుల్ రాజీనామా చేశారు. దేశానికి ఆర్థిక పరిపుష్టిని ఇచ్చే నాయకత్వ లక్షణాలు అబాట్‌కు లేవంటూ ఆయన నాయకత్వాన్ని టర్న్‌బుల్ సవాల్ చేయడంతో ఓటింగ్ జరిపారు. 2010లో కెవిన్ రడ్‌ను పదవీచ్యుతుడిని చేసి గిలార్డ్ ప్రధాని అయిన ఉదంతం మాదిరిగానే తాజా ఘటన జరిగింది. అబాట్ రాజీనామా చేశాక టర్న్‌బుల్ ప్రధాని పదవి చేపడతారు. -
ప్రధాని ఆతిథ్యంలో...
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ గురువారం భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన రెండో అధికారిక నివాసమైన కిరిబిలిలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఇరు జట్ల ఆటగాళ్లతో అబాట్ ఫోటో సెషన్లో పాల్గొన్నారు. మంగళవారం నుంచి సిడ్నీలో భారత్, ఆసీస్ నాలుగో టెస్టు జరుగుతుంది. మరో వైపు ధోని కూడా ఈ విందుకు హాజరైనట్లు సమాచారం. అయితే గ్రూప్ ఫోటోకు మాత్రం అతను దూరంగా ఉన్నాడు. ఇరు జట్లతో ఫోటో సెషన్ జరిగే సమయంలో ధోని అటు వైపు రాకుండా లాబీలోనే నిలబడి చూస్తుండిపోయాడు. నేనూ స్లెడ్జింగ్ చేసేవాడిని.. బ్యాటింగ్.. బౌలింగ్ అంతగా రాకున్నా కేవలం స్లెడ్జింగ్ కారణంగానే తనకు జట్టులో చోటు దొరికిందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తన క్రికెట్ రోజులను గుర్తుచేసుకున్నారు. విద్యార్థి దశలో ఆయన ఆక్స్ఫర్డ్ మిడిల్ కామన్ రూమ్ జట్టుకు సారథిగా వ్యవహరించారు. ‘నేను బ్యాటింగ్ చేయలేను.. బౌలింగూ రాదు. ఫీల్డింగ్ చేయడం అసలే రాదు. కానీ నేను బాగా స్లెడ్జింగ్ చేయగలను. ఈ కారణంగానే నాకు జట్టులో చోటు దక్కిందనుకుంటాను’ అని ప్రధాని అన్నారు.