breaking news
attack on office
-
మంత్రి రజిని ఆఫీసుపై దాడి ఎలా జరిగిందో చెప్పిన DSP
-
ఎమ్మార్వో ఆఫీసులో వ్యక్తి వీరంగం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి అధికారులపై దాడికి యత్నించాడు. అడ్డొచ్చిన వీఆర్ఓ పుల్‌సింగ్‌పై దాడి చేశాడు. అంతేకాకుండా కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశాడు. కుర్నాపల్లి శివారులోని సర్వే నంబర్ 127, 128, 129లో ఉన్న భూములను తమ బంధువుల పేరుపై పట్టాలు చేసి పాస్‌బుక్‌లు ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. అందుకు అధికారులు కుదరదని చెప్పడంతో.. ఆగ్రహానికి లోనైనా శ్రీనివాస్‌రావు దాడికి తెగబడ్డాడు. పట్టా చేయాలని కోరుతుంటే అధికారులు ఏడాదిన్నరగా తిప్పుకుంటారని శ్రీనివాస్‌రావు ఆరోపించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతేడాది అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
టీడీపీ నాయకుల దాష్టీకం!
టెక్కలి రూరల్/కోటబొమ్మాళి: మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో టీడీపీ నాయకులు.. కార్యకర్తలు దౌర్జన్యకాండకు దిగారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి పట్టుతగ్గుతోందనే భయంతో అధికార పార్టీ కార్యకర్తలు బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఓటమి భయాన్ని సహించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే కోటబొమ్మాళిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి గురువారం ఉదయం పది గంటల సమయంలో దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ ఉన్న కార్యకర్తలు.. నాయకులపై విచక్షణ రహితంగా దాడిచేశారు. కర్రలు, మారణాయుధాలతో దాడి చేసి కొట్టడంతో 8 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయడినవారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బొయిన నాగేశ్వరరావు, నేతింటి నగేష్, అన్నెపు రామారావు, దుబ్బ వెంకట్రావు, మెండ తాతయ్య, తోట వెంటరమణ, కళ్ల ఆదినారాయణ, పిల్లల లక్ష్మణరావు ఉన్నారు. వీరిలో తోట వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మిగిలిన వారిని టెక్కలిలోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. టీడీపీ వర్గీయుల దాడులతో కోటబొమ్మాళిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ శ్రేణులు చేసిన దాడిని నిరసిస్తూ వైస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి మంత్రి అచ్చెన్నాయుడును ఏ–1గా, టీడీపీ మండల అధ్యక్షుడు బొయిన రమేష్‌పై ఏ–2గా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టులు చేయాలని నినాదాలు చేశారు. సుమారు 3 గంటల పాటు అటు పోలీసులకు, ఇటు వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తక్షణమే దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాద్‌రావు, సీఐలు శ్రీనివాసరావు, పైడప్పనాయుడు, తిరుపతిరావు, మహేష్‌లు, ఆరుగురు ఎస్సైలతోతోపాటు సుమారు 50 మందికి పైగా పోలీసులు కోటబొమ్మాళి స్టేషన్‌కు చేరుకొని ఆందోళన విరమించాలని వైఎస్ఆర్సీపీ నాయకులను కోరారు. అయితే తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని దువ్వాడ శ్రీనివాస్, తిలక్‌లు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై అట్రాసిటీ, 307 కేసులు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ ప్రసాదరావు జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన వారిపై 307, 324 సెక్షన్లతోపాటు అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని అందరి మధ్యలో ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతించారు. కాగా వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ కోటబొమ్మాళిలోని పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి.. గచ్చుపై పడి ఉన్న రక్తం మరకలను పరిశీలించారు. ఆందోళన కార్యక్రమంలో పార్టీ నాయకులు యర్ర చక్రవర్తి, సింగుపురం మోహన్‌రావు, కుర్మాణ బాలకృష్ణ, ఎస్.హేమసుందరరాజు, చిన్ని జోగారావు, చింతాడ గణ పతి, తమ్మన్నగారి కిరణ్, బగాది హరి, సత్తారు సత్యం, కవిటి రామరాజు, శ్రీరాంమూర్తి, బి.మోహన్‌రెడ్డి, ఎం.నాగభూషణరావు, ఎం భాస్కర్‌రెడ్డి, మదీన్, శ్యామలరావు, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాడి ఘటనను దళిత నాయకుడు బొకరి నారాయణరావు ఖడించారు. నేడు కోటబొమ్మాళి బంద్కువైఎస్సార్ సీపీ పిలుపు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడిని నిరసిస్తూ శుక్రవారం కోటబొమ్మాళి బంద్‌కు పార్టీ నాయకులు పిలుపునించారు. బంద్‌కు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, తిలక్‌లు కొత్తపేట నుంచి కోటబొమ్మాళి వరకూ ర్యాలీ చేయనున్నారు. -
డీజేకు నో.. టీఆర్ఎస్ కార్యాలయంపై దాడి
బీర్కూర్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు’ గణేష్ నిమజ్జనోత్సవంలో డీజే పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించక పోవడంతో ఆగ్రహించిన నిజామాబాద్ జిల్లా బీర్కూర్ యువకులు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పలువురు టీఆర్ఎస్ నాయకులపై దాడికి యత్నించారు. తీవ్రంగా దుర్బాషలాడుతూ పార్టీ కార్యాలయంలోని కుర్చీలు, టేబుల్, ఫ్యాన్ ఇతర వస్తువులను ధ్వంసం చేసి భగత్‌సింగ్ కూడలిలో కాల్చివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అందోళన కారులను చెదరగొట్టారు. బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డి.. పిట్లం, నిజాంసాగర్, బాన్సువాడతోపాటు పక్క మండలాల నుంచి పోలీసులను రప్పించి భారీ బందోబస్తు మద్య శోభాయాత్ర పూర్తి చేయించారు. అదేవిధంగా బీర్కూరు మండలంలోని సంగెం గ్రామంలోనూ గణేష్ నిమజ్జనోత్సవం ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని అగ్రవర్ణాల వారు తమపై దాడిచేశారని అరోపిస్తూ దళితులు అందోళనకు దిగారు. బీర్కూర్ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. ఉద్రిక్తతకు కారణమైన పలువురిని అదుపులోకి తీసుకుని, నిలిచిపోయిన నిమజ్జనోత్సవాన్ని పూర్తిచేయించారు.