కఠిన చర్యలు తప్పవు.. జాగ్రత్త: రాజ్నాథ్
అట్టారీ: ఏ ఒక్క మత సంస్థపై దాడులకు పాల్పడినా ఊరుకోబోమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ విషయంలో మతాలతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల వివిధ చర్చిలతోపాటు పలు మైనార్టీ సంస్థలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
గుడులైనా, మసీదులైనా, చర్చిలైనా.. ఏ ఒక్క మతసంస్థలపై దాడులు జరపరాదని, అలా చేస్తే కఠినంగా శిక్షిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. ఈ విషయంలో మైనార్టీలు ఆందోళన చెందొద్దని సూచించారు. అందరూ వారిలో ఆత్మ విశ్వాసం నింపేందుకు ప్రయత్నించాలే తప్ప వారిలో ఆందోళన సృష్టించొద్దని సూచించారు.