దాడి కేసులో కర్ణాటక ముఠా అరెస్టు
మొలకలచెర్వు: మినీ లారీ డ్రైవర్‌పై దాడి చేసి దోచుకున్న ఘటనలో మొలకల చెర్వు పోలీసులు కర్ణాటకకు చెందిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన 9 మంది సభ్యులు ఈనెల 13వ తేదీన మినీ లారీపై దాడి చేసి, డ్రైవర్ నుంచి రూ. 23 వేలు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. వారి నుంచి మారణాయుధాలు, రెండు బైక్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ రిషికేశ్వర్ తెలిపారు.