breaking news
Amar Babu
-
తగ్గుతున్న పీసీల విక్రయాలు
న్యూఢిల్లీ : పర్సనల్ కం ప్యూటర్ల(పీసీ) అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో తగ్గాయి. పీసీ మార్కెట్ క్షీణించడం ఇదే తొలిసారి. 2013-14లో 1.18 కోట్లు గా ఉన్న పీసీ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 10% క్షీణించి 1.06 కోట్లకు తగ్గాయని ఎంఏఐటీ-ఐఎంఆర్బీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక వివరాలను మెయిట్ ప్రెసిడెంట్ అమర్ బాబు వెల్లడించారు. దీని ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరంలో పీసీల అమ్మకాలు మరో 10 శాతం తగ్గుతాయి. కాగా నోట్‌బుక్‌ల విక్రయాలు 17 శాతం వృద్ధి చెందుతాయి. -
లెనొవొ కొత్త స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: పర్సనల్ టెక్నాలజీ పరికరాలు తయారు చేసే లెనొవొ ఇండియా కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, వైబ్ ఎక్స్‌ను మంగళవారం భారత్‌లో ఆవిష్కరించింది. వైబ్ సిరీస్ స్మార్ట్ఫోన్లలో భారత్‌లో అందిస్తున్న ఈ తొలి ఫోన్ ధర రూ.25,999గా నిర్ణయించామని లెనొవొ ఇండియా ఎండీ అమర్ బసు తెలిపారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో ఐదు అంగుళాల ఫుల్ హెచ్డీ కెపాసిటివ్ టచ్‌స్క్రీన్, 1.5 గిగా హెట్స్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 13 మెగా పిక్సెల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ కెమెరా(ఫ్రంట్) వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. స్క్రాచ్ రెసిస్టెంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. కొన్నేళ్లలోనే భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 5 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని చెప్పారు.