బీసీ హాస్టల్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ | collector sudden inspection in BC hostel | Sakshi
Sakshi News home page

బీసీ హాస్టల్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

Jan 4 2017 11:01 PM | Updated on Sep 5 2017 12:24 AM

బీసీ హాస్టల్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

బీసీ హాస్టల్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

రంగంపల్లిలోని వెనకబడిన తరగతుల వసతి గృహాన్ని కలెక్టర్‌ అలగు వర్షిణి మంగళవారం రాత్రి తనిఖీ చేశారు.

పెద్దపల్లిరూరల్‌:  రంగంపల్లిలోని వెనకబడిన తరగతుల వసతి గృహాన్ని  కలెక్టర్‌ అలగు వర్షిణి  మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. వసతిగృహ ఆవరణంతా కలియతిరిగిన కలెక్టర్‌ సౌకర్యాల కల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిలోకి వెళ్లిన కలెక్టర్‌ విద్యార్థులకు వండిపెడుతున్న అన్నం, కూరలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని విద్యార్థులను ఆరా తీశారు. మరుగుదొడ్లను పరిశీలించడంతోపాటు నీటి సరఫరా, కరెంటు, గదులలో ఫ్యాన్  సౌకర్యాల ఏర్పాట్లను చూసిన కలెక్టర్‌ వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు.

 బీసీ హాస్టల్‌ విద్యార్థులకు చలి నుంచి రక్షణగా ఉండేందుకు గాయత్రీ విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్‌ అందించిన రగ్గులనుమ కలెక్టర్‌ విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement