breaking news
Alaukika
-
భయపెడుతూ..నవ్విస్తూ...
హారర్ చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎంత భయపెట్టినా, ఇంకా భయపడాలని కోరుకుంటారు ప్రేక్షకులు. మరో చిత్రం ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైంది. మనోజ్ నందం, మాదాల రవి ముఖ్యతారలుగా శ్రీ హయగ్రీవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా. జేఆర్ రావు నిర్మించిన చిత్రం ‘అలౌకిక’. భానుకిరణ్ చల్లా దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. మంచి హారర్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెడుతూనే నవ్విస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు. -
భయపెడుతూ వినోదం
‘‘హారర్ కామెడీతో పాటు సందేశం ఉన్న సినిమా ఇది’’ అని దర్శకుడు భానుకిరణ్ చల్లా చెప్పారు. బ్రహ్మాజీ, మనోజ్ నందం, హరిణి, మాదాల రవి, ఉత్తేజ్ ముఖ్యతారలుగా జె. రామారావు నిర్మిస్తున్న ‘అలౌకిక’ చిత్రం పూజా కార్యక్రమాలు మంగళవారం హైదరాబాద్లో జరిగాయి. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, డిసెంబరులో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు మాదాల రవి, మనోజ్నందం, సంగీత దర్శకుడు ప్రమోద్, కెమెరామేన్ సూర్యప్రకాశ్రావు మాట్లాడారు. న్యాయం ప్రకారం పోరాడుతున్నా... - మాదాల రవి లైంగిక వేధింపుల ఆరోపణలను ఇటీవల ఎదుర్కొన్న నటుడు, నిర్మాత మాదాల రవి తొలిసారిగా ఆ వ్యవహారంపై ఈ ప్రెస్మీట్లో పెదవి విప్పారు. ‘‘నాపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలే. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. న్యాయం ప్రకారం పోరాడుతున్నా. నాకు న్యాయవ్యవస్థపై నూటికి నూరుశాతం నమ్మకం ఉంది. ఆ సంఘటన జరిగిన రాత్రే నేను బెయిల్ తీసుకున్నాను. అంతే తప్ప నేను జైలుకు వెళ్లలేదు’’ అని మాదాల రవి తెలిపారు.