breaking news
Appendicitis operations
-
నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!
బాలీవుడ్ బుల్లి తెర నటుడు అర్జున్ బిజ్లానీకి గతవారమే ముంబై ఆస్పత్రిలో అపెండిసైటిస్ అపరేషన్ జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ విషయాన్నే ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శస్త్ర చికిత్స బాగా జరిగిందని, తాను కోలుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తనకు పూర్తిగా నయం అయ్యేంత వరకు వైద్యులు మంచి కేరింగ్‌గా చూసుకున్నారని అన్నాడు. తనను కోలుకునేలా చేసిన వైద్య బృందానికి, అలాగే అత్యంత జాగ్రతగా చూసుకున్న భార్య నేహ స్వామికి కృతజ్ఞతలంటూ పోస్ట్ పెట్టాడు. అసలేంటీ అపెండిసైటిస్? ఎందువల్ల వస్తుందంటే.. కడుపులో ఉండే పెద్ద పేగుకు తోకలా అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. దీనివల్ల ఏర్పడే సమస్యనే అపెండిసైటిస్ అని పిలుస్తారు. అపెండిక్స్‌లో మలినాలు చేరడం వల్ల లేదా బ్యాక్టీరియా సోకినా వాటి గోడలు వాచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా కడుపులో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. ఆ నొప్పినే అపెండిసైటిస్ లేదా 24 గంటల నొప్పి అని అంటారు. ఈ అపెండిక్స్ కేవలం 3 నుంచి 4 అంగుళాల పొడవే ఉంటుంది. పెద్ద ప్రేగుకు అనుసంధానమై చిన్న ట్యూబ్ తరహాలో కనిపిస్తుంది. ఇందులోకి మలినాలు చేరితే అపెండిసైటిస్ సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. View this post on Instagram A post shared by Arjun Bijlani 🧿 (@arjunbijlani) ఎందుకు వస్తుందంటే.. అపెండిక్స్ లోపలి పొరలు శ్లేష్మం లేదా చీమును ఉత్పత్తి చేస్తాయి. ఆ చీము పెద్ద పేగు మొదటి భాగం (Cecum)లోకి వెళ్తుంది. ఈ సెకమ్ మలాన్ని అపెండిక్స్‌లోకి రాకుండా అడ్డుకుంటుంది. ఒక వేళ ఈ చీము సెకమ్‌లోకి ప్రవేశించకపోతే పెద్ద పేగులోని మలం అపెండిక్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా అపెండిక్స్ గోడలు వాచిపోయి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. లేదా అపెండిక్స్‌లో ఏదైనా పూడిక ఏర్పడితే.. అందులోని బ్యాక్టీరియా గోడలపై దాడి చేస్తుంది. ఫలితంగా అపెండిక్స్‌లో వాపు ఏర్పడి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. ఒక్కోసారి కేన్సర్ వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు. 24 గంటల నొప్పి అనడానికి రీజన్.. సాధారణ కడుపు నొప్పిలా వస్తుంది. ఆ తర్వాత క్రమేణ కొన్ని రోజులకు నొప్పి తీవ్రమవుతుంది. జ్వరం కూడా వస్తుంది. ఈ నొప్పి కాస్త తారాస్థాయికి చేరుకుని భరించలేనిధిగా ఉన్నప్పుడూ 24 గంటల్లోపు సర్జరీ చేయాలి లేదంటే చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దీన్ని 24 గంటల నొప్పి అని అంటారు. ఎలా గుర్తిస్తారంటే.. అంత సులభంగా ఈ వ్యాధిని గుర్తించలేం. ఇది ఉదరంలో ఏర్పడే గాల్ బ్లాడర్, మూత్రకోశాలు, పేగుల ఇన్ఫెక్షన్, ఓవరీ, క్రాన్ వాటికి సంబంధించిన సాధారణ నొప్పిలా ఉంటుంది. అందువల్ల వైద్యులు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ పరీక్షలు చేసి ఈ సమస్యను గుర్తిస్తారు. పెండిసైటిస్ ప్రారంభంలో తెల్లరక్త కణాలు సాధారణంగానే ఉంటాయి. కానీ, ఇన్ఫెక్షన్ మొదలైన తర్వాత వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వాటి ఆధారంగా వైద్యులు అపెండిసైటిస్ సమస్యను గుర్తిస్తారు. సర్జరీ తప్పదా అంటే.. చాలా కేసుల్లో సర్జరీ ద్వారా అపెండిక్స్ను పూర్తిగా తొలగిస్తుంటారు. నొప్పి తీవ్రమైన వెంటనే సర్జరీ చేయకపోతే అపెండిక్స్ పగిలిపోయి అందులోని పదార్థాలు ఉదరంలోకి చేరుతాయి. ఫలితంగా అక్కడ కూడా వాపు ఏర్పడి ‘పెరిటోనైటిస్’ అనే సమస్య ఏర్పడుతుంది. వెంటనే సర్జరీ చేసి అపెండిక్స్ తొలగించకపోతే ప్రాణాలు పోతాయి. ఈ సమస్య ముందుగానే గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ ద్వారా తగ్గించొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. నివారణ.. ఈ అపెండిక్స్ అవయవం రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో పెరిగే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు ఔషదంలా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. అపెండిక్స్లోని గోడల్లో ఉండే లింఫాటిక్ కణజాలం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే దీన్ని పూర్తిగా తొలగించినా పెద్దగా సమస్యలు కూడా ఏమీ లేవని పలు పరిశోధనల్లో నిరూపితమయ్యింది. కానీ అపెండిసైటిస్ రాకుండా నివారణ మార్గాలు మాత్రం ఏమీ లేవు. పరిశోధనల్లో మాత్రం అధిక పీచు పదార్థాలను ఆహారంగా తీసుకొనేవారిలో ఈ సమస్య తక్కువగా ఉన్నట్లు తేలింది. (చదవండి: హీరో అజిత కుమార్ ఎదుర్కొంటున్న వ్యాధేంటీ? దేని వల్ల వస్తుందంటే..!) -
టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనున్న స్టార్ ప్లేయర్
ముంబై: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కనున్న భారత జట్టుతో స్టార్ ఆటగాడు కే ఎల్ రాహుల్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. అపెండిసైటిస్‌కు జరిగిన సర్జరీ కారణంగా అతను పూర్తి ఫిట్నెస్ సాధించాల్సి ఉండింది. ఈ క్రమంలో అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో జట్టుతో పాటు ఇంగ్లండ్ బయల్దేరేందుకు బీసీసీఐ పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే జట్టులోకి రావొచ్చని జట్టు ఎంపిక సమయంలోనే సెలక్టర్లు పేర్కొన్న విషయం విధితమే. ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో రాహుల్ అపెండిసైటిస్‌తో బాధ పడ్డాడు. రాహుల్ చివరిసారిగా 2019 సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో టెస్టులో ఆడాడు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో జట్టులోనే ఉన్నప్పటికీ అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. 29 ఏళ్ల రాహుల్ ఇప్పటి వరకు 36 టెస్టుల్లో 2006 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 11 అర్ధశతకాలున్నాయి. ఇదిలా ఉంటే, కోహ్లి సారథ్యంలోని భారత జంబో జట్టు జూన్ 2న ఇంగ్లండ్ బయల్దేరనుంది. ఈ పర్యటనలో తొలుత(జూన్ 18న) డబ్ల్యూటీసీ ఫైనల్ల్లో న్యూజిలాండ్ తో తలపడనున్న టీమిండియా .. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. -
కాసులకు కక్కుర్తి.. కడుపుకు కోత
* అవసరం లేకున్నా.. 45 మంది విద్యార్థులకు అపెండిసైటిస్ ఆపరేషన్! * కరీంనగర్ జిల్లాలో రోజుకో చోట * వెలుగు చూస్తున్న వ్యవహారం రాయికల్/గొల్లపల్లి: అవసరం లేకున్నా అపెండిసైటిస్ ఆపరేషన్లు చేస్తున్న ఘటనలు కరీంనగర్ జిల్లాలో రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ఇటీవల కథలాపూర్ మండలం గంభీర్పూర్, దూలూరు తదితర గ్రామాల్లో విద్యార్థులకు ఇలాంటి ఆపరేషన్లు చేసినట్లు తేలగా.. తాజాగా రాయికల్ మండలం మూటపల్లిలో 50 మందికి, గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేటలోనూ సుమారు 45 మంది విద్యార్థులకు అపెండిసైటిస్ ఆపరేషన్లు చేశారు. పలువురు వైద్యులతో కుమ్మక్కై ఆర్ఎంపీలే ఈ దందా సాగించినట్లు ఆరోపణలొస్తున్నాయి. రాయికల్ మండలం మూటపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 34 మందికి ఈ ఏడాది కాలంలో అపెండిసైటిస్ ఆపరేషన్లు అయ్యాయి. కడుపునొప్పి వచ్చిందని చెబితే చాలు.. గ్రామంలోని ఆర్ఎంపీ జగిత్యాలకు తీసుకుని పోయి ఆపరేషన్ చేయిస్తున్నారు. ఇలాంటి కేసులకు రూ. 20 వేలు బిల్లు తీసుకుని ఆపరేషన్ చేసిన వైద్యులు 40 శాతం, ఆర్ఎంపీలకు 60 శాతం సొమ్ము పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అనవసరపు ఆపరేషన్ల వ్యవహారంపై రాయికల్ తహసీల్దార్ చంద్రప్రకాశ్ గురువారం గ్రామంలో విచారించి, విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేటలో 45 మంది విద్యార్థులకు అపెండిసైటిస్, 10 మంది మహిళలకు గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు చేసినట్లు సమాచారం. అపెండిసైటిస్ బాధితుల్లో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే. వీరికి సైతం జగిత్యాలలోని ఆస్పత్రిలోనే ఆపరేషన్ చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారు లు విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది.