breaking news
Arjun Kumar
-
నిజాలే చూపించాం
‘‘1982 మార్చి నెలలో రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. ఎన్టీ రామారావుగారు పెట్టిన పార్టీలో నేను చేసిన కృషి ‘బగ్గిడి గోపాల్’ చిత్రంలో చూపించాం. నా జీవితంలో జరిగిన కీలక సంఘటనలు ఈ సినిమాలో చూపిస్తాం’’ అన్నారు బగ్గిడి గోపాల్. ఆయన జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘బగ్గిడి గోపాల్’. బగ్గిడి గోపాల్ నిర్మించిన ఈ సినిమాకు అర్జున్ కుమార్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ కథ ఆదర్శంగా ఉంటుంది. పోలీస్ అధికారిగా నటిస్తున్నాను’’ అన్నారు సుమన్. ‘‘గోపాల్ ఎంఎల్ఏ అయిన తర్వాత జరిగిన సంఘటనలు నాకు తెలుసు. ఈ సినిమాలో అన్నీ నిజాలు చూపించారు. ముక్కుసూటి మనిషి అయిన తనను చాలా ఇబ్బంది పెట్టారు. అవి ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు మాజీ ఎంఎల్ఏ సంజయ్రావు. ‘‘దర్శకత్వంతో పాటు ఓ పాత్రలోనూ నటించాను’’ అన్నారు అర్జున్ కుమార్. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హీరోయిన్ చందన మాట్లాడారు. -
రాంలీలా మైదానంలో ద్రోణ్ కెమెరాలపై పోలీసు శాఖ అభ్యంతరం
న్యూఢిల్లీ: రాంలీలా మైదానంలో పది ద్రోణ్ కెమెరాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆచరణకు నోచుకునేవిధంగా కనిపించడంలేదు. ఇందుకు కార ణం పోలీసు శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడమే. పోలీసు శాఖ అధికారులందించిన సమాచారం ప్రకారం నగర పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా మనుషులతో పనిలేకుండా మానవ రహిత వాహనాలకు (యూఏవీ) అనుమతి లేదు. సాధారణంగా పౌరులు ఉపయోగించే ద్రోణ్లు అత్యంత చిన్నగా ఉంటాయి. వీటికి కెమెరాలను అమరుస్తారు. ఆ తర్వాత నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, సినిమా షూటింగ్ తదితర అవసరాలకు వినియోగిస్తుంటారు. వీటి పొడవు రెండు మీటర్లకు మించదు. బరువు కూడా రెండు కిలోల కంటే తక్కువగా ఉంటుంది. రిమోట్ ఆధారంగా పనిచేసే ఈ ద్రోణ్ల వేగం గంటకు 40 కిలోమీటర్లు. అనుమతి పొందలేదు: రాంలీలా కమిటీ ఈ విషయమై రాంలీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతానికి తాము పోలీసు శాఖ అనుమతి పొందలేదన్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి మాత్రం తీసుకెళ్లా మన్నారు. దీంతోపాటు కేంద్ర హోం శాఖ మం త్రితో కూడా మాట్లాడామన్నారు. వీటి విషయంలో పోలీసులకు ఎటువంటి అభ్యంతరమూ ఉండకపోవచ్చన్నారు. కాగా ద్రోణ్ కెమెరాలకు సంబంధించి రాంలీలా కమిటీనుంచి తమకు ఎటువంటి దరఖాస్తు అందలేదని ఉత్తర జిల్లా డీ సీపీ మధుర్ వర్మ చెప్పారు. ఒకవేళ ఎవరైనా దరఖాస్తు చేసుకున్నప్పటికీ అందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. భద్రతాపరంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన ఎర్రకోట వద్ద వీటిని వినియోగించేందుకు అనుమతి లేదన్నారు.