breaking news
Aunt Harassment
-
ఆగ్రహంతో ఆ అమ్మ తీసుకున్న నిర్ణయం..
ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి కాస్తా పెద్దవయ్యాయి. భార్య పిల్లలను పుట్టింట్లో వదిలేసేటంతగా అవి పెరిగాయి. దీంతో భార్య మానసికంగా కుంగిపోయింది. చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే తాను చనిపోతే పిల్లలు దిక్కులేని వారవుతారని భావించింది. వారితో సహా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో చిన్నారులిద్దరూ చనిపోగా.. తల్లిని మాత్రం స్థానికులు రక్షించారు. ఆవేశంలో.. ఆగ్రహంతో ఆ అమ్మ తీసుకున్న నిర్ణయం.. ఆ చిన్నారులను బలితీసుకుంది. కోరుకొండలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన పలువురిని కలచివేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోరుకొండ (రాజానగరం): గ్రామానికి చెందిన అశ్వినికి రంగంపేట మండలం సుభద్రంపేట గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీనివాస్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నిత్యశర్వాణి(3), జయదేవ్ విక్రమ్(ఆరు నెలల బాబు) ఉన్నారు. కుటుంబంలో గొడవలు కొనసాగుతున్నాయి. 20 రోజుల క్రితం నాగిరెడ్డి శ్రీనివాస్, అశ్విని, పిల్లలతో సహా యానాంలో బంధువుల ఇంటి వద్ద ఉన్నారు. ఆదివారం ఉదయం శ్రీనివాస్ కోరుకొండకు అశ్వినితో పాటు ఇద్దరు పిల్లలను ఆమె పుట్టింటికి తీసుకువచ్చి, వదిలి వెళ్లిపోయాడు. దీంతో అశ్విని మానసికంగా బాధపడుతూ చనిపోవాలనుకుంది. తాను చనిపోతే ఇద్దరు పిల్లలు దిక్కులేని వారవుతారని భావించింది. ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉన్న బావిలో ఆదివారం అర్ధరాత్రి దూకింది. దీంతో ఇద్దరు చిన్నారులు చనిపోగా, అశ్వినిని మాత్రం చుట్టుపక్కల వారు రక్షించారు. అయితే చిన్నారులను కోరుకొండ శ్మశానంలో పూడ్చివేశారు. చివరకు కోరుకొండ వీఆర్ఓ యు.సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. భర్త శ్రీనివాస్, అత్తగారు వేధించేవారని కుటుంబ సభ్యులు తెలిపారని ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం కోరుకొండ తహసీల్దార్, గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో పూడ్చివేసిన బాలిక, బాలుడి శవాలను వెలికితీస్తామని డీఎస్పీ తెలిపారు. భర్త, అత్త వేధింపుల వల్లే.. భర్త శ్రీనివాస్, ఆమె అత్త వేధింపుల వల్లే నాగిరెడ్డి ఆశ్విని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కోరుకొండ డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు, సీఐ ఎన్. మధుసుధనరావు, ఎస్ఐ రావూరి మురళీమోహన్ నాగిరెడ్డి ఆశ్విని ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను విచారించారు. శ్మశానం వద్దకు వెళ్లి పూడ్చివేసిన బాలుడు, బాలిక ప్రదేశాన్ని పరిశీలించారు. -
వేధింపులు తాళలేక ఆత్మహత్య
నిజాంసాగర్ : భర్తతో పాటు అత్త వేధింపులను తాళలేక జిన్న హేమలత (22) అనే వివాహిత శుక్ర వారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఐదు నెలల కూతురు మానసను ఒంటరి చేసి తల్లిగారింట్లోనే తనవు చాలించింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామానికి చెందిన దుంపల అనుశవ్వ, లక్ష్మణ్ దంపతుల కూతురు హేమలతను ఇంటర్ వరకు చదివించారు. పిట్లం మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్న సత్యనారాయణకు ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. ఆ సమయంలో రెండు తులాల బంగారు గొలుసు, ఇతర అభరణాలతో పాటు బాన్సువాడలోని రూ. 3.50 లక్షల విలువైన ఇల్లు కట్నంగా ఇచ్చారు. ఏడాదిన్నర పాటు దంపతులు అన్యోన్యంగానే ఉన్నారు. ఐదు నెలల కిందట వీరికి కూతురు పుట్టింది. అప్పటి నుంచి సత్యనారాయణతో పాటు అత్త రామవ్వ హేమలతను వేధిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. పెళ్లప్పుడు పెట్టిన బంగారం ఇటీవల అమ్ముకున్నారని, తమ కూతురును తరుచూ డబ్బు కోసం వేధిస్తున్నారని చెప్పారు. నాల్గు రోజుల క్రితం కూతురు ఇంటికి వెళ్లగా ఆమె భర్త, అత్త తమతో గొడవ పడ్డారని పేర్కొన్నారు. దీంతో హేమలతను తమ ఇంటికి తీసుకొచ్చామని, వారి వేధింపులు భరించలేక ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడిందని రోదిస్తూ చెప్పారు. ఎస్సై అంతిరెడ్డి, తహశీల్దార్ సయ్యద్ అహ్మద్ అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు.