కళాత్మక కెరీర్‌కు మార్గాలు..
ఫొటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్ప్చర్ (శిల్పం), అప్లైడ్ ఆర్ట్, సంగీతం, నృత్యం తదితర కోర్సులు ఫైన్ ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ), ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో సర్టిఫికెట్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు కోర్సులున్నాయి. ఆఫర్ చేసే విద్యా సంస్థను బట్టి ప్రవేశ అర్హతలు, ఎంపిక విధానం, కాల వ్యవధి మారుతుంటాయి.
కళాత్మక విద్యకు కేరాఫ్ జేఎన్ఏఎఫ్ఏయూ
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ).. ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు పెట్టింది పేరు. ఇవి ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి అందిస్తున్న కోర్సులు.. నోట్: అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఫొటోగ్రఫీలతో పాటు యానిమేషన్ కోర్సులను సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్ కింద కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫీజు ఏడాదికి రూ.35 వేలు.ప్రవేశాలు: జేఎన్ఏఎఫ్ఏయూ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. బీఎఫ్ఏ (పెయింటింగ్, స్కల్ప్చర్, అప్లయిడ్ ఆర్ట్, యానిమేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు మూడు పేపర్లు ఉంటాయి. అవి ఆబ్జెక్ట్ డ్రాయింగ్, మెమరీ డ్రాయింగ్ కలరింగ్, కామన్ ఆబ్జెక్టివ్ పేపర్ (జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్, జనరల్ ఆర్ట్ ఓరియెంటెడ్). బీఎఫ్ఏ (ఫొటోగ్రఫీ)కు కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్; ఆబ్జెక్టివ్ పేపర్లు రాయాలి. ఈ ఏడాది ఎంట్రన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 31 (అపరాధ రుసుం లేకుండా).
పీజీ కోర్సులు: ఎంఎఫ్ఏ అప్లయిడ్ ఆర్ట్, ఎంఎఫ్ఏ పెయింటింగ్, ఎంఎఫ్ఏ స్కల్ప్చర్, ఎంఎఫ్ఏ ఫొటోగ్రఫీ కోర్సులున్నాయి. యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రన్స్ ద్వారా మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఎన్ఏఎఫ్ఏయూ బ్రిడ్జ్ కోర్సు(ఫొటోగ్రఫీ)ను కూడా ఆఫర్ చేస్తోంది. అర్హత: డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ. యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. దీంతో పాటు వర్సిటీ.. పార్ట్ టైం కోర్సులనూ ఆఫర్ చేస్తోంది.
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) పరిధిలోని శ్రీ వేంకటే శ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రవేశాలు: సాధారణంగా ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను మే చివరి వారం/జూన్ మొదటి వారంలో విడుదల చేస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్లకు వేర్వేరుగా నిర్వహించే పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ (స్కెచింగ్ నైపుణ్యాన్ని పరీక్షించే); కలర్ డిజైన్; సంబంధిత సబ్జెక్టుపై పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి.
120 మార్కులకు ఫొటోగ్రఫీ కోర్సుకు నిర్వహించే ఆప్టిట్యూడ్ పరీక్షలో ఫొటోగ్రఫీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్, సౌండ్ పెర్సెప్షన్, హిస్టరీ అండ్ కల్చర్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ రీజనింగ్లతో పాటు కంపోజిషన్ అండ్ విజువలైజేషన్పై ప్రశ్నలుంటాయి.
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.. ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి పలు కోర్సులను అందిస్తోంది. అవి..
ఎంఏ మ్యూజిక్:
వీణ, గాత్రం(వోకల్) విభాగాల్లో 10 చొప్పున సీట్లున్నాయి.
అర్హత: వోకల్ మ్యూజిక్ లేదా వీణ మ్యూజిక్ ఒక ప్రధాన సబ్జెక్టుగా గుర్తింపు పొందిన డిగ్రీ/ ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీతో పాటు వోకల్ లేదా వీణ మ్యూజిక్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్/ ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీతో పాటు ఆలిండియా రేడియో క్లాసికల్ మ్యూజిక్ ఆడిషన్ బోర్డు నుంచి వోకల్ లేదా వీణలో గ్రేడింగ్.
కరిక్యులం: రెండేళ్ల కాల వ్యవధి కలిగిన కోర్సులో మ్యూజికాలజీ అండ్ హిస్టరీ ఆఫ్ మ్యూజిక్; మనోధర్మ సంగీత, రాగ ఆలాపన వంటి అంశాలు కరిక్యులంలో ఉంటాయి.
ఎంఏ (భరతనాట్యం):
విశ్వవి అర్హత: నాట్య విశారదతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డ్యాన్స్/ యూనివర్సిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ/ విశ్వవిద్యాలయం నిర్దేశించే తత్సమాన అర్హతలు.
రిక్యులంలో థియరీతో పాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రాధా న్యం ఉంటుంది. క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్‌లకు సంబంధించిన ఇతర వ్యవస్థల పరిజ్ఞానాన్ని అందిస్తారు.
ఎంఏ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్:
ఎంఏ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఈ కోర్సులో మొదటి మూడేళ్లు మ్యూజిక్, డ్యాన్స్ సబ్జెక్టులు ఉమ్మడిగా ఉంటాయి. తర్వాత రెండేళ్లు వీణ/ వోకల్/ భరతనాట్యంలలో ఏదో ఒక స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి అర్హత: ఇంటర్మీడియెట్/10+2. డిగ్రీ ఉండి గురువు వద్ద శిక్షణ పొందుతున్న వారికి నేరుగా నాలుగో ఏడాదిలో ప్రవేశం కల్పిస్తారు.ఎంపిక విధానం: యూనివర్సిటీ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈవినింగ్ కోర్సులు: విశ్వవిద్యాలయం రెండేళ్ల కాల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అవి..
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ వోకల్ (సెల్ఫ్ ఫైనాన్స్).
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ వీణ(సెల్ఫ్ ఫైనాన్స్).
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ భరతనాట్యం (సెల్ఫ్ ఫైనాన్స్).
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ట్రెడిషనల్ ఫోక్ మ్యూజిక్ (సెల్ఫ్ ఫైనాన్స్).
అర్హత: ఈ కోర్సులకు నిర్దిష్ట అర్హతంటూ లేదు. ఆసక్తి ఉన్న వారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఎఫ్ఏ: నాలుగేళ్ల కాల వ్యవధి గల బీఎఫ్ఏ కోర్సుకు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు అర్హులు. రెగ్యులర్‌లో 20, సెల్ఫ్ ఫైనాన్స్‌లో 10 మొత్తం 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక: యూనివర్సిటీ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రెండేళ్ల వ్యవధి గల ఎంఎఫ్ఏ కోర్సుకు బీఎఫ్ఏ ఉత్తీర్ణులు అర్హులు. సెల్ఫ్ ఫైనాన్స్ విభాగంలో 30 సీట్లుంటాయి. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంఏ (డ్యాన్స్): ఈ కోర్సులో సెల్ఫ్ ఫైనాన్స్ విభాగంలో పది సీట్లున్నాయి. ఇందులో ప్రవేశాలకు అర్హత: బీఏ డ్యాన్స్/ బీఏ/ బీకామ్/ బీఎస్సీ/ బీసీఏ/ బీఈ/ ఎంబీబీఎస్. డ్యాన్స్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎంఏ మ్యూజిక్: రెగ్యులర్‌లో ఐదు సీట్లు, సెల్ఫ్ ఫైనాన్స్ విభాగంలో ఐదు మొత్తం 10 సీట్లున్నాయి.అర్హత: బీఏ మ్యూజిక్ లేదా బి.మ్యూజిక్/ ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మ్యూజిక్‌లో డిప్లొమా/సర్టిఫికెట్. లేదా డిగ్రీతో పాటు ఆల్ఇండియా రేడియో ద్వారా కర్ణాటక సంగీతంలో ఏదైనా గ్రేడ్ ఉన్న అభ్యర్థులు. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు ప్రముఖ విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయంలోని లలితకళా పీఠం వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఎఫ్ఏ (శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్): ఇందులో మొత్తం 25 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. 2011 మార్చిలో గానీ, ఆ తర్వాత గానీ ఇంటర్ ఉత్తీర్ణత/ దేవాదాయ శిల్పకళలో నాలుగేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసుండాలి.ఎంఏ- కర్ణాటక సంగీతం (గాత్రం/మృదంగం, వీణ, వయోలిన్): 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక సంగీతంలో డిగ్రీ/ ఏదైనా డిగ్రీతో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థ నుంచి సంగీతంలో (సంబంధిత అంశంలో) డిప్లొమా/ ఏదైనా డిగ్రీతో పాటు సంగీతంలో (సంబంధిత అంశంలో) ఆకాశవాణి బి గ్రేడ్ ఆర్టిస్టు అయుండాలి.
ఎంపీఏ- కూచిపూడి నృత్యం/ ఆంధ్ర నాట్యం: ఇందులో 20 సీట్లున్నాయి. కోర్సు కాల వ్యవధి రెండేళ్లు.
అర్హత: కూచిపూడి నృత్యంలో డిగ్రీ ఉండాలి. లేదా ఏదైనా డిగ్రీతో పాటు కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సులో ఉత్తీర్ణత/ ప్రసిద్ధ నాట్య సంస్థలలో ఐదేళ్ల ప్రదర్శనానుభవం ఉన్నట్లు సర్టిఫికెట్/ సంబంధిత అంశంలో దూరదర్శన్ బి గ్రేడ్ ఆర్టిస్టు అయి ఉండాలి.ఎంపీఏ-జానపద కళలు: ఇందులో 20 సీట్లున్నాయి. కోర్సు కాల వ్యవధి రెండేళ్లు.అర్హత: జానపద కళల్లో బీఏ డిగ్రీ లేదా తెలుగు రెండో భాషగా బీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీఎఫ్ఏ/బీఏ (లాంగ్వేజెస్) ఉత్తీర్ణతతో పాటు జానపద కళలు, రంగస్థల కళలు, సంగీతం, నృత్యాలలో డిప్లొమా లేదా సర్టిఫికెట్/ రేడియో లేదా దూరదర్శన్‌లో జానపద సంగీతం లేదా నృత్యం సర్టిఫికెట్.
ఇతర కోర్సులు
సంగీత శాఖ: పీహెచ్డీ- కర్ణాటక సంగీతం; కళాప్రవేశిక- కర్ణాటక సంగీతం (గాత్రం/మృదంగం/ వీణ/ వయోలిన్/ వేణువు/నాదస్వరం/డోలు); కళాప్రవేశిక- భక్తి సంగీతం; డిప్లొమా-లలిత సంగీతం; డిప్లొమా-హరికథ; ప్రాథమిక -మనోధర్మ సంగీతం; ప్రవీణ-మనోధర్మ సంగీతం.
నృత్య శాఖ: పీహెచ్డీ నృత్యం; డిప్లొమా- కూచిపూడి/ ఆంధ్ర నాట్యం; డిప్లొమా-యక్షగానం; డిప్లొమా- సాత్వికాభినయం; కళాప్రవేశిక- కూచిపూడి నృత్యం.జానపద కళల శాఖ: పీహెచ్డీ జానపద కళలు; పీజీ డిప్లొమా-జానపద సంగీతం; పీజీ డిప్లొమా-జానపద నృత్యం; సర్టిఫికెట్- జానపద సంగీతం; సర్టిఫికెట్- జానపద నృత్యం; సర్టిఫికెట్- జానపద వాద్యం తదితర కోర్సులు.
దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ: మే 30, 2014.
ప్రవేశ పరీక్షల తేదీలు: జూన్ 23 నుంచి జూన్ 30 వరకు.
వెబ్సైట్: www.teluguuniversity.ac.in