breaking news
assam rifles convey
-
కొడుకు బర్త్‌డేకి తప్పకుండా వస్తానన్నాడు.. ఇంతలోనే
ఇంపాల్: మణిపూర్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్’కు చెందిన ఖుగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరణించిన భద్రతా సిబ్బందిలో అస్సాం రైఫిల్స్ జవాన్ సుమన్ స్వర్గిరీ ఒకరు. బక్సా జిల్లాలోని బరామా ప్రాంతానికి సమీపంలోని తేకెరకుచి కలిబారి గ్రామానికి చెందిన సుమన్ 2011లో భారత సైన్యంలో చేరాడు. అంతకుముందు 2007లో మిలిటెంట్లు అతని తండ్రి కనక్ స్వర్గిరీని హత్య చేశారు. సుమన్ చివరిసారిగా ఈ ఏడాది జూలైలో ఇంటికి వచ్చాడు. (చదవండి: మణిపూర్‌లో తీవ్రవాదుల ఘాతుకం) సుమన్‌కు వివాహం అయి ఓ కుమారుడు ఉన్నాడు. డిసెంబర్లో కుమారుడి మూడవ పుట్టిన రోజు. కొడుకు బర్త్‌డేకు తప్పకుండా వస్తానని భార్యకు మాటిచ్చాడు. మరి కొన్ని రోజుల్లో భార్యాబిడ్డలను కలవబోతున్నానని తెగ సంతోషించాడు సుమన్. కానీ అతడి ఆనందాన్ని తీవ్రవాదులు దూరం చేశారు. సుమన్ కుటుంబంలో జీవితాంతం తీరని దుఖాన్ని మిగిల్చారు. సుమన్ మరణ వార్త తెలిసి అతడి భార్య గుండలవిసేలా విలపిస్తోంది. ‘‘నా భర్త వచ్చే నెల కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వస్తానని మాటిచ్చాడు. పోయిన శుక్రవారం నాకు కాల్ చేశాడు. అప్పుడు తాను ఓ రిమోట్ ఏరియా ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలిపాడు.. అక్కడి నుంచి తిరిగి వచ్చాక కాల్ చేస్తానన్నాడు. మాకు కాల్ చేసే లోపే అతడికి తీవ్రవాదుల రూపంలో చివరి కాల్ వచ్చింది. నాకు, నా బిడ్డకు దిక్కెవరు’’ అంటూ ఏడుస్తున సుమన్ భార్యను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. (చదవండి: ఉగ్రదాడి.. బీజేపీ సర్పంచ్ దారుణ హత్య) ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(ప్రెపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి. చదవండి: ఆ విషాదంపై రతన్ టాటా భావోద్వేగం -
మణిపూర్‌లో తీవ్రవాదుల ఘాతుకం
ఇంఫాల్/న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రం మణిపూర్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్’కు చెందిన ఖుగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(ప్రెపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి. చురాచాంద్‌పూర్ జిల్లాలోని సెఖాన్ గ్రామం వద్ద విప్లవ్ త్రిపాఠి తన భార్య, ఆరేళ్ల కుమారుడితోపాటు కాన్వాయ్‌లో వస్తుండగా తీవ్రవాదులు పేలుడు పదార్థాలను(ఐఈడీ) పేల్చారు. కాల్పులు సైతం జరిపారు. దీంతో కాన్వాయ్‌లో ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించారు. తీవ్రవాదుల దాడిలో కల్పల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు, నలుగురు జవాన్లు మృతిచెందారు. గాయపడిన వారిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రవాదుల దాడిలో మరణించిన కల్నల్ విప్లవ్ త్రిపాఠి గతంలో మిజోరాంలో పనిచేశారు. 2021 జూలైలో బదిలీపై మణిపూర్‌కు వచ్చారు. మిజోరాంలో ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విప్లవ్ త్రిపాఠి స్వస్థలం ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్. (చదవండి: అద్భుతం: తల్లి దీవెనలు.. తమ్ముడూ నీ బుర్రకు హ్యాట్సాఫ్) ఏడుగురి ప్రాణ త్యాగాల్ని మర్చిపోలేం: మోదీ మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై తీవ్రవాదులు దాడి చేసి, ఏడుగురి ప్రాణాలను బలిగొనడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఏడుగురి ప్రాణ త్యాగాల్ని ఎప్పటికీ మర్చిపోలేమని శనివారం ట్వీట్ చేశారు. అది పిరికిపంద చర్య: రాజ్‌నాథ్ సింగ్ మణిపూర్‌లో తీవ్రవాదుల దాడిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. తీవ్రవాదులను కచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. ఐదుగురు యోధులను దేశం కోల్పోయిందని అన్నారు. చదవండి: ‘‘ఇవాళ ఉన్నాం. రేపుంటామో లేదో!’’ ఏమిటీ పీఎల్ఏ? మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ జవాన్లపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సంస్థను 1978 సెప్టెంబర్ 25న ఎన్.బిశ్వేశ్వర్ సింగ్ ప్రారంభించారు. మణిపూర్‌కు భారతదేశం నుంచి విముక్తి కలిగించి, స్వతంత్ర దేశంగా మార్చడమే తమ సంస్థ ధ్యేయమని ప్రకటించారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలు, మావో ఆలోచనా విధానంపై ఆధారపడి పీఎల్ఏ పనిచేస్తోంది. పీఎల్ఏకు చైనా ప్రభుత్వం నుంచి అండదండలు లభిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాద, వేర్పాటువాద సంస్థలతో పీఎల్ఏ చేతులు కలిపింది. ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని ఓడించడానికి ఆయా సంస్థలు ఒక్క తాటిపైకి వచ్చాయి. పీఎల్ఏ 1989లో రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్పీఎఫ్) పేరిట ఒక రాజకీయ విభాగాన్ని ప్రారంభించింది. మణిపూర్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్‌లో పీఎల్ఏ భాగస్వామిగా చేరింది. -
రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి: ఆరుగురి జవాన్ల మృతి
మణిపూర్: మణిపూర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చాదల్ జిల్లాలో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఆదివారం మధ్యాహ్నం ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తనిఖీలు ముగించుకుని వెళ్తున్న రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మందుపాతరతో దాడికి పాల్పడ్డారు. మొత్తం ఆరు రైఫిల్స్‌ను ఉగ్రవాదులు ఎత్తుకుపోయినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.