breaking news
ATM card renewal
-
ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..
కోట్లాది మంది ఈపీఎఫ్ఓ(EPFO) చందాదారులు తమ పీఫ్ డబ్బును ఏటీఎం(ATM) ద్వారా విత్‌డ్రా చేసుకునేందుకు తేదీ ఖరారైంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్వేర్ వ్యవస్థను ప్రారంభిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ ఏడాదే ఈపీఎఫ్ఓ 3.0ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యుల సమస్యలను పరిష్కరించి, వారికి మెరుగైన సర్వీస్‌ను అందిస్తుందన్నారు. ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులను జూన్ 2025 వరకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డుఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పీఎఫ్ చందాదారులకు ఏటీఎం కార్డులను జారీ చేస్తామని కేంద్ర మంత్రి మాండవీయ ధ్రువీకరించారు. ఉద్యోగులు ఈ ఏటీఎం కార్డు ద్వారా తమ ఈపీఎఫ్ పొదుపును సులభంగా పొందవచ్చన్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అందుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి వెబ్సైట్, సిస్టమ్ అప్డేట్ల(Updates) ప్రారంభ దశను ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామని మాండవీయ పేర్కొన్నారు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETF) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. -
పండుగ పూట పైసలు ఖతమ్!
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో రాజ్‌కుమార్ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ‘దసరా’ హడావుడి వల్ల తీరిక లేకపోవడంతో పండుగకు ముందు రోజు బుధవారం (21వ తేదీ) సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి షాపింగ్‌కు వెళదామని అనుకున్నాడు. అయితే బుధవారం ఉదయం విధుల్లో ఉన్న రాజ్‌కుమార్‌కు.. ఎస్బీహెచ్ సిబ్బంది అంటూ హిందీలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మీ ఏటీఎం కార్డు రెన్యువల్ డేట్ అయిపోతోంది. మరో రెండు నిమిషాల్లో మీ ఖాతా నుంచి లావాదేవీలు నిలిచిపోతాయి. మీ కార్డు వివరాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలి. మీ ఏటీఎం కార్డు మీద ఉన్న 16 డిజిట్ నంబర్లు చెప్పండి’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి కోరాడు. పండుగ పూట ఇదేం గోల.. ఒకవేళ నిజంగా ఖాతా నిలిచిపోతే మొదటికే మోసం వస్తుందని భావించిన రాజ్‌కుమార్ ఆ నంబర్లు చెప్పేశాడు. ఆ తర్వాత వారి మాటలను నమ్మి సీవీవీ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ కూడా ఇచ్చేశాడు. ‘మీ సెల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. తిరిగి వెంటనే కాల్ చేస్తా’ అని ఫోన్ పెట్టేశాడు. కాల్ కట్ అయ్యిందో లేదో ఓటీపీ వచ్చింది. మళ్లీ కాల్ చేసి ఓటీపీ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది క్షణాలకే ‘మీరు రూ.47 వేలు ఆన్లైన్ షాపింగ్ చేశారు’ అంటూ ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో రాజ్‌కుమార్ లబోదిబోమన్నాడు. అతని కుటుంబానికి పండుగ సంబురం లేకుండా పోయింది. ఈ నెల 21న రాజ్‌కుమార్‌కు ఫోన్ కాల్ వస్తే.. అదే డిపోకు చెందిన మరో ముగ్గురు లక్ష్మీ శేఖర్(రూ.28 వేలు), తిరుపతిరావు(రూ.10 వేలు), ఎస్ఏ చారి(రూ. 5,500)లకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ 23, 24 తేదీల్లో రావడంతో మోసమని గుర్తించిన నలుగురూ సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇదే డిపోకు చెందిన మరో ముగ్గురు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు తెలుస్తోంది. వీరంతా కలసి సుమారు రూ. లక్ష వరకూ మోసపోయినట్టు సమాచారం. 30 మందికి కాల్స్.. ఇదే డిపోకు చెందిన దాదాపు 30 మందికి ఫోన్ కాల్స్ వచ్చినట్టు సమాచారం. అయితే కొంతమంది అప్రమత్తమై ఎటువంటి వివరాలు ఇవ్వకపోగా.. మరికొంత మంది సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి పూర్తి వివరాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే నలుగురిలో చులకనవుతామనే ఉద్దేశంతో కొంత మంది ముందుకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. కాగా, ఆర్టీసీ డిపో సిబ్బంది వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కడంపై సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది బిహార్, జార్ఖండ్ ముఠాల పనిగా అనుమానిస్తున్నారు. మోసపోకండి.. క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు అప్డేట్ చేస్తామంటూ ఫోన్లు వచ్చినా, తక్కువ వడ్డీకే రుణం ఇస్తామంటూ ఈ-మెయిల్స్ వచ్చినా, ఏటీఎం కార్డు వెరిఫికేషన్ కోసం ఆధార్‌తో అనుసంధానం చేస్తామన్నా, షాపింగ్ చేయడం వల్ల వచ్చే రివార్డు పాయింట్లను ఖాతాలకు బదిలీ చేస్తామన్నా, క్రెడిట్ ఫెసిలిటీ రూ.50 వేల వరకు ఉంటే దాన్ని రూ. లక్ష వరకు పెంచుతామని.. వచ్చే కాల్స్ నిజమైనవి కావని, ఇటువంటి ఫోన్ కాల్స్‌ను నమ్మి ప్రజలు మోసపోవద్దని సైబరాబాద్ సైబర్ విభాగం ఏసీపీ జయరాం కోరారు.