breaking news
assam court
-
Manipur violence: మణిపూర్ కేసులు అస్సాంకు
న్యూఢిల్లీ: సీబీఐ దర్యాప్తు చేస్తున్న మణిపూర్ హింసాకాండ కేసులను అస్సాంకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఒకరిద్దరు న్యాయాధికారులను నియమించాల్సిదిగా గౌహతి హైకోర్టు ను నిర్దేశించింది. ఈ మేరకు ఇంకా పలు ఇతర ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, దారుణంగా లైంగిక హింసకు పాల్పడిన కేసులతో పాటు మొత్తం 17 కేసులు ఇందులో ఉన్నాయి. ఈ దశలో అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేర విచారణ, న్యాయ ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు ఈ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. సీబీఐ ఈ కేసులని అస్సాంకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు లాయర్లు చేసిన వాదనను తోసిపుచి్చంది. కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన అభ్యర్థనను ఆమోదించింది. ‘ ప్రధానంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. అస్సాంలో అది చాలా ఎక్కువగా ఉంది‘ అని పేర్కొంది. ‘ కుకీలు, మైతీలు రెండు తెగల వారూ ఎంతో నష్టపోయారు. కొండల్లో, లోయల్లో, అంతటా బాధితులు ఉన్నారు. అందుకే ఇరు వర్గాలకూ న్యాయంగా ఉండేలా తర్వాత అదేశాలిస్తాం‘ అని వివరించింది. మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన పలు ఆదేశాలు... ► బాధితులు, సాక్షులను కోర్టుకు పిలవకుండా వీడియో కాన్ఫరెన్స్ తదితర మార్గాల్లో వర్చువల్గా విచారించాలి. ► ఫస్ట్ క్లాస్ లేదా గౌహతి, అస్సాం సెషన్స్ కోర్టులో పని చేస్తున్న ఒకరు, లేదా ఇద్దరు జ్యుడీíÙయల్ మేజి్రస్టేట్లను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేయాలి. ► వారు మణిపూర్లో మాట్లాడే ఒకటి రెండు భాషలు తెలిసిన వారైతే మంచిది. ► నిందితుల హాజరు, రిమాండ్, కస్టడీ, దాని పొడిగింపు వంటి విచారణ ప్రక్రియలన్నీ ఆన్లైన్లో జరిపేందుకు అనుమతి. ► దూరం, భద్రత తదితర కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం. ► ప్రయాణ సమస్య కారణంగా నిందితులకు మణిపూర్ లోనే జ్యుడీíÙయల్ కస్టడీకి అనుమతి ► స్టేట్మెంట్ నమోదు తదితరాల కోసం మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఒకరు, లేదా ఇద్దరు మేజిస్ట్రేట్లను నియమించాలి. ► దోషుల గుర్తింపు పరేడ్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపేందుకు అనుమతి. ► సోదాలు, అరెస్ట్ వారెంట్లను కూడా ఆన్లైన్లో జారీ చేయొచ్చు. ► జస్టిస్ గీత మిట్టల్, సారథ్యంలోని ముగ్గురు మహిళా న్యాయమూర్తుల ప్యానల్ సజావుగా పని చేసేందుకు అనువైన ఆదేశాలను సెపె్టంబర్ 1న ఇస్తారు. -
కోర్టుకు వెళ్లిన ఏనుగు తల్లి.. పిల్ల
అసోంలోని ఓ కోర్టుకు సరికొత్త అతిథులు వచ్చారు. ఎవరా అని అనుకుంటున్నారా? ఓ ఏనుగు, దాని పిల్ల. వాటి సంరక్షణ బాధ్యత గురించి జడ్జి తేల్చాల్సి రావడంతో వీటిని కోర్టుకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే.. కోర్టు హాల్లోకి వాటిని తీసుకురావడం అసాధ్యం కాబట్టి, స్వయంగా జడ్జిగారే కోర్టు లాన్ వద్దకు వెళ్లి, అక్కడ ఆ తల్లీ పిల్లలను చూసి రావాల్సి వచ్చింది. ఈ ఘటన అసోంలోని మారుమూల ప్రాంతమైన హైలాకండి జిల్లాలో జరిగింది. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. ఈ రెండు ఏనుగులు సరిహద్దుల్లో భారతదేశం వైపు కనిపించాయి. అయితే, అవి తనవంటూ స్థానికుడు ఒకరు చెబుతున్నారు. అందులో ఆడ ఏనుగును తనవద్ద నుంచి ఎనిమిదేళ్ల క్రితం ఎవరో దొంగిలించారని ఆయన ఆరోపించారు. కానీ బంగ్లాదేశీ వ్యక్తి మాత్రం అది తప్పంటున్నాడు. అవి రెండూ తన ఏనుగులని, కొన్ని రోజుల క్రితం నుంచి తప్పిపోయాయని వాటి కోసం తాను అన్నిచోట్లా వెతికి, చివరకు బంగ్లాదేశ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని అన్నాడు. వాళ్లు సరిహద్దు దళం వారితో మాట్లాడి, తన ఏనుగులు రెండూ హైలాకండిలో ఉన్నట్లు చెప్పారని తెలిపాడు. అందుకే వాటిని ఎలాగోలా మళ్లీ తన ఊరికి తీసుకెళ్లడానికే వచ్చానన్నాడు. ఆ ఏనుగులు ఎవరివన్న విషయం కాసేపు పక్కన పెట్టి, ప్రస్తుతానికి అటవీ శాఖ అధికారి ఒకరికి వాటిని అప్పగించారు. వాటికి చక్కగా ఆహారం అందించాలని, జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. దాంతో ఏనుగులు అటు బంగ్లాదేశ్ వెళ్లాలో.. ఇటు భారత దేశంలో ఉండాలో తెలియక తికమక పడుతూ హాయిగా అటవీ శాఖ అధికారులు అందిస్తున్న చెరుకు గడలు, గడ్డి లాంటివి తింటూ కాలం గడిపేస్తున్నాయట. అయితే ఈ ఏనుగులు.. కోర్టు ప్రహసనాన్ని చూసేందుకు మాత్రం కోర్టు వద్దకు జనం తండోపతండాలుగా వచ్చారు.