breaking news
Annadanam Trust
-
14 ఏళ్లుగా.. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్ర
నగరంలోని సనత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస రామానుజ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు, బాటసారులకు సేవలందిస్తోంది. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్రలా మారుతోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం మితాహారాన్ని అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తోంది. యేటా రెండు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి కావడంతో మంగళవారం నుంచి మరోసారి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. – సనత్‌నగర్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తోంది శ్రీనివాస సమాజ సేవా సమితి. స్థానిక బీకేగూడ పార్కు వద్ద రోజుకు 250 నుంచి 300 మంది వరకూ మధ్యాహ్నం మిత భోజనాన్ని వడ్డించేందుకు సీనియర్ సిటిజన్స్ సిద్ధమయ్యారు. దాతల సహకారంతో.. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున దాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పోటీపడు తుంటారు. అయితే రోజుకో దాత అనే సంప్రదాయాన్ని ట్రస్ట్ కొనసాగిస్తూ వస్తోంది. దాతల కోరిక మేరకు పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి కొన్ని ప్రత్యేక తేదీల్లో వారి పేరున నలుగురికీ ఆహారాన్ని పంచుతోంది. ఈ యేడాదికి గానూ ఇప్పటికే జూన్ 2 వరకూ అన్ని రోజులకు సరిపడా దాతలు తమ తేదీలను బుక్ చేసుకున్నారు. రోజుకు రూ.5వేల చొప్పున.. ఒక్కో దాత నుంచి రోజుకు రూ.5వేల చొప్పున మాత్రమే స్వీకరిస్తారు. వీటితో రుచికరమైన వంటకాలను అందిస్తారు. బగారా రైస్, టమాటా రైస్, జీరా రైస్, కర్రీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, స్వీట్స్‌తో పాటు ప్లేట్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కలిపి రూ.5,000 గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్‌కు నగదు, చెక్కు రూపంలో స్వీకరిస్తారు. దాతల సహకారం అపూర్వం.. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ మితాహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి అపూర్వమైన కార్యక్రమంలో దాతల సహకారం అపూర్వం. దీనికి సీనియర్ సిటిజన్స్ తోడవ్వడం మా అదృష్టం. వారి సహకారం మరువలేనిది. ఏటా మాదిరిగానే చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్యాంసుందర్రాజ్కు కృతజ్ఞతలు. – పార్థసారథి, శ్రీనివాస రామానుజ ట్రస్టీ -
సేవా భోజ్ యోజన పథకం: జీఎస్టీ రిఫండ్
-
అన్నదానం చేస్తే జీఎస్టీ రిఫండ్
న్యూఢిల్లీ: అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘సేవా భోజ్ యోజన’గా పిలిచే ఈ పథకం ద్వారా ఆ సంస్థలకు కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ), సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) మొత్తాలను తిరిగి చెల్లిస్తారు. రెండేళ్ల పాటు రూ.325 కోట్ల వ్యయంతో సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని అమలుచేయనుంది. కనీసం ఐదేళ్లుగా పనిచేస్తూ నెలకు కనీసం 5 వేల మందికి అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మఠాలు తదితరాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హమైన సంస్థలు సాంస్కృతిక శాఖ వద్ద నమోదుచేసుకోవాలి. దర్పన్ పోర్టల్‌లో సమర్పించే దరఖాస్తులను సాంస్కృతిక శాఖ నియమించిన కమిటీ పరిశీలించి 4 వారాల్లో నిర్ణయం తీసుకుంటుంది. వాటి పనితీరుపై సంతృప్తి చెందితే గడువు ముగిశాక రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరిస్తారు. పాలక మండలి సభ్యులు, ధర్మకర్తలు, చైర్మన్లలో ఎవరైనా వైదొలగినా, కొత్తవారు నియమితులైన సంగతిని, అన్నదానం చేస్తున్న ప్రాంతాలలో మార్పు తదితర సమాచారాన్ని సాంస్కృతిక శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేసే బాధ్యత ఆ సంస్థపైనే ఉంటుంది. -
శ్రీవారి భక్తుల కోసం 55,669 ఆర్జితసేవా టికెట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెల మొత్తానికి 55,669 ఆర్జిత సేవల టికెట్లు ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలలో మాట్లాడుతూ సుప్రభాతం-6279, అర్చన- 130, తోమాల -130, విశేషపూజ-1875, అష్టదళ పాద పద్మారాధన -100, నిజపాద దర్శనం -1500, కల్యాణోత్సవం-11,625, వసంతోత్సవం -11,610, ఆర్జిత బ్రహ్మోత్సవం-6020, సహస్రదీపాలంకరణ సేవ-13,300, ఊంజల్‌సేవ-3100 ఉన్నాయని వివరించారు. ఈ టికెట్లను టీటీడీ ఈ-దర్శన్లోనూ భక్తులకు అందుబాటులోకి తీసురానున్నామన్నారు. వేసవి రద్దీ దృష్ట్యా ఈ నెల 15 నుంచి జూన్ ఆఖరి వరకు శుక్రవారాల్లో ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని తెలిపారు. అదే రోజుల్లో వికలాంగులు, వృద్ధులను మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నామన్నారు. శ్రీవారి సేవకు వచ్చేవారి కోసం త్వరలోనే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. తిరుమలలోని కల్యాణవేదికలో ‘కల్యాణం’పేరుతో ఉచిత వివాహ తేదీ రిజర్వు చేసుకోవడం కోసం త్వరలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అన్నప్రసాదానికి దుబాయి భక్తుడి విరాళం టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు శుక్రవారం ఓ భక్తుడు రూ.1.32 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశాడు. దుబాయికి చెందిన శేలేష్కుమార్ దాస్ శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈవో సాంబశివరావును కలసి రూ.1.32కోట్ల రూపాయల చెక్‌ను అందజేశారు. స్వామి వారి అన్నదాన పథకానికి వినియోగించాలని కోరారు.