16న జిల్లాస్థాయి చదరంగం పోటీలు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లో ఈ నెల 16న జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్దర్బారీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఒక్కో పాఠశాల నుంచి బాలుర విభాగంలో ఇద్దరు, బాలికల విభాగంలో ఇద్దరు చొప్పున హాజరుకావాలని సూచించారు. ఇందులో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈనెల 18, 19 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు సొంత చెస్ కిట్ తెచ్చుకోవాలని తెలిపారు.. ఈ పోటీలకు ఎలాంటి ప్రవేశ రుసుం లేదని, పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలని వివరించారు.పూర్తి వివరాలకు 9395116429 నంబర్లో సంప్రదించాలని కోరారు.