breaking news
Atanasio Monserrate
-
మైనర్ రేప్ కేసులో ఎమ్మెల్యేకు బెయిల్
పనాజీ: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సెయింట్ క్రూజ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్కు బెయిల్ మంజూరు చేస్తూ గోవా కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై బుధవారం విచారణ జరిపిన చిల్డ్రన్స్ కోర్టు.. మోన్సరేట్తో పాటు మరో ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తుతో పాటు వారం రోజుల పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాల్సిందిగా మోన్సిరేట్ను కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది మార్చి నెలలో కనిపించకుండా పోయిన ఓ బాలిక ఇటీవలే పోలీసుల గాలింపులో దొరికింది. అయితే సురక్షిత ప్రాంతానికి తరలించి వివరాలు సేకరించగా ఎమ్మెల్యే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సదరు బాలిక తెలిపింది. దీంతో పోలీసులు మోన్సురేట్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే.. మోన్సిరేట్ మాత్రం ఇవన్నీ తనపై బురదజల్లే ప్రయత్నాలని కొట్టిపారేశాడు. -
'రేపిస్టు' మంత్రిపై కామెంట్లు చేయను!
పనాజీ: గోవాలో ఓ మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి గురించి తాను కామెంట్లు చేయనని ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. రాష్ట్ర మాజీమంత్రి అటానాసియో మోన్సిరేట్ ఈ కేసులో నిందితుడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని అందుకే కేసు గురించిగానీ, విచారణపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని చెప్పారు. క్రైం బ్రాంచ్ బాగా పనిచేస్తుందని మాత్రమే తాను చెప్పగలనన్నారు. రూ.50 లక్షలకు 16 ఏళ్ల మైనర్ బాలికను కొనుక్కుని ఆ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలున్నాయి. మోన్సిరేట్, బాలిక తల్లితో సహా మరో మహిళను ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన రిమాండ్ గడువు ముగియనున్న నేపథ్యంలో పోలీసు కస్టడీలో ఉన్న నేతను కోర్టులో హాజరు పరచనున్నారు. తనను రాజకీయంగా బలహీన పరచడానికే ప్రత్యర్థులు ఈ చర్యలకు దిగుతున్నారంటూ అటానాసియో మోన్సిరేట్ ఆరోపిస్తున్నారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ ఆయనను బహష్కిరించింది. ఈ ఏడాది మార్చిలో సెయింట్ క్రూజ్ కు చెందిన మాజీ మంత్రి అటానాసియో మోన్సిరేట్ ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గోవా ఎస్పీ ఎస్పీ కార్తిక్ కష్యప్ గతంలోనే తెలిపారు.