breaking news
Antonella Roccuzzo
-
ఇద్దరిదీ ఒకే ఊరు! ఐదేళ్ల వయసులోనే పరిచయం! మెస్సీ ప్రేమకథ తెలుసా?
Lionel Messi- Antonella Roccuzzo Love Story: ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు.. ఆ ఒక్కటి దాటేస్తే చాలు ప్రపంచకప్ విజేతగా నిలవాలన్న స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆదివారం (డిసెంబరు 18) నాటి ఫైనల్లో గెలిచి తన కీర్తికిరీటంలో వరల్డ్‌కప్ టైటిల్ అనే కలికితురాయి చేర్చుకున్నాడు. ఖతర్‌లో క్రొయేషియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో అర్జెంటీనా విజయం ద్వారా ఈ మేరకు అడుగులు పడిన విషయం తెలిసిందే. మెస్సీ, జూలియన్ అల్వారెజ్ అద్భుత గోల్స్ చేయడంతో క్రొయేషియాను 3-0తో మట్టికరిపించిన అర్జెంటీనా ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో అర్జెంటీనాలో సంబరాలు అంబరాన్నంటాయి. వీధులన్నీ జనసంద్రమయ్యాయి. మెస్సీ బృంద నామస్మరణతో మారుమ్రోగిపోయాయి. ఈ విజయంతో మెస్సీ సహా అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోగా.. అతడి కుటుంబం సైతం తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంది. ముఖ్యంగా తమ ముగ్గురు పిల్లలతో ఈ మ్యాచ్‌కు హాజరైన మెస్సీ సతీమణి ఆంటోనీలా రొకుజో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముగ్గురు కొడుకులతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చిన ఆమె.. ఇన్‌స్టా వేదికగా వాటిని పంచుకుంటూ మెస్సీపై ప్రేమను చాటుకుంది. ‘‘ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో మీకు చెప్పలేను. ఎందుకంటే చెప్పినా కూడా మీకు అర్థం కాదు. లెట్స్ గో అర్జెంటీనా.. లెట్స్ గో మెస్సీ’’ అంటూ ఆంటోనీలా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. View this post on Instagram A post shared by Antonela Roccuzzo (@antonelaroccuzzo) మెస్సీ వ్యక్తిగత జీవితం, కుటుంబానికి సంబంధించిన ఈ ఫొటోలు నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి. దీంతో ఆంటోనీలా రొకజో గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఆంటోనీలా ఎవరు? మెస్సీకి ఎలా పరిచయం? వీరి ప్రేమకథ ఎలా మొదలైంది? మెస్సీ విజయాల్లో ఆమె పాత్ర? తదితర విషయాలు తెలుసుకుందాం! PC: Antonela Roccuzzo Instagram ఇద్దరిదీ ఒకే ఊరు.. ఐదేళ్ల వయసు నుంచే.. ఆంటోనీలా స్వస్థలం రొసారియో. అర్జెంటీనాలోని మూడో అతిపెద్ద పట్టణం. మెస్సీ జన్మించింది కూడా ఇక్కడే! వీళ్లిద్దరు చిన్ననాటి స్నేహితులు. ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే కలిసి ఆడుకునేవారట. ఆంటోనీలా కజిన్ లుకాస్ స్కాగ్లియా మెస్సీకి చిన్ననాటి స్నేహితుడు. కాగా లుకాస్ కూడా ఫుట్‌బాలరే! కామన్ ఫ్రెండ్ ద్వారా మిడ్‌ఫీల్డర్‌గా గుర్తింపు దక్కించుకున్న అతడు కొన్నాళ్లు కోచ్‌గానూ వ్యవహరించాడు. అలా కామన్ ఫ్రెండ్ లుకాస్ ద్వారా చేరువైన మెస్సీ, ఆంటోనీలాల స్నేహం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో సహజీవనం చేసిన ఈ జంట.. బార్సిలోనా, అర్జెంటీనా జట్ల తరఫున మెస్సీ అరంగేట్రం జరిగిన మూడేళ్లకు అంటే 2008లో తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నట్లు ప్రకటించింది. అతడికి ఆట అంటే ప్రాణం.. మరి ఆమెకు? ఆంటోనీలా హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చదివింది. డెంటల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మెస్సీ బార్సిలోనాకు ఆడుతున్న సమయంలో అతడికి మరింత చేరువైన ఆమె.. ప్రస్తుతం మోడల్‌గా కెరీర్ కొనసాగిస్తోంది. పిల్లల పెంపకంలో కీలక పాత్ర పోషిస్తూ మెస్సీ కెరీర్లో విజయవంతంగా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తోంది. PC: Antonela Roccuzzo Instagram 2017లో వివాహం.. ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు జన్మించిన తర్వాత మెస్సీ- ఆంటోనీలా పెళ్లి చేసుకున్నారు. 2017లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. కాగా పెళ్లైన ఏడాదికి ఈ జంటకు మరో కుమారుడు సీరో జన్మించాడు. తియాగో(2012), మాటియో(2015)లకు తమ్ముడు వచ్చాడు. విశేషమేంటంటే.. మెస్సీ ముగ్గురు కుమారులు కూడా ఫుట్‌బాల్‌కు వీరాభిమానులు. తల్లితో కలిసి తండ్రి ఆడే మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లడం వీరికి అలవాటు. ప్రస్తుతం వీరు ఖతర్‌లో ఉన్నారు. మెస్సీకి సంబంధించిన ప్రతీ మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెస్సీ పెద్ద కుమారుడు తియాగో తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. ఆటలో ఓనమాలు నేర్చుకుంటున్న జూనియర్ మెస్సీ.. తండ్రిలాగే స్టార్ ఫుట్‌బాలర్ ఎదగాలనే పట్టుదలతో ఉన్నాడు. చదవండి: Rishabh Pant: బంగ్లాతో టెస్టు.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు! రెండో భారత వికెట్ కీపర్‌గా.. Ranji Trophy 2022-23: తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న అర్జున్ టెండూల్కర్.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ -
వైభవంగా మెస్సీ వివాహ వేడుక
రొజారియో (అర్జెంటీనా): అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ వివాహ వేడుక శనివారం కెసినో కాంప్లెక్స్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. అర్జెంటీనా మీడియా ‘శతాబ్దపు పెళ్లి’గా అభివర్ణించిన ఈ వేడుకలో పలువురు సాకర్ స్టార్లతో పాటు పాప్ సింగర్లు హాజరయ్యారు. బాల్య స్నేహితురాలైన 29 ఏళ్ల అంటోనెల్లా రొకుజోను వారి సంప్రదాయం ప్రకారం మెస్సీ (30) పెళ్లి చేసుకున్నాడు. నిజానికి పెళ్లికి ముందే వీరిద్దరు ఓ ఇంటివారయ్యారు. సుదీర్ఘ సహజీవనంలో వీరికి ఇద్దరు కుమారులు థియాగో మెస్సీ, మాటే మెస్సీ ఉన్నారు. వివాహ వేడుకకు 260 మంది అతిథులొచ్చారు. మెస్సీ తల్లిదండ్రులు సెలియా, జార్జ్ మెస్సీ, సోదరి మరియాలతో పాటు బార్సిలోనా క్లబ్ సహచరులు నెయ్మార్, స్వారెజ్, అర్జెంటీనా స్ట్రయికర్ సెర్గియో అగ్వెరో, చెల్సి స్టార్ ఫాబ్రెగాస్ తదితర ఆటగాళ్లంతా వారి గర్ల్ ఫ్రెండ్స్‌తో విచ్చేశారు. పాప్ సింగర్ షకీరా తన భర్త గెరార్డ్ పికెతో కలిసి హాజరైంది. -
ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పెళ్లి వేడుక
-
ప్రియురాలిని పెళ్లాడిన మెస్సీ
బార్సిలోనా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ (30) ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబసభ్యుల సమక్షంలో తన చిన్ననాటి ప్రేయసి, సహజీవన భాగస్వామి ఆంటోనెల్లా రొకుజ్జోను మెస్సీ శుక్రవారం (జూన్ 30) పెళ్లాడాడు. సుమారు 250 మంది ప్రపంచ సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకలో మెస్సీ... ఆంటోనెల్లా వేలికి వెడ్డింగ్ రింగ్ తొడిగి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. మోస్సీ సొంత నగరం అత్యంత విలాసవంతమైన రొసారియో ఈ పెళ్లి వేడుకకు వేదిక అయింది. కాగా గత పదేళ్లుగా మెస్సీ, ఆంటోనెల్లా రొకుజ్జో సహజీవనం చేస్తున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు (తియాగో, మాటియో మెస్సీ) కూడా ఉన్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వెడ్డింగ్‌కు హాలీవుడ్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాళ్లు నైమర్, లూయిస్ సువరేజ్ సహా పలువురు తన భార్యలతో కలిసి హాజరు అయ్యారు. అలాగే బార్సిలోనా స్టార్ గెరార్డ్ పికి, పాప్ గాయని షకీరా సైతం విచ్చేశారు. ఇక వివాహ వేడుకలో ప్రముఖ స్పెయిన్ డిజైనర్ రోసా క్లారా రూపొందించిన సొగసైన డిజైనర్ గౌన్‌లో ఆంటోనెల్లా రొకుజ్జో మెరిపోయింది. పెళ్లి వేడుక అనంతరం ఈ జంట ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే కవరేజ్ కోసం 150మంది జర్నలిస్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ ప్రత్యక్షంగా కవరేజ్‌కు మాత్రం అనుమతించలేదు. ఈ వివాహ కార్యక్రమానికి సుమారు 400మందికి పైగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)