breaking news
Amey Khopkar
-
'మహేశ్ భట్ మూర్కుడు'
ముంబై: పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను ప్రదర్శించరాదని సినిమా ధియేటర్ యజమానుల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) స్వాగతించింది. పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఎమ్మెన్నెస్ నాయకుడు అమేయ్ ఖోపకార్ పునరుద్ఘాటించారు. దర్శకుడు మహేశ్ భట్ మూర్కుడిలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహేశ్ భట్ భారతీయులా వ్యవహరించడం లేదని, ఆయనను పాకిస్థాన్ కు పంపించాలని డిమాండ్ చేశారు. ఆయనేం మాట్లాడినా లెక్కచేయబోమని అన్నారు. పాకిస్థాన్ నటీనటులతో సినిమాలు తీస్తే దాడులు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కొంతమంది హింసోన్మాదులు చేసిన మతిలేని చర్యలకు తనలాంటి ఎంతోమంది శాంతికాముకులను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదని 'ప్రొఫైల్ ఫర్ పీస్' నినాదంతో మహేశ్ భట్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. -
'పాకిస్థానీలు కనబడితే దంచుడే'
ముంబై: పాకిస్థాన్ పై ప్రతీకారం విషయంలో సరిహద్దుల్లో కన్నా ముంబైలో ఉద్రిక్తతను పెంచుతోన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) మరో అడుగు ముందుకువేసి తీవ్ర హెచ్చికలు చేసింది. పాకిస్థాన్ నటులు కనబడితే దాడులు చేస్తామని, ఆయా సినిమాల నిర్మాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని ఎంఎన్ఎస్ కీలక నేత అమేయ్ ఖోపర్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పాక్ నటులు వీసాలు, వర్క్ పర్మిట్లు తీసుకొని వచ్చారన్న సల్మాన్ ఖాన్ కు సైతం కౌంటర్ ఇచ్చారు. (వాళ్లు వర్క్ పర్మిట్లు, వీసాలతో వచ్చారు: సల్మాన్) 'చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదు. టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారు. ఇది చట్టవ్యతిరేకం. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. ఉప్పటికిప్పుడైతే పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు చేస్తాం. ఆ సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటాం' అని అమేయ్ ఖొప్కర్ అన్నారు. ఇదే వివాదంపై దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ స్పందిస్తూ.. నిర్మాణంలో ఉన్న సినిమాల నుంచి తప్పుకోవడంలో పాక్ నటుల తప్పేమీ లేదని, వీళ్ల విషయంలో పాక్ ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని అన్నారు. నిజానికి భారతీయులకు పాకిస్థానీయుల పట్లగానీ, అక్కడివాళ్లకు ఇక్కడివాళ్లపైగానీ ఎలాంటి విద్వేషాలు లేవని, వివాదాలు ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలని శ్యామ్ బెనగల్ వ్యాఖ్యానించారు.