breaking news
Arizona hospital
-
బాక్సింగ్ గ్రేట్ ఇకలేడు
లాస్ ఏంజిలెస్: బాక్సింగ్ గ్రేట్ మహ్మద్ అలీ (74) ఇకలేరు. తన కెరీర్లో ఎందరో యోధులను మట్టికరిపించిన అలీ మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఫినిక్స్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం మరణించారు. అంతకు కొన్ని గంటల ముందు అలీ బతికే అవకాశాలు చాలా తక్కువని కుటుంబ సన్నిహితులు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 20వ శతాబ్దంలో టాప్ స్పోర్ట్స్ మన్‌గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాక్సింగ్ ప్రపంచాన్ని ఎదురులేకుండా ఏలారు. అభిమానులు 'ది గ్రేటెస్ట్'గా పిలుచుకునే అలీ 1981లో రిటైరయ్యారు. రికార్డు స్థాయిలో 56 విజయాలు, కేవలం ఐదు పరాజయాలతో కెరీర్ ముగించారు. మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్‌ను మూడుసార్లు సాధించారు. అలీ నాలుగు వివాహాలు చేసుకున్నారు. మొత్తం తొమ్మిదిమంది సంతానం. అలీ కూతురు లైలా తండ్రి అడుగుజాడల్లో నడిచి బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 1942 జనవరి 17న కెంటకీలోని లూయిస్విల్లేలో అలీ జన్మించారు. 12 ఏళ్లకే బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఆయన 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయ్యారు. 1960ల్లో ఆయన బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించారు. కాగా వియత్నాంపై అమెరికా యుద్ధానికి నిరసనగా ఇస్లాం మతం స్వీకరించారు. అలీ మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. కెంటకీలోని లూయిస్విల్లేలో అలీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. We lost the #GreatestOfAllTime #MohammedAli #RIP https://t.co/NHURd1f0GQ — Rana Daggubati (@RanaDaggubati) 4 June 2016 I pray for #MohammedAli .. a true hero , a true inspiration — Huma Qureshi (@humasqureshi) 4 June 2016 Rest in peace legend @MuhammadAli #FloatLikeAButterfly #StingLikeABee #GOAT — Abhishek Bachchan (@juniorbachchan) 4 June 2016 -
మృత్యువుతో బాక్సింగ్ గ్రేట్ పోరాటం
లాస్ ఏంజిలెస్: బాక్సింగ్ గ్రేట్ మహ్మద్ అలీ (74) మృత్యువుతో పోరాడుతున్నాడు. శ్వాసకోస సంబంధిత సమస్యతో ఏరిజోనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలీ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు కుటుంబ సన్నిహితులు చెప్పారు. ఈ ప్రపంచ హెవీ వెయిట్ మాజీ చాంపియన్ జీవితం చరమాంకంలో ఉన్నట్టు తెలిపారు. అలీ బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కుటుంబ సన్నిహితులు చెప్పారు. మరికొన్ని గంటలు బతకడం కూడా కష్టమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. 20వ శతాబ్దంలో టాప్ స్పోర్ట్స్ మెన్లో ఒకడిగా అలీ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాక్సింగ్ ప్రపంచాన్ని ఎదురులేకుండా ఏలాడు. అభిమానులు 'ది గ్రేటెస్ట్'గా పిలుచుకునే అలీ 1981లో రిటైరయ్యాడు. రికార్డు స్థాయిలో 56 విజయాలు, కేవలం ఐదు పరాజయాలతో కెరీర్ ముగించాడు. మూడుసార్లు హెవీవెయిట్ టైటిల్‌ను మూడుసార్లు సాధించాడు. అలీ నాలుగు వివాహాలు చేసుకున్నాడు. మొత్తం తొమ్మిదిమంది సంతానం. అలీ కూతురు లైలా తండ్రి అడుగుజాడల్లో నడిచి బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.