breaking news
aravakuricci
-
ఒకటి గ్యారంటీ!
► అరవకురిచ్చిల హోరాహోరీ ► దళపతికి మద్దతు జోరు ► సర్వేతో వెలుగు ► {పచారం ముమ్మరం ► తనిఖీల్లో పట్టుబడుతున్న కరెన్సీ రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో జరగనున్న ఉపఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌లకు తలా ఓ స్థానంలో గెలుపు ఖాయం అన్నది తేలింది. ఇందుకు తగ్గట్టుగా లయోలా విద్యార్థుల సర్వేలో స్పష్టమైంది. అరవకురిచ్చిలో మాత్రం ఇద్దరి మధ్య సమరం హోరాహోరీగా మారింది. ఈ సర్వే నేపథ్యంలో ఆయా స్థానాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ సుడిగాలి పర్యటన సాగించే పనిలో పడ్డారు. సాక్షి, చెన్నై : తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పర గుండ్రంలతో పాటు పుదుచ్చేరిలోని నెల్లితోప్పు స్థానానికి ఉపఎన్నిక 19వ తేదీ జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల తేదీ సమీపిస్తుం డడంతో ఓట్ల వేటలో అభ్యర్థులు, వారి మద్దతు దారులు దూసుకెళుతున్నారు. డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. అరవకురిచ్చిలో శనివారం విసృ్తతంగా పర్యటించారు. ఆదివారం పుదుచ్చేరిలో ఆయన పర్యటన సాగనుంది. తన పర్యటనలో తాజాగా, అన్నాడీఎంకే సర్కారు పాలనను ఎత్తి చూపుతూ, ఆరు నెలల ఆ ప్రభుత్వ తీరుకు ప్రజలు ఇచ్చే తీర్పుగా ఈ ఎన్నికలు నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ విసృ్తతంగా పర్యటించే పనిలో పడ్డారు. కాసేపు ఓపెన్ టాప్ వాహనంలో, మరి కాసేపు నడకతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్, పీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ యువజన నేత, ఎంపీ అన్భుమణి రాందాసు, ఆ పార్టీ అధ్యక్షుడు జీకే మణి వేర్వేరుగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. పుదుచ్చేరిలో సీఎం జయలలిత గళాన్ని అనుకరిస్తూ, ఐరన్(ఉక్కు) అనే కార్యకర్త ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండడం ఆ పార్టీ అభ్యర్థి ఓం శక్తి శేఖర్‌కు కొంత మేరకు ఊరటే. ప్రచారం హోరెత్తి ఉండడంతో, ఆయా నియోజకవర్గాల్లో తనిఖీలు ముమ్మరం అయ్యారుు. అరవకురిచ్చిలో జరిపిన తనిఖీల్లో ఓ మినీ వ్యాన్‌లో రూ. 34.75 లక్షలు, మరో చోట రూ. 11 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరుుతే, రూ. 34. 75 లక్షలు రామనాథపురానికి చెందిన ధాన్యం వ్యాపారికి చెందినట్టు గుర్తించారు. లెక్కలు లేని దృష్ట్యా, ఆ నగదును సీజ్ చేశారు. కాగా, ఈ నోట్లన్నీ తాజాగా కాలం చెల్లినట్టు ప్రకటించినవే. గ్యారంటీ : ఉప ఎన్నికల్లో ఓట్ల వేట జోరందుకుని ఉంటే, లయోల విద్యార్థులు 874 మంది ఆయా నియోజకవర్గాల్లో సర్వే సాగించి ఉన్నారు. ఈ వివరాలను శనివారం ప్రకటించారు. తంజావూరు నియోజకవర్గాన్ని డీఎంకే కై వసం చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు ఆ సర్వే మేరకు తేల్చారు. తిరుప్పరగుండ్రం అన్నాడీఎంకే ఖాతాల పడడం ఖాయం అని, ఇక్కడ కేవలం శీనివేల్ మరణం కారణంగా సానుభూతి ఓట్లు అభ్యర్థికి కలివచ్చే అంశంగా తేలింది. ఇక, అరవకురిచ్చిలో డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులకు మధ్య సమరం హోరా హోరీగా సాగుతున్నట్టు, గెలుపు ఎవరి పక్షమో అన్నది తేల్చ లేని పరిస్థి తి నెలకొన్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇక, గత అన్నాడీఎంకే పాలన అద్భుతం అని, కొన్నాళ్ల పాటుగా సాగిన పన్నీరు సెల్వం రూపంలో కొంత మచ్చ తప్పలేదని పాలనా పరంగా సంధించిన ప్రశ్నకు సమాధానాలు వచ్చారుు. తాజాగా, అరుుతే, పాలన మరీ అధ్వానంగా తయారై ఉన్నట్టు మెజారిటీ శాతం స్పష్టం చేశారు. 65 శాతం మంది పాలనకు వ్యతిరేకంగా, 21 శాతం మద్దతుగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసి ఉన్నారు. ఇక, పుదుచ్చేరి నెల్లితోపు నియోజకవర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి కై వసం చేసుకుంటారని ప్రకటించారు. దళపతికి మద్దతు: రాష్ట్రంలో సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉన్న దృష్ట్యా, రాష్ట్రంలో ప్రజాదరణ, ప్రజల పక్షాన నిలబడి ముందుకు సాగుతున్న నేతల్లో డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌కు మద్దతు పలికిన వారే ఎక్కువ. ఆయన ప్రజా పయనానికి 79.9 శాతం మంది మద్దతు ఇచ్చి ఉండడం విశేషం. తదుపరి జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత , తమిళమానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్లకు మద్దుతగా ఓట్లు రావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో అవినీతి పేరుకు పోరుు ఉన్న శాఖలుగా రిజిస్ట్రేషన్, పోలీసు, ఆరోగ్యం, ప్రజా పనులు, రవాణాలు జాబితాలోకి ఎక్కారుు. -
ఉపఎన్నికలపై పిల్
► అభ్యర్థులను అనర్హులను చేయండి ►తంజావూరు, అరవకురిచ్చిల ఉపఎన్నికలపై వ్యాజ్యం ►విచారిస్తామని న్యాయమూర్తుల హామీ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన తంజావూరు, అరవకురిచ్చి అభ్యర్థులు తాజా ఉపఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కరూరు జిల్లా పల్లపట్టి గ్రామానికి చెందిన ఏఏ సాధిక్ ఆలి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందులో ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో మధురై జిల్లా అరవకురిచ్చి అన్నాడీఎంకే అభ్యర్థిసెంథిల్ బాలాజీ, డీఎంకే అభ్యర్థి కేసీ పళనిస్వామి, తంజావూరు నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి రంగస్వామి అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఓటర్లను మభ్యపెట్టే రీతిలో వ్యవహరించారు. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులపై అనేక క్రిమినల్ కేసులు దాఖలయ్యారుు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఇవే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు, 19వ తేదీన పోలింగ్ జరుగుతుండగా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ధిక్కరించి అక్రమాలకు పాల్పడిన రాజకీయ పార్టీలు, ఎన్నికల చిహ్నం, అభ్యర్థులపై భారత ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే సదరు అభ్యర్థులకు సంజారుుషీ నోటీసులు జారీచేయాల్సి ఉంది. వారి నుంచి వివరణ వచ్చే వరకు ఆయా పార్టీలు, అభ్యర్థులు, చిహ్నం లపై తాత్కాలిక నిషేధాన్ని విధించాల్సి ఉంది. అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో అటువంటి చర్యలు ఏమీ చేపట్టలేదు. అరవకురిచ్చి, తంజావూర్లలో ఈనెల 19వ తేదీన ఉప ఎన్నికలు సజావుగా, నీతిబద్ధంగా జరగాలంటే అన్నాడీఎంకే, డీఎంకే తదితర అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన సెంథిల్ బాలాజీ, కేసీ పళనిస్వామి పేర్లను ఉప ఎన్నికల బ్యాలెట్ పేపర్ల నుంచి తొలగించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి. అన్నాడీఎంకే, డీఎంకే ఎన్నికల చిహ్నంను వారికి కేటారుుంచరాదు. ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులని ప్రకటించాలని ప్రజాప్రయోజన వాజ్యంలో పేర్కొన్నాడు. ఈ వాజ్యం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహాదేవన్‌ల ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. ఎన్నికల కమిషన్ తరఫున హాజరైన న్యాయవాది తన వాదనను వినిపిస్తూ, క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం అమల్లో ఉంది. క్రిమినల్ కేసుల్లో చార్జిషీట్ దాఖలైన వారిని కూడా అనర్హులుగా చేయాలనే అంశం ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. తంజావూరు, అరవకురిచ్చిలపై ఇప్పటికే మరో కేసు విచారణలో ఉన్నందున ఈ వాజ్యాన్ని సైతం వాటితో కలిపి విచారిస్తామని న్యాయమూర్తులు బదులిచ్చారు.