breaking news
Amaranathreddy
-
'నా టైమ్ వస్తే మిమ్మల్ని కాలితో తొక్కేస్తా'
చేసేదంతా చేసి నెపాన్ని ఇతరులపై నెట్టేయడంలో రాటుదేలిన టీడీపీ నాయకులతో కలసి మాజీమంత్రి ఆడిన నాటకం రక్తికట్టలేదు. గంగవరం మండలంలో నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి పలమనేరులో శనివారం హైడ్రామా నడిచింది. ఏమి చేసినా తమ పప్పులు ఉడక్కపోవడంతో ఆ బాధనంతా పోలీసులపై చూపారు మాజీ మంత్రి అమరనాథరెడ్డి. జరిగిన సీన్‌ను తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైఎస్సార్సీపీ కుట్రేనంటూ పోలీసులుపై నడివీధిలో విరుచుకుపడ్డారు. సాక్షి, పలమనేరు: గంగవరం మండలం కంచిరెడ్డిపల్లికి చెందిన సోమశేఖర్‌రెడ్డి భార్య కామాక్షమ్మ మామడుగు సెగ్మెంట్‌కు ఎంపీటీసీగా టీడీపీ తరఫున నామినేషన్ వేసింది. కుటుంబ సభ్యుల సూచనతో ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకుంది. పట్టణంలోని మాజీమంత్రి ఇంటికి సమీపంలో తన బంధువుల ఇంటి వద్ద ఆమె ఉండగా, గంగవరం మండల టీడీపీ నాయకులు మాజీమంత్రితో కలసి ఆమెను విత్‌డ్రా చేయవద్దంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, సీఐ శ్రీధర్ సిబ్బందితో కలసి అభ్యర్థిని ఉన్న ఇంటి వద్దకెళ్లి టీడీపీ నాయకులను బయటకు పంపారు. ఆమెను బయటకు పిలిపించి, విచారించారు. తాను స్వచ్ఛందంగా నామినేషన్ విత్‌డ్రాకు వెళుతుంటే టీడీపీ నాయకులు వద్దంటూ ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. దీంతో ఆమెకు రక్షణ కల్పించి గంగవరం పోలీసుల ద్వారా ఎంపీడీఓ కార్యాలయానికి పంపారు. పోలీసులపై అక్కసు వెళ్లగక్కుతూ వస్తున్న అమరనాథ రెడ్డి, నాయకులు పోలీసులపై మాజీ మంత్రి ప్రతాపం తాము అనుకున్న పథకం సాగకపోవడంతో మంత్రి అక్కడున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా టైమ్ వచ్చినప్పుడు కాలితో తొక్కేస్తా, ఇది పనికిమాలిన రాజకీయం’ అంటూ పోలీసులపై తన ప్రతాపాన్ని చూపారు. పత్రికల్లో రాయలేని భాషలో దూషించారు. ప్రజలు చూస్తుండగానే పోలీసులు, ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కారు. పోలీసులను దూషించిన విషయాలను అప్పటికప్పుడే ఎస్పీకి డీఎస్పీ స మాచారమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పోలీసులు భద్రం చేశారు. చదవండి: మద్యం, డబ్బు పంపిణీపై ఉక్కుపాదం మరో డ్రామాకు సిద్ధం జరిగిన సంఘటనను టీడీపీకి సానుభూతి దక్కేలా చేసే ప్రయత్నంలో భాగంగా మాజీ మంత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ ఎంపీటీసీ అభ్యర్థిని వైఎస్సార్సీపీ వారే బలవంతంగా విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నించారని, తాను వెళ్లి ఆమెకు రక్షణగా నిలిచానని తెలపడం విశేషం. పోలీసులే ఆమెతో విత్‌డ్రా చేయించారని బురదచల్లే ప్ర యత్నం చేశారు. పోలీసులకు అభ్యర్థిని ఫిర్యాదు జరిగిన సంఘటనపై అభ్యర్థిని కామాక్షమ్మ గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను టీడీపీ వారే విత్‌డ్రా చేయవద్దంటూ బలవంతం చేశారని, దీంతో పలమనేరు పోలీసులు తనను కాపాడారని తెలిపారు. తాను కుటుంబ సభ్యుల సూచన మేరకు స్వచ్ఛందంగా నామినేషన్‌ను విత్‌డ్రా చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాజీ మంత్రి నాటకం బట్టబయలైంది. -
29న రాష్ర్ట బంద్‌ను జయప్రదం చేయండి
రాయచోటి : ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 29 వతేదీన చేపట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అమరనాథ్‌రెడ్డి కోరారు. స్థానిక ఎస్ఎన్కాలనీలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బంద్‌ను విజయవం తం చేయడం ద్వారా ఈ రాష్ర్ట ప్రజల మనోభావాలను జాతీయ స్థాయిలో చాటాలన్నారు. ఆనాడు పార్లమెంటులో బీజేపీ నేతలు అరుణ్‌జైట్లి, వెంకయ్యనాయుడు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదని, 10ఏళ్ల పాటు అవసరమని వాదించి ప్రస్తుతం ప్యాకేజీ అంటూ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ప్రత్యే క హోదా సాధన కోసం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి డిల్లీలో ధర్నా చేపట్టి జాతీయ,అంతర్జాతీయ స్థాయికి ఈ సమస్యను తీసుకెళ్లారన్నారు. సీఎం చంద్రబాబు డిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు గట్టిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసనలు తెలియజేయడం ఒక్కటే మార్గమని, తద్వారా నే ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. అనంతరం ఎమ్మె ల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కేవలం రాజధానిపై గ్రాఫిక్స్ తయారు చేసి ప్రకటనలు ఇస్తూ ప్రత్యేక హోదాపై తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తొలి నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే వస్తోందన్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు కడప అగ్రికల్చర్ : రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నిలువునా మోసం చేసిన బీజేపీ, ప్రత్యేక హోదా తెస్తామని నమ్మబలికిన టీడీపీ తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 29వ తేదీన ఇచ్చిన బంద్ పిలుపునకు సీపీఐ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి. ఈశ్వరయ్య ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ అంటూ నమ్మబలికి నేడు చావుకబురు చల్లగా సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్నారని పేర్కొన్నారు.