breaking news
Alagu varsini
-
అనంతగిరిలో ఆయూష్ కేంద్రం
సాక్షి, వికారాబాద్: తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి కొండపై ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఆయూష్ రాష్ట్ర కమిషనర్ అలుగు వర్షిణిలు తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిలో ఉన్న టీబీ ఆస్పత్రిని, వార్డులను తదితర భవనాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతగిరిలో టీబీ ఆస్పత్రితో పాటు ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో టీబీ ఆస్పత్రి మరమ్మతులకు విడుదలైన నిధులను సక్రమంగా ఉపయోగించలేదన్నారు. ఆయూష్ ఆరోగ్య కేంద్రానికి అవసరమైన భవన నిర్మాణాలకు, మరమ్మతులకు విడుదలైన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామన్నారు. ఇపుడు ఆయూష్ హాస్పిటల్ ప్రారంభించేందుకు రూ.6కోట్ల ని«ధులు మంజూరయ్యాయని విడతల వారీగా ఆయూష్ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆయూష్ రాష్ట్ర కమిషనర్ అలుగు వర్షిణి మాట్లాడుతూ... దశాబ్దాలకు ముందే ఇక్కడ టీబీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారని, ప్రస్తుతం టీబీ రోగులు బాగా తగ్గారని వారి కోసం ప్రత్యేకంగా ఆస్పత్రి కొనసాగుతుందని కొత్తగా ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఇక్కడ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక్కడ అవసరమైన భవనాలు, సిబ్బంది, మౌలిక వసతులు అన్నింటిని త్వరలోనే సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ ఆస్పత్రి సూపరిటెండెంట్ సుధాకర్షించే, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, ఆయూష్ కమిషనర్ అలుగు వర్షిణి -
బీసీ హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పెద్దపల్లిరూరల్: రంగంపల్లిలోని వెనకబడిన తరగతుల వసతి గృహాన్ని కలెక్టర్ అలగు వర్షిణి మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. వసతిగృహ ఆవరణంతా కలియతిరిగిన కలెక్టర్ సౌకర్యాల కల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులకు వండిపెడుతున్న అన్నం, కూరలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని విద్యార్థులను ఆరా తీశారు. మరుగుదొడ్లను పరిశీలించడంతోపాటు నీటి సరఫరా, కరెంటు, గదులలో ఫ్యాన్ సౌకర్యాల ఏర్పాట్లను చూసిన కలెక్టర్ వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణగా ఉండేందుకు గాయత్రీ విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ అందించిన రగ్గులనుమ కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.