సంక్రాంతి వస్తున్నాం సూపర్ హిట్.. అవార్డ్ కొట్టేసిన ఐశ్వర్య రాజేశ్!
హీరో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీమామ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వెంకటేశ్ భార్యగా తనదైన స్టైల్లో అభిమానులను మెప్పించింది. గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే అంటూ సాగే సాంగ్‌లో ఐశ్వర్య రాజేశ్ అదరగొట్టింది. ఈ మూవీలో తన నటనకు గానూ ఐశ్వర్య రాజేశ్ క్రేజీ అవార్డ్‌ను సొంతం చేసుకుంది.టాలీవుడ్లో అందించే ప్రముఖ అప్సర అవార్డ్ ఐశ్వర్య రాజేశ్‌ను వరించింది. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఐశ్వర్య రాజేశ్ అవార్డ్ అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు అనిల్ రావిపూడిని ప్రశంసించారు. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)