breaking news
allOut
-
ఆలౌట్ లిక్విడ్ తాగి బాలుడి మృతి
మియాపూర్: దోమల నివారణకు వినియోగించే ఆలౌట్ లిక్విడ్‌ను తాగిన ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోయిర్ గ్రామానికి చెందిన ఎండీ జుబేర్, పరీ్వనా బేగం దంపతులు శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. జుబేర్ డ్రైవర్ పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జుబేర్ విధులకు వెళ్లగా.. పరీ్వనాబేగం ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఏడాదిన్నర బాలుడు అబ్బు జాకీర్ ఇంట్లో ఆడుకుంటూ దోమల నివారణకు వాడే ఆలౌట్ లికి ్వడ్‌ను తాగాడు. కొద్దిసేపు తర్వాత బాలుడు ఏడుస్తుండటంతో పరీ్వనాబేగం వెళ్లి పరిశీలించగా జాకీర్ నోట్లోంచి లిక్విడ్ వాసన వచి్చంది. చికిత్స నిమిత్తం నిలోఫర్‌కు తరలించారు. అక్కడ శుక్రవారం అర్ధరాత్రి జాకీర్ మృతిచెందాడు. బాలుడి తండ్రి జుబేర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు. -
భారత్ 109 ఆలౌట్
నిజంగానే నిజం! 109 పరుగులకే ఆలౌటైంది ఆస్ట్రేలియా కాదు... భారతే! గత రెండు టెస్టుల్లో ఎదురులేని టీమిండియా జోరు చూసినోళ్లకు ఇది కచ్చితంగా షాకే! చూసినోళ్లకే కాదు... మైదానంలో ఆడుతున్న భారత్‌కూ ఊహించని షాక్. గత రెండు టెస్టుల్లో తమ భరతం పట్టిన ఆతిథ్య జట్టును ఆసీస్ దెబ్బ తీసింది. అనంతరం బ్యాటింగ్‌లో నిలకడగా ఆడుతూ తొలిరోజే పటిష్టమైన ఆధిక్యానికి శ్రీకారం చుట్టింది. ఇండోర్: తనదైన రోజున ఓ ఆటగాడిని లేదంటే జట్టుని అంత తేలిగ్గా తీసుకోరాదనేది ఇండోర్ టెస్టు మొదలైన రోజును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆస్ట్రేలియా స్పిన్ ద్వయం కునెమన్ (5/16), లయన్ (3/35) టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఒక్క సెషన్లోనే కుదేలు చేసింది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. కోహ్లి (52 బంతుల్లో 22; 2 ఫోర్లు) టాప్ స్కోరర్! అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 54 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. 47 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో ఇంకా 6 వికెట్లున్నాయి. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా (147 బంతుల్లో 60; 4 ఫోర్లు) రాణించాడు. జడేజాకు 4 వికెట్లు దక్కాయి. రాహుల్ స్థానంలో గిల్ కెప్టెన్ రోహిత్ ఫామ్‌లో లేని రాహుల్‌ను కాదని శుబ్‌మన్ గిల్‌తో ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. సీమ్ బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కోవడం, బౌండరీలు సులువుగా రావడంతో అనుభవజ్ఞుడైన స్మిత్ ఆరో ఓవర్లోనే స్పిన్నర్ కునెమన్‌ను దించాడు. ఈ ఎత్తు ఫలితమివ్వగా... కెప్టెన్ రోహిత్ (23 బంతుల్లో 12; 3 ఫోర్లు) స్టంపౌటయ్యాడు. తన మరుసటి ఓవర్లో గిల్ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో కెప్టెన్ స్మిత్ బంతిని పూర్తిగా స్పిన్నర్ల చేతుల్లోనే పెట్టాడు. లయన్ కూడా తన తొలి ఓవర్లోనే వెటరన్ పుజారా (1)ను అసాధారణ టర్న్‌తో బౌల్డ్ చేశాడు. 36 పరుగులకే టాపార్డర్ పెవిలియన్కెళ్లింది. లయన్ తన తదుపరి ఓవర్లో జడేజా (4)ను బోల్తా కొట్టించాడు. స్లో డెలివరీని బౌండరీ కొట్టాలనుకుంటే అక్కడే ఉన్న కునెమన్ చురుగ్గా అందుకున్నాడు. మరుసటి ఓవర్లో... అదికూడా కేవలం 2 బంతుల వ్యవధిలోనే శ్రేయస్ అయ్యర్ (0) విస్మయపరిచే రీతిలో వెనుదిరిగాడు. కునెమన్ బంతి అయ్యర్ బ్యాట్ అంచును తగిలి వికెట్లను తాకీతాకనట్లుగా వెళ్లింది. బెయిల్ నెమ్మదిగా కిందకు పడటం... ఈ లోపు కీపర్ నుంచి బంతి వికెట్ల వైపు రీబౌండ్ కావడంతో అయ్యర్ తాను అవుట్ కాదనే భ్రమలో ఉండిపోయాడు. టీవీ అంపైర్ రీప్లే చూసి అవుటివ్వడంతో క్రీజు వీడక తప్పలేదు. 11.2 ఓవర్లలో 45 పరుగులకే సగం (5) వికెట్లు కూలడంతో భారత్ కష్టాల్లో పడింది. అందరికంటే ఎక్కువ బంతులు, ఎక్కువసేపు క్రీజులో నిలిచిన కోహ్లిని మూడో స్పిన్నర్ మర్ఫీ ఎల్బీగా పంపాడు. కోహ్లి రివ్యూకెళ్లినా ఫలితం లేకపోయింది. శ్రీకర్ భరత్ (17; 1 ఫోర్, 1 సిక్స్) కూడా త్వరగానే అవుటయ్యాడు. 84/7 స్కోరు వద్ద లంచ్కెళ్లిన భారత్... రెండో సెషన్ మొదలైన కాసేపటికే 100 పరుగుల్ని కష్టంగా దాటి... అంతలోపే ఆలౌటైంది. 2: కపిల్ దేవ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు తీసుకోవడంతోపాటు 5000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. 1: టెస్టుల్లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో ఎక్స్‌ట్రాలు ఇవ్వని తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వలేదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) క్యారీ (బి) కునెమన్ 12; గిల్ (సి) స్మిత్ (బి) కునెమన్ 21; పుజారా (బి) లయన్ 1; విరాట్ కోహ్లి (ఎల్బీ డబ్ల్యూ) (బి) మర్ఫీ 22; రవీంద్ర జడేజా (సి) కునెమన్ (బి) లయన్ 4; శ్రేయస్ అయ్యర్ (బి) కునెమన్ 0; భరత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 17; అక్షర్ పటేల్ (నాటౌట్) 12; అశ్విన్ (సి) క్యారీ (బి) కునెమన్ 3; ఉమేశ్ యాదవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కునెమన్ 17; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (33.2 ఓవర్లలో ఆలౌట్) 109. వికెట్ల పతనం: 1–27, 2–34, 3–36, 4–44, 5–45, 6–70, 7–82, 8–88, 9–108, 10–109. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 5–0–21–0, కామెరాన్ గ్రీన్ 2–0–14–0, కునెమన్ 9–2–16–5, నాథన్ లయన్ 11.2–2–35–3, మర్ఫీ 6–1–23–1. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ట్రావిస్ హెడ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 9; ఉస్మాన్ ఖాజా (సి) గిల్ (బి) జడేజా 60; లబుషేన్ (బి) జడేజా 31; స్టీవ్ స్మిత్ (సి) భరత్ (బి) జడేజా 26; హ్యాండ్స్కాంబ్ (బ్యాటింగ్) 7; గ్రీన్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (54 ఓవర్లలో 4 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–12, 2–108, 3–125, 4–146. బౌలింగ్: అశ్విన్ 16–2–40–0, రవీంద్ర జడేజా 24–6–63–4, అక్షర్ పటేల్ 9–0–29–0, ఉమేశ్ యాదవ్ 2–0–4–0, సిరాజ్ 3–0–7–0. -
బంగ్లాదేశ్ 254 ఆలౌట్
మిర్పూర్: నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న జింబాబ్వే... తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను కట్టడి చేసింది. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు మైదానంలో చురుకైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. దీంతో షేర్-ఎ-బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... రెండో రోజు ఆదివారం పన్యన్గరా (5/59) ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది. ముష్ఫీకర్ రహీమ్ (126 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్), మహ్మదుల్లా (160 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), మోమినల్ హక్ (112 బంతుల్లో 53; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ఆట ముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ప్రస్తుతం జింబాబ్వే 9 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 27/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లా ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. శంసూర్ రెహమాన్ (8) విఫలమైనా... మహ్మదుల్లా కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మోమినల్తో కలిసి మూడో వికెట్‌కు 63; ముష్ఫీకర్తో కలిసి ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అయితే మహ్మదుల్లా అవుటైన తర్వాత... ముష్ఫీకర్‌కు సహకారం అందించేవారు కరువయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 45 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లను చేజార్చుకుంది. -
బౌలింగ్‌లో.. జిల్లా జట్టు అదుర్స్
- 201 పరుగులకే ఆలౌట్ అయిన కృష్ణా జట్టు విజయనగరం మున్సిపాలిటీ: అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీల్లో భాగంగా జిల్లాలో జరుగుతున్న రెండ వ రౌండ్ మ్యాచ్‌లో అతిథ్య విజయనగరం జట్టు క్రీడాకారులు రెండవ రోజు శుక్రవారం బౌలింగ్ విభాగంలో అదరగొట్టారు. పట్టణ శివారులో గల విజ్జిస్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో పి.తేజస్వి 51 పరుగులిచ్చి ఐదు వికె ట్లు, పి.తపశ్వి 78 పరుగులిచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 70 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జట్టు క్రీడాకారులు 73.4 ఓవర్లలో పది వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేశారు. జట్టులో ఎ.మనోజ్‌కుమార్ ఐదు ఫోర్లతో 42 పరుగులు, వి.అనిరుధ్ నాలుగు ఫోర్లతో 39 పరుగులు చేశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన విజయనగ రం జట్టు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్ల లో వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసిన ప.గోజట్టు డాక్టర్ పీవీజీ.రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నెల్లూరు-ప.గో జట్ల మధ్య జరుగుతున్న మరో మ్యాచ్ రెండవ రోజు ఆటలో పశ్చిమగోదావరి జట్టు క్రీడాకారులు 36.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టాని కి 105 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 23 పరుగుల ఓవర్‌నైట్ స్కోరు వద్ద ప.గో జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. జట్టులో మునీష్‌వర్మ 11 ఫోర్లతో 52 పరుగులు చేయగా, మరో క్రీడాకారుడు జీఎస్ఎస్ స్వామినాయుడు ఐదు ఫోర్లతో 26 పరుగులు చేశారు. బౌలింగ్ విభాగంలో నెల్లూరు క్రీడాకారులు హర్ష, మణికంఠ లు చెరో రెండు వికెట్లు తీశారు.