breaking news
all India pre medical test
-
ఏఐపీఎంటీకి దరఖాస్తు చేయడమే శాపమా?
♦ నేటి పరీక్ష రాయుకపోతే రెండో దశ పరీక్షకు అనర్హులట! ♦ పరీక్షకు వుుందు రోజు ఎస్ఎంఎస్లు పంపించిన సీబీఎస్ఈ ♦ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో లేని పరీక్ష కేంద్రాలు ♦ పరీక్ష రాయూలంటే పుణె, హౌరా, చెన్నై, ఢిల్లీలకు వెళ్లాల్సిందే ♦ ఆందోళనలో వేలాది వుంది మెడికల్ ఆశావహులు సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్(ఏఐపీఎంటీ)కి దరఖాస్తు చేయడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శాపంగా మారింది. ఏఐపీఎంటీని ఇప్పుడు నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)గా మార్పు చేసిన నేపథ్యంలో ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన వారు మే 1న జరిగే పరీక్ష కు హాజరు కాకపోతే జూలై 24న జరిగే రెండో దఫా నీట్ పరీక్షకు అనర్హులని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) దరఖాస్తు చేసిన విద్యార్థులందరికీ ఎస్ఎంఎస్లు పంపింది. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఏఐపీఎంటీ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పరీక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికిప్పడు చెన్నై, హౌరా, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్లి పరీక్ష ఎలా రాయగలమని విద్యార్థులు వాపోతున్నారు. మరోవైపు పుణెలోని ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ కాలేజీ, ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్ కాలేజీల్లోని 15 శాతం సీట్లకే తాము దరఖాస్తు చేసినప్పుడు రెండో దఫా పరీక్షకు ఎందుకు అనువుతి ఇవ్వరన్న ఆందోళనలో పడ్డారు. ఏఐపీఎంటీని ఒక ఆప్షన్‌గా పెట్టుకునే దరఖాస్తు చేశావుని, దేశవ్యాప్తంగా నీట్‌ను కంపల్సరీ చే సినపుడు తవుకు ఎందుకు రెండో దశలో అవకాశం ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఎంసెట్‌లను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. అలాంటపుడు రాష్ట్ర ప్రభుత్వాల పరీక్షలను కాదని, నీట్-1కు వెళ్లితే ఇక్కడ సీట్లు కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. ఇప్పుడు నీట్‌కు దరఖాస్తు చేసిన దాదాపు 10 వేల వుంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంసెట్‌లను కాదని నీట్ రాస్తే.. దేశవ్యాప్తంగా సీట్లు ఇస్తారా? అంటే అదీ లేదు. తెలంగాణ, ఏపీ, జవుూ్మకశ్మీర్ రాష్ట్రాల విద్యార్థ్థులు ఎయిమ్స్, ఏఎఫ్ఎంసీలోని 15 శాతం సీట్లకు మాత్రమే అర్హులు. అలాంటపుడు ఈ 3 రాష్ట్రాల విద్యార్థులు నీట్-1 రాస్తే ఏంటి? నీట్-2 రాస్తే ఏంటి? ఎంసెట్ కాకపోతే ఆ 2 కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏఐపీఎంటీని కచ్చితంగా రామలన్న నిబంధన పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నేషనల్ మాల్లో లేనపుడు పరీక్ష ఎందుకు? 2013లో నీట్ పరీక్షను ప్రవేశ పెట్టిన సమయంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో ఉవ్ముడి ఆంధ్రప్రదేశ్, జవుూ్మకశ్మీర్ విద్యార్థులు ఏఎఫ్ఎంసీ, ఎరుుమ్స్‌లోని 15 శాతం సీట్లకు వూత్రమే అర్హులని పేర్కొంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కాలేజీల్లోని 15 శాతం ఓపెన్‌కోటా సీట్లకు అనర్హులని స్పష్టం చేసింది. నీట్ ద్వారా ఎంపికయ్యే ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉవ్ముడి ఆంధ్రప్రదేశ్, జవుూ్మకశ్మీర్లోని కాలేజీల్లో సీట్లు పొందడానికి అనర్హులని చెప్పింది. అలాంటపుడు ఇక్కడి విద్యార్థులకు నీట్ ఎందుకన్న వాదన వస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ద్వారా మెడికల్ ప్రవేశాలు నిర్వహించాలనుకుంటే.. తెలంగాణ, ఏపీలోని విద్యార్థులకు ఎంసెట్ తరహాలో ఇక్కడి ప్రాంతీయ భాష అరుున తెలుగులోనూ(ఇంగ్లిషుతోపాటు) నీట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడి సీట్లలో ఇతర రాష్ట్ర విద్యార్థులు రావడానికి వీల్లేదు. జాతీయ స్థాయిలోని ఆ రెండు విద్యా సంస్థలు మినహా ఇతర రాష్ట్రాల్లోని ఏ విద్యా సంస్థలోనూ ఇక్కడి విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి వీల్లేదన్న నిబంధన పెడుతున్నాయి. అలాంటపుడు ఇంగ్లిషుతోపాటు ఇక్కడి ప్రాంతీయు భాషలో నీట్ నిర్వహించాలని విద్యార్థులు డివూండ్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో 1,00,922 వుంది విద్యార్థుల అగ్రికల్చర్ అండ్ మెడికల్ సీట్ల కోసం దరఖాస్తు చేస్తే అందులో 55 శాతం మంది తెలుగు మీడియుం వారే. ఇక ఏపీలోనూ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న 1.30 లక్షల మందిలో సగానికిపైగా తెలుగు మీడియుం వారే. వీరందరికి నీట్ పేరుతో ఇంగ్లిషు లేదా హిందీ ప్రవేశపరీక్ష పెడితే తెలుగు మీడియంలో చదువుకున్న తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ రద్దు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆల్ ఇండియా ప్రి మెడికల్ టెస్టు ప్రశ్నా పత్రాలు లీకైన నేపథ్యంలో అది చెల్లదని స్పష్టం చేసింది. నాలుగువారాల్లోగా కొత్తగా పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కూడా సీబీఎస్ఈని ఆదేశించింది. పరీక్ష కేంద్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ప్రశ్నా పత్రాల లీకేజీ సమస్య ఏర్పడుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారైనా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. అంతకుముందు మరోసారి పరీక్షకు ఏర్పాట్లు చేస్తే జాప్యం అవుతుందని, విద్యార్థులు నష్టపోతారని సీబీఎస్ఈ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ప్రశ్నాపత్రాలు లీక్ అవలేదని సీబీఎస్ఈ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మొత్తం 6.3 లక్షల మందికి ఇప్పటికే ఓసారి పరీక్ష నిర్వహించింది. ప్రశ్నాపత్రాలు లీకవడంతో కొందరు కోర్టుకు వెళ్లగా జూన్ 5న వెలువరించాల్సిన ఫలితాలు ఆగిపోయాయి. -
'మేం చెప్పేంతవరకూ ఫలితాలు వెల్లడించవద్దు'
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా మెడికల్ టెస్టును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రీ మెడికల్ టెస్టు ఫలితాలు వెల్లడించకుండా స్టేను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ మెడికల్ టెస్టులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని అభ్యర్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.