Antonio guteras
-
సెలవిక సమ్మర్‌కు సరదాగా స్కూల్‌కు
సెలవులు అయిపోయాయి.రేపో మాపో బడిగంట. ఇక అమ్మ ‘లేవరా’ అంటుంది. బయట స్కూల్ బస్ హారన్ మోగుతుంది. టీచర్ గుర్తొచ్చి భయమేస్తుంది. స్కూలుకు పోబుద్ధి కాదు. రెండు నెలల సెలవుల తర్వాత పిల్లలకు ఇలా అనిపించడం మామూలే. దీనిని స్కూల్ ఫీవర్ అనొచ్చు. అయితే ‘ఇలా నీకొక్కడికే కాదు... క్లాసంతా’ అని చెప్పాలి. పిల్లల్ని బడికి హుషారుగా సిద్ధం చేయాలి.తెలుగు రాష్ట్రాల్లో బడిగంట మోగే వేళన పిల్లలకు ఎన్నో సందేహాలు, లోలోపలి భయాలు, చిన్నపాటి ఆందోళనలు ఉంటాయి. కొత్త స్కూల్‌కి, కొత్త క్లాస్‌కి, కొత్త సెక్షన్‌కి మారడం... మళ్లీ ఆ భారీ స్కూల్ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టడం... కొత్త టీచర్లను ఫేస్ చేయడం... అదీగాక ఇన్నాళ్లూ ఫోన్ చూసిన కళ్లతో రేపు బ్లాక్‌బోర్డ్ చూడాలంటే కష్టమే. అందుకే స్కూల్ ఫీవర్ తెచ్చుకుంటారు. అయితే దానికి విరుగుడు మాత్ర ఉంది.‘స్కూల్ ఫీవర్’ ఎందుకు?రెండు నెలలు ఇష్టానుసారం గడిచి ఉంటాయి. లేట్‌గా లేవడం, ఆడుకోవడం, టీవీ, నో హోంవర్క్.... ఇప్పుడు మళ్లీ టైమ్‌కి లేవాలి, ఇంట్లో స్కూల్లో రూల్స్ వస్తాయి... బ్రెయిన్ కి ఇది సడన్ బ్రేక్‌లా ఉంటుంది. అందుకే కడుపులో తిప్పేసినట్టు, ఏడుపు వచ్చేట్టు, చిరాకు కోపం, ఏదైనా ఎత్తుగడ వేయాలనిపించడం... పిల్లల్ని గమనించి మొదట వారిని ‘చిన్న పనుల్లో’ పెట్టాలి. ‘పుస్తకాలకు అట్టలు వేద్దాం రా’, ‘కొత్త పెన్ను పెన్సిలు బాక్స్‌లో పెట్టుకున్నావా?’, ‘యూనిఫామ్ సైజ్ చెక్ చేద్దాంరా’... ఈ పనులు చేయిస్తుంటే పిల్లల మైండ్‌కి ‘ఓకే, స్కూల్‌కి రెడీ అవ్వాలన్నమాట’ అనే ఫీలింగ్ వస్తుంది. ఫీవర్ దానంతట అదే తగ్గిపోతుంది.కొత్త బ్యాగ్ బెంగను పోగొడుతుందా?పోగొడుతుంది. కానీ బ్యాగ్ ఒక్కటే చాలదు. స్కూల్ ఫస్ట్ డే ఉదయం పిల్లలు లేచి చేసే మూడు పనులు వారి స్కూల్ ఫీవర్‌ని తరిమి కొడతాయి. ∙లేవగానే వారు చక్కగా తయారయ్యేలా చూసి అద్దంలో వారిని వారికి చూపించాలి. కొత్త యూనిఫామ్‌లో భలే బాగున్నావ్ అనాలి. ఏదో ఒక సరదా మాట చెప్పి నవ్వించాలి. నవ్వితే బ్రెయిన్ ‘నేను హ్యాపీ’ అని ఫిక్స్ అవుతుంది. ముందురోజు రాత్రే ఇష్టమైన టిఫిన్ కనుక్కుని ‘నీ ఫేవరెట్ టిఫిన్ రెడీ’ అని చెప్పాలి. కడుపు ఫుల్ అయితే మూడ్ ఆటోమేటిక్ సెట్. ∙స్కూల్‌కి వెళ్లేటప్పుడు ‘నీ బెస్ట్ ఫ్రెండ్ నీ సెక్షన్లోనే పడొచ్చు’ అనో, ‘ఈసారి ఎవరు కొత్త ఫ్రెండ్స్ అవుతారో’ అనో ఉత్సాహ పరచాలి. ‘క్లాస్‌రూమ్‌లకు కొత్తగా పెయింట్ చేయించారట’ అని చెప్పాలి. అలాంటివి వింటే పిల్లలు ఎగ్జయిట్ అవుతారు.హుషారుగా ఎలా ఉండాలి?‘మొదటిరోజు కాబట్టి నువ్వు ఈరోజు హుషారుగా ఉంటే సంవత్సరం అంతా హుషారుగా ఉంటావ్’ అని చెప్పాలి. ‘టీచర్ క్లాస్‌లోకి రాగానే గుడ్ మార్నింగ్ మేడం అని కాస్త గట్టిగా చెప్పు. లంచ్‌టైమ్‌లో ఒంటరిగా కూర్చోకు. ఇంకో విషయం... ఫస్ట్‌డే ఎవరూ నీ ర్యాంక్ అడగరు. నీ కొత్త షూస్, నీ నవ్వు చూస్తారు. నేను అందరితో కలిసిపోతా అనే ధైర్యంతో ఉండు’ అని చెప్పాలి.బస్సెక్కించేటప్పుడు ‘నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నీ సెక్షన్లో ఉండే అందరు పిల్లలూ అలాంటి ఫీలింగ్‌తోనే ఇవాళ స్కూల్‌కి వస్తారు. ఏం పర్వాలేదు. వెళ్లు. అక్కడ బెంచీలు, బ్లాక్‌బోర్డు, బెల్ అన్నీ నీ కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఏడాది నీదే. స్కూల్లో చదువు, ఆడు, కథలు విను, ఫ్రెండ్షిప్ చెయ్...’ అని చెప్పాలి. మొదటిరోజు దాటితే ఈ సంవత్సరం దాటేసినట్టే. కేస్ స్టడీ 1: కార్తికేయ, 7వ తరగతికార్తికేయ గుంటూరులో చదువుతున్నాడు. రేపు స్కూల్ తెరిస్తే సెవెన్త్‌లో కూచోవాలి. పోయిన సంవత్సరం ఆరుకు వచ్చినప్పుడు ఫస్ట్ డే ΄÷ద్దున్నే ‘కడుపునొప్పి’ అన్నాడు. అమ్మ టెంపరేచర్ చూసింది, జ్వరం లేదు. బస్సెక్కించబోతే మొహం అదోలా పెట్టి ‘కొత్త సెక్షన్లో నా ఫ్రెండ్స్ ఉండరు’ అన్నాడు. అమ్మ వాడితో ‘మా బుజ్జి కదూ. బ్యాగ్‌లో నీకిష్టమైన ఫుడ్ పెట్టాను. అది లంచ్‌లో నీ పక్కవాడితో షేర్ చేసుకో’ అని చెప్పింది. కార్తికేయ నసుగుతూనే బస్సెక్కాడు. డల్‌గా కూచున్నాడు. కాని సాయంత్రం ఇంటికి హుషారుగా వచ్చి ‘కొత్త ఫ్రెండ్ దొరికాడు మా’ అన్నాడు. స్కూల్ ఫీవర్ పోయింది. మళ్లీ ఈ సంవత్సరం కూడా ఈ ఫస్ట్‌డేకి ప్రిపేర్ చేయాలి.కేస్ స్టడీ 2: శ్రావ్య, 10వ తరగతిశ్రావ్య హైదరాబాద్‌లో ప్రయివేట్ స్కూల్. ఇప్పుడు 10కి వచ్చింది. 9వ క్లాస్‌లో మ్యాథ్స్‌లో 55 మార్కులు వచ్చాయి. సెలవులు అయిపోతున్నాయంటే శ్రావ్యకు మూడ్ పాడవుతోంది. ‘రేపు మ్యాథ్స్ మేడం సెలవుల్లో ఏం చేశావ్ అంటే ఏం చెప్పాలి? నన్నే లెక్క చేయమంటుందేమో’ అని ఏడుపు. అప్పుడు నాన్న పక్కన కూర్చుని ఒక పేపర్ ఇచ్చాడు. ‘దీనిమీద రాయి. టీచర్... నాకు లెక్కలు కష్టం. కానీ నేను నేర్చుకోవడానికి రెడీ. దయచేసి హెల్ప్ చేయండి. ఫస్ట్ డే ఇది మేడం డెస్క్ మీద పెట్టు. చదివిన ఏ టీచరూ హెల్ప్ చేయకుండా ఉండదు’ అన్నాడు. శ్రావ్యకు స్కూల్ ఫీవర్ పోయింది. బుర్రలో ‘భయం’ పోయి ‘భరోసా’ రావడంతో స్కూల్‌కు వెళ్లడానికి రెడీగా ఉంది. -
యుద్ధభూమిలో... జెండర్ పోరాటం
భారత సైన్యంలో తొలి మహిళా యుద్ధ హెలికాప్టర్ పైలట్‌గా చరిత్ర సృష్టించిన అభిలాష బరాక్ తాజాగా... ప్రతిష్ఠాత్మకమైన ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డ్ అందుకున్నారు. లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి దళంలో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్‌గా భారత బెటాలియన్‌లో పనిచేస్తున్నారు అభిలాష. లెబనాన్‌లో సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో లింగసమానత్వాన్ని పెంపొందించడానికి, మహిళలకు అండగా నిలవడంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.యునైటెడ్ నేషన్స్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్‌లో పనిచేస్తున్న మేజర్ బరాక్, దక్షిణ లెబనాన్‌లోని భారతీయ బెటాలియన్‌లో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్‌గా సేవలందిస్తున్నారు. గత సంవత్సరం జూన్‌లో ఈ మిషన్‌లో చేరినప్పటి నుంచి స్థానిక ప్రజలతో సన్నిహితంగా ఉంటూ మహిళలు, బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. వేలాది మంది మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.ఐరాస ప్రశంసలుఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో మహిళలతో కూడిన గస్తీ బృందాలకు నాయకత్వం వహించారు అభిలాష. ‘లెబనాన్ జెండర్ ఇనిషియేటివ్’ ఆమె విజయాలలో ఒకటి.‘లెబనాన్ జెండర్ ఇనిషియేటివ్’ అనేది ఏఐ–బేస్డ్ ప్లాట్‌ఫామ్. లింగ–ఆధారిత హింసను గోప్యంగా నివేదించడానికి, సహాయసేవలు, ఆత్మరక్షణ సమాచారాన్ని పొందడానికి పిల్లలకు సాయపడే వేదిక.శాశ్వత శాంతి వైపుగా...ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ) కార్యక్రమం కింద దక్షిణ లెబనానుకు చెందిన 75 మంది మహిళలకు స్కాలర్షిప్లు ఇప్పించడంలో సహాయపడ్డారు అభిలాష. ‘ఐటీఈసీ’ అనేది పునరుత్పాదక శక్తి, ఫైనాన్స్ వంటి రంగాలలో శిక్షణ అందించడంలో మహిళలకు సహాయపడుతుంది. శాంతి పరిరక్షకులకు, స్థానిక సమాజాలకు మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయడానికి, మహిళలకు సహాయ సహకారాలు అందించే వ్యవస్థలను మెరుగుపరచడానికి అభిలాష చేసిన కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.‘శాంతి పరిరక్షక మిషన్లను లింగ సమానత్వం అనేది ఎలా బలోపేతం చేయగలదో, శాశ్వత శాంతికి ఎలా దోహద పడగలదో బరాక్ నిరూపించారు’ అని అభిలాషను ప్రశంసించారు ఐక్యరాజ్య సమితి శాంతి కార్యకలాపాల అధిపతి జీన్–పియర్ లాక్రోయిన్స్. శాంతిభద్రతలలో మహిళల భాగస్వామ్యాన్నిప్రోత్సహించే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లే సైనిక శాంతి పరిరక్షకులకు 2016 నుండి యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డ్ ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డ్ అందుకున్న మూడో మహిళా అధికారి మేజర్ అభిలాష.బాల్యం నుంచే సైనిక క్రమశిక్షణహరియాణా రోహ్తక్ జిల్లా బాలంద్ గ్రామంలోని సైనిక కుటుంబంలో అభిలాష బరాక్ జన్మించారు. ఆమె తండ్రి కల్నల్ ఎస్.ఓమ్ సింగ్ జమ్మూ అండ్ కశ్మీర్ లైట్ ఇన్్రపాంటీలో సేవలందించగా, సోదరుడు ప్రస్తుతం భారతసైన్యంలో పనిచేస్తున్నారు. సైనిక కంటోన్మెంట్లో పెరగడం వల్ల అభిలాషలో క్రమశిక్షణ, సేవాభావం, దృఢసంకల్పం లాంటి విలువలు బాల్యంలోనే పాదుకున్నాయి.దిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో చదువుకున్న అభిలాష బీటెక్ (ఈసీయీ) చేశారు. చదువు పూర్తయిన తరువాత అమెరికాలోని డెలాయిట్‌లో బిజినెస్ టెక్నాలజీ అనలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించారు అభిలాష. దేశానికి సేవ చేయాలనే సంకల్పం అభిలాషను భారత సాయుధ దళాల పరీక్షలకు సిద్ధమయ్యేలా చేసింది. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (వోటీఏ)లో శిక్షణ పొంది సెప్టెంబర్ 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్పస్‌లో కమిషన్ పొందారు. కఠిన పరీక్షలు జయించి...భారత సైన్యం 2021లో మహిళా అధికారులకు యుద్ధవిమానయాన రంగం (కంబాట్ ఏవియేషన్)లో ద్వారాలు తెరిచింది. సాయుధ దళాలలో లింగ సమాన్వతం కోసం చేపట్టిన విస్తృత కార్యక్రమాలకు అనుగుణంగా ఈ విధాన మార్పు జరిగింది. కంబాట్ ఏవియేషన్‌లో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మహిళా అధికారులలో అభిలాష బరాక్ ఒకరు.పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ ఎవల్యుయేషన్స్తో సహా... రకరకాల కఠినమైన ఎంపిక ప్రక్రియల తర్వాత కేవలం ఇద్దరు మాత్రమే ఎంపికయ్యారు. అందులో బరాక్ ఒకరు. ప్రీ–ఆర్మీ పైలట్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తన బ్యాచ్‌లో ప్రథమస్థానంలో నిలిచినందుకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఫ్లెడ్జింగ్’ ట్రోఫీని అందుకున్నారు. -
అతివకు ‘ఐక్యరాజ్యసమితి’ అగ్ర పీఠం?
విశ్వశాంతి స్థాపనే మహోన్నత లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించి 81 ఏళ్లు. ఈ అంతర్జాతీయ సంస్థలో అతి ముఖ్యమైన పదవి- ప్రధాన కార్యదర్శి (సెక్రటరీ జనరల్). ప్రపంచంలో అతి కష్టమైన ఉద్యోగం ఇది! ఎనిమిది దశాబ్దాలకు పైబడిన కాలంలో ఇప్పటివరకు మహిళలెవరూ ఐరాస పీఠం ఎక్కలేదు, పగ్గాలు చేపట్టలేదు. కానీ ప్రస్తుతం ఇద్దరు అతివలు సహా నలుగురు వ్యక్తులు ఆ పదవికి బరిలో నిలిచారు.చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ జెరియా (74), కోస్టారికా మాజీ ఉపాధ్యక్షురాలు రెబెకా గ్రిన్ స్పాన్ మయుఫిస్ (70), సెనెగల్ మాజీ అద్యక్షుడు మాకీ సాల్ (64), రఫేల్ మారియానో గ్రోసీ (65) వారిలో ఉన్నారు. మిచెల్ బాచెలెట్ గతంలో ఐరాస మానవ హక్కుల హై కమిషనర్, ‘యూఎన్ ఉమన్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవులు అధిరోహించారు. బ్రెజిల్, మెక్సికో ఈమెను నామినేట్ చేస్తున్నాయి. ఆర్థికవేత్త అయిన రెబెకా గ్రిన్ స్పాన్ గతంలో ఐరాసలో వర్తకం, అభివృద్ధి విభాగమైన ‘యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (అంక్టాడ్)కు సారథ్యం వహించారు. ప్రస్తుతం ఈమెను ఐరాస సెక్రటరీ జనరల్ పదవికి స్వదేశం కోస్టారికా నామినేట్ చేస్తోంది. ఇక జియాలజిస్టు అయిన మాకీ సాల్ ను బురుండీ నామినేట్ చేస్తోంది. దౌత్యవేత్త అయిన మరో అభ్యర్థి రఫేల్ గ్రోసీని స్వదేశం అర్జెంటీనా నామినేట్ చేస్తోంది. ఐరాసకు చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు గ్రోసీ గతంలో డైరెక్టర్ జనరల్.రొటేషన్ రూటు- భద్రతామండలి ఓటు!ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి అభ్యర్థులు తమంతట తాముగా పోటీపడే అవకాశం లేదు. వారిని సంస్థ సభ్యదేశాలు నామినేట్ చేయాలి. ఐరాస ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబరు 31తో ముగుస్తోంది. కొత్త నేత 2027లో బాధ్యతలు స్వీకరిస్తారు. భౌగోళికంగా పశ్చిమ యూరప్ (పోర్చుగల్) ప్రాంతానికి చెందిన గుటెరస్ 2017 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2021లో ఆయన రెండోసారి ఆ సీటుకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.ఐరాస సెక్రటరీ జనరల్ పదవికి ఏ దేశస్థులైనా పోటీ చేయవచ్చు. అయితే భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు సమ ప్రాతినిధ్యం లభించాలనే ఉద్దేశంతో ఆ పదవిని రొటేషన్ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. ఇది సంప్రదాయమే తప్ప ఐరాస నిబంధనల్లో రాసి లేదు. దీనిపై బాచెలెట్, గ్రిన్ స్పాన్, గ్రోసీలను మినహాయిస్తే మాకీ సాల్ అభ్యర్థిత్వం విషయంలో మాత్రం వివాదం చోటుచేసుకుంది. రివాజుగా వస్తున్న ‘భౌగోళిక ప్రాంతాలవారీ రొటేషన్’కు భిన్నంగా ఆయన బరిలో నిలవటమే అందుకు కారణం. ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, తూర్పు యూరప్, లాటిన్ అమెరికా- కరీబియన్, పశ్చిమ యూరప్ తదితర ప్రాంతాల నుంచి ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేస్తారు.ఈదఫా లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాలకు చెందిన నేత ఎంపికవ్వాలి. కానీ, మాకీ సాల్ స్వదేశం సెనెగల్ కాగా, ఆయనను బురుండీ నామినేట్ చేస్తోంది. ఇవి రెండూ ఆఫ్రికా దేశాలు. ‘ఆఫ్రికన్ యూనియన్’లో 55 సభ్యదేశాలు ఉండగా అందులో దాదాపు 20 దేశాలు మాకీ సాల్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం లేదు. స్వదేశం సెనెగల్ సైతం ఆయన నామినేషన్ ను ఆమోదించకపోవడం కొసమెరుపు!. అలాగే ఐరాసలో ఐదు శాశ్వత సభ్యదేశాలైన (పీ5/పర్మినెంట్ 5) అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా నుంచి ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయరు. ఇది నిబంధనల్లో కనిపించని మరో అలిఖిత కట్టుబాటు! ఐరాస అత్యున్నత పదవిని తొలిసారిగా ఓ మహిళకు అప్పగించాలనే డిమాండ్లు సర్వత్రా ఊపందుకుంటున్నాయి.ఆంటోనియో గుటెరస్ కూడా ఈ వాదనతో గళం కలిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శిని భద్రతామండలి సిఫార్సుకు అనుగుణంగా ఐదేళ్ల పదవీ కాలానికి 193 సభ్యదేశాలతో కూడిన ఐరాస సాధారణ సభ మెజారిటీ ఓటు ప్రాతిపదికన నియమిస్తుంది. ఏ వ్యక్తి అయినా గరిష్ఠంగా రెండుసార్లు ఈ పదవిలో కొనసాగవచ్చు. ‘పీ5’ దేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలదే భద్రతామండలిలో పెత్తనం. వీటికి వీటో అధికారం ఉంది. ఈ ‘పీ5’ శాశ్వత దేశాలతోపాటు భద్రతామండలిలో రెండేళ్ల కాలనిర్దేశంతో మరో 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి.అలా ఈ మొత్తం 15 దేశాలకు గాను ‘వీటో వేటు’ పడకుండా అభ్యర్థి 9 (మెజారిటీ) ఓట్లు సాధించాల్సివుంటుంది. అంటే అభ్యర్థి మొదట ‘పీ5’ దేశాలన్నిటికీ నచ్చాలి! ఆ తర్వాతే మిగతా ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆ ఐదింటిలో ఏ ఒక్క దేశం ‘వీటో’ చేసినా (నిరాకరించడం) అభ్యర్థి ఓడిపోయినట్టే. ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి 2016లో 13 మంది నామినేషన్స్ పొందగా ఈసారి పోటీపడే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది ‘సమితి’ తన పూర్వ ప్రాభవం, భావి ప్రాధాన్యం కోల్పోతోందనడానికి సూచికా? రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాలను నివారించలేని సంస్థ అశక్తత, అసమర్థతలకు నిదర్శనమా?!- జమ్ముల శ్రీకాంత్ Courtesy: Deutsche Welle (DW) News(Germany’s state-owned, public international broadcaster) -
ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రథమ మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్(58) బాధ్యతలు చేపట్టారు. సంబంధిత అధికార పత్రాలను మంగళవారం ఆమె ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్‌కు అందజేశారు. 1987 ఐఎఫ్ఎస్ అధికారి అయిన రుచిరా కాంబోజ్, గతంలో భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేశారు. 2002–2005 సంవత్సరాల్లో ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారు. భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో రుచితా జూన్‌లో నియమితులయ్యారు. -
అగ్నికి ఆజ్యం పోస్తున్నారు: రష్యా వార్నింగ్
కీవ్: ఉక్రెయిన్‌తో సంఘర్షణ మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉందని రష్యా అభిప్రాయపడింది. ఉక్రెయినే తన తీరుతో ఆ దిశగా రెచ్చగొడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అణు యుద్ధ ముప్పును అస్సలు కొట్టిపారేయలేమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఘాటు హెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్‌పై దాడులను ఏ మాత్రమూ కొనసాగించలేనంతగా రష్యాను బలహీనపరచడమే అమెరికా లక్ష్యమన్న ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మూడో ప్రపంచ యుద్ధం రావొద్దంటూ శాంతి మంత్రం పఠిస్తున్న చాలా దేశాలు తమ ప్రవర్తన ద్వారా చేజేతులారా అందుకు రంగం సిద్ధం చేస్తున్నాయంటూ అమెరికా, పాశ్చాత్య దేశాల తీరును దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలందించడం ద్వారా నాటో దేశాలే అగ్నికి ఆజ్యం పోస్తున్నాయంటూ తీవ్ర విమర్శలకు దిగారు. రష్యాతో ఒప్పందం చేసుకోవద్దంటూ ఉక్రెయిన్‌పై అమెరికా, ఇంగ్లండ్ ఒత్తిడి తెస్తున్నాయన్నారు. చర్చలు ఆగిపోవడానికి ఉక్రెయినే కారణమని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను అమెరికా, ఇంగ్లండ్ తీవ్రంగా ఖండించాయి. లావ్రోవ్‌వి మతిలేని వ్యాఖ్యలంటూ దుయ్యబట్టాయి. ‘అణు యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరు. చేయకూడని యుద్ధమది’’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ జాన్ కిర్బీ అన్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని చూడాలని ఎవరూ కోరుకోరని చైనా పేర్కొంది. 40 దేశాల మంత్రుల భేటీ ఉక్రెయిన్‌కు కావాల్సినంత సైనిక సాయం అందిస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పష్టం చేశారు. 40 దేశాలరక్షణ మంత్రులు, అధికారులతో జర్మనీలో ఆయన సమాలోచనలు జరిపారు. ఉక్రెయిన్‌కు 500 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు పంపేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. అత్యాధునిక జెపార్డ్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ పంపుతామని జర్మనీ ప్రకటించింది. దాడులు మరింత ఉధృతం తమ భూభాగాలపై దాడులకు దిగేలా ఉక్రెయిన్ను ఇంగ్లండ్ రెచ్చగొడుతోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. కీవ్‌లోని కీలక ప్రభుత్వ కార్యాలయాలపై విరుచుకుపడతామని హెచ్చరించింది. పొపాస్నా, లిసిచాన్స్క్, గిర్‌స్కే, ఖరీ్కవ్, జపోరిజియాలపై బాంబుల వర్షం కురిపించింది. క్రెమినా నగరం రష్యా వశమైందని ఇంగ్లండ్ పేర్కొంది. యుద్ధం ద్వారా ఉక్రెయిన్ను పాశ్చాత్య దేశాలకు పుతినే దగ్గర చేశారని విశ్లేషకులంటున్నారు. శాంతియుత పరిష్కారమే కోరుతున్నాం: గుటెరస్‌తో పుతిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు పుతిన్ చెప్పారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో ఆయన భేటీ అయ్యారు. ‘‘చర్చల్లో చాలా పురోగతి సాధించినా ఉక్రెయిన్ వైఖరి ప్రతిష్టంభనకు దారి తీసింది. క్రిమియా హోదా, డోన్బాస్‌పై వైఖరి మార్చుకుంది. ఇప్పటికైనా క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని డోన్బాస్కు స్వాతంత్య్రాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి’’ అని డిమాండ్ చేశారు. గుటెరస్ అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో కూడా భేటీ అయ్యారు. యుద్ధాన్ని తక్షణం విరమించాలని సూచించారు. ఇది చదవండి: పుతిన్ కొత్త ప్లాన్..? -
ఐరాసలో మాకూ చోటివ్వండి: తాలిబన్లు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ దేశాల అంతర్జాతీయ కూటమి అయిన ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో తామకూ భాగస్వామ్య పాత్ర పోషించే అవకాశమివ్వాలని తాలిబన్లు విన్నవించుకున్నారు. తమ శాశ్వత ప్రతినిధి, దోహాకు చెందిన సుహైల్ షాహీన్ ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించేందుకు అనుమతినివ్వాలని తాలిబన్లు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌కు తాలిబన్లు లేఖ రాశారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని గత సర్కార్ కూలిపోయిందని, ఇక మీదట ఐరాసలో అఫ్గాన్ శాశ్వత ప్రతినిధిగా సుహైల్‌ను కొనసాగించాలని ఆ దేశ విదేశాంగ శాఖ నుంచి 20న లేఖ వచ్చిందని ఐరాసలో ఉన్నతాధికారి ఫర్హాన్ హక్ వెల్లడించారు. తమ ప్రతినిధి బృందం ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు, అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్‌కు మాట్లాడే అవకాశమివ్వాలని తాలిబన్లు కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఘనీ ప్రభుత్వ హయాంలో ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా నియమించబడిన గ్రామ్ ఇసాక్జాయ్ ఇంకా ఐరాసలో కొనసాగుతున్న నేపథ్యంలో తాలిబన్ల ప్రతిపాదన కొత్త సమస్య తెచ్చిపెట్టేలా ఉంది. సర్వ సభ్య సమావేశంలో 193 సభ్య దేశాలకు ఈ విషయం తెలియజేశామని, 27న ‘అఫ్గాన్’ సీటు వద్ద ఎవరిని ప్రతినిధిగా సమావేశాల్లో కూర్చోబెట్టాలో ఇంకా నిర్ణయించలేదని ఐరాస ఉన్నతాధికారి ఫర్హాన్ చెప్పారు. తాలిబన్లను బహిష్కరించకండి: ఖతార్ అఫ్గాన్ సంక్షోభంలో మధ్యవర్తి పాత్ర పోషించిన ఖతార్ ఈ విషయంలో స్పందించింది. ‘ అఫ్గాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగాలంటే తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. వారిని బహిష్కరించకూడదు. అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వం తరఫున శాశ్వత ప్రతినిధిని ఈ సమావేశాల్లో అనుమతించాలి’ అని న్యూయార్క్‌లో సర్వ సభ్య సమావేశంలో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన టర్కీ అధ్యక్షుడు 74 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కశ్మీర్ అంశాన్ని భారత్–పాక్‌లు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస వేదికగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగన్ బుధవారం మరోసారి లేవనెత్తారు. అయితే, గతంలోనూ ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. -
అఫ్గన్‌కు 60 కోట్ల డాలర్ల సాయం చేయండి: ఐరాస
జెనీవా: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌ను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించా ల్సిందిగా సోమవారం ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి(ఐరాస) కోరింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు అఫ్గన్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హితవు పలికారు. సోమవారం జెనీవాలో జరిగిన విరాళాల సేక రణ సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గన్ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు సదస్సులో గుటెర్రస్ ప్రకటించారు. -
కరోనా: సంక్షోభంలో వారి భవిష్యత్తు
ఐక్యరాజ్యసమితి: కోవిడ్–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పసివారిపై తీవ్రమైన ప్రభావం చూపనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇటీవలి కాలంలో శిశు మరణాల సంఖ్యను తగ్గించుకోగలిగినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం కారణంగా కొన్ని లక్షల మంది అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి వెళతారనీ, ఫలితంగా శిశుమరణాలు వేలాదిగా పెరిగే ప్రమాదముందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. 2019 అంచనాల ప్రకారం 386 మిలియన్ల మంది చిన్నారులు దుర్భర దారిద్య్రంలో ఉండగా, ఈ ఏడాది తలెత్తిన సంక్షోభం కారణంగా మరో 42 నుంచి 66 మిలియన్ల మంది పసివారు పేదరికంలో మగ్గిపోతారని అంచనా వేసింది. ‘పాలసీ బ్రీఫ్; ద ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్–19 ఆన్ చిల్డ్రన్’ పేరుతో ఒక పత్రాన్ని ఐరాస విడుదల చేసింది. కోవిడ్ మహమ్మారి చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, వారి భవిష్యత్తు సంక్షోభంలో పడనుందని అందులో పేర్కొంది. అవి 1) చిన్న పిల్లలకు వైరస్ సోకడం, 2) వైరస్ కలిగించే తక్షణ సామాజిక ఆర్థిక ప్రభావం 3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుపై కోవిడ్ –19 దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని వెల్లడించింది. పాఠశాలల మూసివేత కారణంగా 188 దేశాల్లో 1.5 బిలియన్ల మంది పిల్లల విద్యాబోధన పూర్తిగా కుంటుపడింది. మూడింట రెండొంతుల దేశాలు దూరవిద్యావిధానాన్ని అమలుచేయగా, అందులో తక్కువ ఆదాయం కలిగిన దేశాల వాటా కేవలం 30 శాతమే. 143 దేశాల్లోని 368.5 మిలియన్ల మంది పిల్లలు పౌష్టికాహారం కోసం పాఠశాలలపైనే ఆధారపడి ఉన్నారు. బడులు మూతపడటంతో ఇప్పుడు వీరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీని ప్రభావంతో 143 దేశాల్లో 368.5 మిలియన్ల మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడతారని ఐరాస అంచనా వేసింది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, వారి సంక్షేమం సైతం ప్రమాదంలో పడనుందని పేర్కొంది. ఈ తీవ్రత నుంచి చిన్నారులను రక్షించడానికి ప్రభుత్వాలు చొరచూపాలనీ, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక, ఆహార భద్రత కల్పించాలని ఐరాస ప్రదాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కోరారు. మాతా శిశు సంరక్షణ, పౌష్టికాహార కార్యక్రమాలు, పాఠశాల విద్యకు హాని జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇది చదవండి: చైనాపై పెరిగిన అనుమానాలు? -
తీవ్ర నిధుల సంక్షోభంలో ఐరాస
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి తీవ్రమైన నిధుల కొరతలో ఉందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వచ్చే నెల వేతనాలిచ్చేందుకూ సరిపోను నిధులు లేవన్నారు. ఐరాసలో ఈ దశాబ్దంలో ఈ స్థాయి సంక్షోభం ఎన్నడూ లేదన్నారు. సంస్థకు ఇస్తామని ప్రకటించిన నిధులను తక్షణమే అందించాలని 193 సభ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. నిధుల్లేకుండా ఐరాస పథకాల అమలు సాధ్యం కాబోదన్నారు. ఈ దశాబ్దంలోనే ఈ నెలలో అత్యంత తక్కువ స్థాయిలో నిధులున్నాయన్నారు. సంస్థకు దేశం తరఫున అందించాల్సిన నిధులను పూర్తిగా అందించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే, శాంతి పరిరక్షణ దళ ఖర్చుల నిమిత్తం భారత్‌కే ఐరాస రూ. 270 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 73 దేశాలు మాత్రమే.. 2017, 2018 సంవత్సరాలకు గానూ 73 దేశాలు మాత్రమే, మార్చి నాటికి తమ వాటాను పూర్తిగా చెల్లించాయని గ్యుటెరస్ తెలిపారు. 2016లో 62 దేశాలు, 2015లో 67 దేశాలు తమ వాటాను పూర్తిగా చెల్లించాయన్నారు. 2018 చివరి నాటికి సభ్య దేశాల నుంచి సంస్థకు అందాల్సిన నిధులు 529 మిలియన్ డాలర్లు. 2018, 2019 సంవత్సరాలకు గానూ.. సంస్థ సాధారణ బడ్జెట్ అయిన 5.4 బిలియన్ అమెరికన్ డాలర్లలో దాదాపు 22% అమెరికా నుంచి అందాల్సి ఉంది. ఈ జనవరి నుంచి తీవ్రస్థాయిలో పొదుపు చర్యలు చేపట్టకుండా, నెలవారీ ఖర్చుల విధానం ప్రారంభించకుండా ఉండి ఉంటే.. పరిస్థితి మరింత దారుణంగా ఉండి ఉండేదని గ్యుటెరస్ అభిప్రాయపడ్డారు. ‘ఆ చర్యలే చేపట్టకుండా ఉండి ఉంటే.. జనరల్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అవసరమైన నిధులు కూడా మనవద్ద ఉండేవి కావు’ అన్నారు. అత్యంత తీవ్రమైన నిధుల లేమి కారణంగా కఠినమైన పొదుపు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. -
‘చాంపియన్ ఆఫ్ ది ఎర్త్’ మోదీ
న్యూఢిల్లీ: స్వచ్ఛ, హరిత పర్యావరణం తమ ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చెప్పారు. వాతావరణం, విపత్తులకు సంస్కృతితో సంబంధం ఉందనీ, పర్యావరణాన్ని కాపాడటం మన సంస్కృతిలో భాగం కానంతవరకు విపత్తులను నివారించడం చాలా కష్టమైన పని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డును మోదీ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ చేతుల మీదుగా అందుకున్నారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ–ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్) విజయవంతమవ్వడంలో కీలకపాత్ర పోషించినందుకుగాను మోదీతోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు సంయుక్తంగా ఈ అవార్డును ఐరాస ప్రకటించింది. అవార్డును స్వీకరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ ‘వ్యవసాయ, పారిశ్రామిక విధానాల నుంచి ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వరకు.. అన్నింట్లోనూ స్వచ్ఛ వాతావరణం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు భారత్ ఇటీవలి కాలంలో మరింతగా పాటుపడుతోంది. 2005తో పోలిస్తే 2020కల్లా కర్బన ఉద్గారాలను 20–25 శాతం, 2030 నాటికి 30–35 శాతం తగ్గించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2022 కల్లా ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. వారందరికీ దక్కిన గౌరవం ఈ అవార్డు.. మోదీ మాట్లాడుతూ ‘ఈ దేశంలో కొన్ని తెగల ప్రజలు అడవుల్లో బతుకుతూ తమ ప్రాణాలకంటే అక్కడి చెట్లనే ఎక్కువ ప్రేమిస్తారు. మత్స్యకారులు తమ జీవనానికి అవసరమైన డబ్బు సంపాదించడానికి ఎన్ని చేపలు అవసరమో అన్నే పడతారు తప్ప అత్యాశకు పోరు. రైతులు ఎంతో కష్టపడి దేశం ఆకలి తీరుస్తున్నారు. చెట్లను దేవతలుగా పూజించే మహిళలు ఇక్కడ ఉన్నారు. వీరందరికీ దక్కిన గుర్తింపుగా నేను ఈ అవార్డును భావిస్తున్నాను’ అని అన్నారు. ప్రకృతిని భారతీయులెప్పుడూ ప్రాణం ఉన్న జీవిగానే చూశారనీ, పర్యావరణాన్ని గౌరవించడం భారత సంస్కృతిలో పురాతన కాలం నుంచే భాగంగా ఉందనీ, స్వచ్ఛతా అభియాన్ ద్వారా ప్రజల ప్రవర్తనను మార్చడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని మోదీ చెప్పుకొచ్చారు. అసలైన నాయకుడు మోదీ: గ్యుటెరస్ హరిత వాతావరణాన్ని నమ్మే వారి పక్షానే సాంకేతికత ఉంటుందని గ్యుటెరస్ అన్నారు. ‘అసలైన నాయకత్వం కలిగిన ఓ రాజనీతిజ్ఞుడిని ఈ పురస్కారంతో మనం గుర్తిస్తున్నాం. వాతావరణ మార్పు సమస్యను గుర్తించి, పర్యావరణ పరిరక్షణతో వచ్చే లాభాలను అర్థం చేసుకునే నాయకుడు మోదీలో ఉన్నారు. ఆయనకు సమస్యలు తెలుసు, పరిష్కరించేందుకూ పనిచేస్తున్నారు. హరిత వాతావరణం మంచి వాతావరణం. బూడిద వాతావరణాన్ని నమ్మే వారి భవిష్యత్తు కూడా బూడిదలాగే ఉంటుంది’ అని గ్యుటెరస్ పేర్కొన్నారు. అవార్డును మోదీకి ప్రదానం చేయడంతో ఆయనకు తగిన గుర్తింపు దక్కిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. -
ఐరాస శాంతిదూతగా మలాలా
-
ఐరాస శాంతిదూతగా మలాలా
ఆ హోదా పొందిన పిన్నవయస్కురాలు ఐక్యరాజ్యసమితి: బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్(19)కు మరో అత్యున్నత గౌరవం లభించింది. ఆమెను ఐక్యరాజ్యసమితి శాంతిదూతగా ఎంపిక చేసినట్లు యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. యూఎన్ శాంతిదూతగా నియమితురాలైన అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా నిలిచారు. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆమెకు ఈ హోదా ఇవ్వనున్నారు. ‘‘మహిళలు, యువతులు, ప్రజల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతూ మలాలా అసాధారణ నిబద్ధత కనబరుస్తున్నారు. అందుకే ఆమెను శాంతిదూతగా ఎంపిక చేశాం. బాలికల విద్యా హక్కు కోసం మలాలా ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారు. శాంతిదూతగా మలాలాను ఎంపిక చేయడం వల్ల మహిళలకు మరింత మేలు చేకూరుతుంది’’ అని గుటెరస్ అన్నారు. ఐరాస కార్య కలాపాలను ప్రచారం చేసేందుకు ప్రముఖులను శాంతిదూతగా ఎంపిక చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.


