breaking news
ameerpet lo
-
యువత ఆలోచనలకు అద్దం పట్టే 'అమీర్‌పేట లో'
కథలో కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలకు కూడా పెద్ద విజయాలు కట్టబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ నమ్మకంతోనే కొత్త ఆలోచనలతో యువతరాన్ని ఆకట్టుకునే కథా కథనాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అమీర్‌పేటలో. ఈ తరం యువత ఆలోచనలు, ఆశయాలే కథా వస్తువుగా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు యువతకు సందేశాన్ని అందిస్తుంది. కథ విషయానికి వస్తే.. అమీర్‌పేట హాస్టల్లో ఉండే వివేక్(శ్రీ), లిబుగా చెప్పుకునే లింగబాబు, చిట్టి, వెంకట్రావులు పెద్ద పెద్ద ఆశయాలతో సిటీకి వస్తారు. వెంకట్రావుకు ఎలాగైన తన ఊరి వారి ముందు ఇంగ్లీష్ లో మాట్లాడాలన్నదే ఆశయం. చిట్టీ, లిబులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించాలి, వివేక్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కలలు కంటుంటాడు. ఇలా ఉన్నత ఆశయాలు ఉన్న ఈ యువత.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరు ఎలా విజయం సాధించారు అన్నదే సినిమా కథ. యూత్‌ను అలరించే ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే నేటి యువతరం చెడు స్నేహాం వల్ల ఎలాంటి తప్పటడుగులు వేస్తోందో చూపించారు. అదే సమయంలో ఓ మంచి స్నేహితుడు దొరికితే అప్పటి వరకు చెడ్డ దారిలో నడిచిన వారుకూడా ఎలా మంచి మార్గంలోకి వస్తారో వినోదాత్మకంగా చూపించారు. ముఖ్యంగా మినిమమ్ బడ్జెట్‌తో యూత్ ఫుల్ కథా కథనాలతో సినిమాను తెరకెక్కించిన శ్రీ ఆకట్టుకున్నాడు. హీరోగానూ, దర్శకుడిగాను మంచి మార్కులు సాధించాడు. ఇతర పాత్రల్లో నటించిన వారు కొత్త వారే అయినా తమ పరిథి మేరకు పరవాలేదనిపించారు. ఫస్ట్‌హాప్ అంతా యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌ను ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు. అయితే ఎమోషనల్ సీన్స్ కాస్త సాగదీసినట్టుగా ఉన్నాయి. కథా పరంగా రొటీన్‌గా అనిపించే అమీర్‌పేటలో యూత్‌కు మాత్రం బాగానే కనెక్ట్ అవుతోంది. -
అమీర్‌పేట జీవితాలతో...
హైదరాబాద్‌లో అమీర్‌పేట అంటే తెలియనివారు ఉండరు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉంటాయి. ఆ నేపథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అమీర్‌పేటలో’. శ్రీ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. అశ్విని కథానాయిక. పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై యామిని బ్రదర్స్ సమర్పణలో మహేశ్ మందలపు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ-‘‘అమీర్‌పేట అంటే మనకు ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. అక్కడి జీవితాలను చూపిస్తూనే, మంచి కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. వినోదంతో పాటు భావోద్వేగ అంశాలు ఉన్నాయి. కుటుంబం మొత్తం కలిసి చూసేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం శ్రీ ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. ఈ చిత్రం నిర్మాణంలో వంశీ, శ్రీకాంత్, ప్రవీణ్‌ల సహకారం మరచిపోలేను’’ అని నిర్మాత చెప్పారు. అశ్విని, సహ నిర్మాత యామిని వంశీకృష్ణ, సంగీత దర్శకుడు మురళి తదితరులు పాల్గొన్నారు.