breaking news
Akshaya Moondra
-
Vodafone Idea: 6 నెలల్లో 5జీ సేవల విస్తరణ
ముంబై: టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) ప్రతిపాదిత రూ. 18,000 కోట్ల ఎఫ్పీవో ద్వారా నిధులు సమీకరణ అనంతరం 6–9 నెలల్లోగా 5జీ సరీ్వసులు విస్తరించే యోచనలో ఉంది. నిధుల కొరత వల్లే ఇప్పటివరకు సర్వీసులను ప్రారంభించలేకపోయామని సంస్థ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. రాబోయే 24–30 నెలల్లో తమ మొత్తం ఆదాయంలో 5జీ వాటా 40 శాతం వరకు ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎఫ్పీవో ద్వారా సేకరించే నిధుల్లో రూ. 5,720 కోట్ల మొత్తాన్ని 5జీ సరీ్వసులకు వినియోగించనున్నట్లు ముంద్రా వివరించారు. వొడా–ఐడియా ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో) ఏప్రిల్ 18న ప్రారంభమై 22తో ముగియనుంది. ఇందుకోసం ధర శ్రేణిని షేరుకు రూ. 10–11గా నిర్ణయించారు. ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా సేకరించే రూ. 18,000 కోట్లలో రూ. 15,000 కోట్ల మొత్తాన్ని 5జీ సేవల విస్తరణ, ఇతరత్రా పెట్టుబడుల కోసం వినియోగించుకోనున్నట్లు ముంద్రా వివరించారు. ప్రధానంగా కస్టమర్లు చేజారి పోకుండా చూసుకోవడం, యూజరుపై సగటు ఆదాయాన్ని (ఆర్పూ) పెంచుకోవడం, నెట్వర్క్పై పెట్టుబడులు పెట్టడం తమకు ప్రాధాన్యతాంశాలుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 2జీ యూజర్లు ఎక్కువగా ఉన్నందున తమ ఆర్పూ మొత్తం పరిశ్రమలోనే తక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే, ప్రస్తుతం తమ 21.5 కోట్ల యూజర్లలో కేవలం 2జీనే వినియోగించే వారి సంఖ్య 42 శాతంగా ఉంటుందని, వీరంతా 4జీకి అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నందున ఆర్పూ మెరుగుపడేందుకు ఆస్కారం ఉందన్నారు. -
ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా భారత్లో టెలికం కంపెనీలపై పన్నుల మోత
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా భారత్లో టెలికం కంపెనీలపై పన్నుల మోత ఉంటోందని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ్ ముంద్రా వ్యాఖ్యానించారు. పెట్టుబడులు భారీగా అవసరమయ్యే టెలికం పరిశ్రమపై ఇది మరింత భారం మోపుతోందని ఇండియా మొబైల్ కాంగ్రెస్లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. వ్యాపార నిర్వహణకు అవసరమైన ఆదాయాన్ని ఆర్జించి, దాన్ని టెలికం నెట్వర్క్లపై తిరిగి ఇన్వెస్ట్ చేసే విధంగా పరిశ్రమపై ప్రభుత్వం పన్నుల భారం తగ్గించాలని పేర్కొన్నారు. టెలికం పరిశ్రమ 18 శాతం జీఎస్టీ, ఇతరత్రా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలతో పాటు స్పెక్ట్రం కొనుగోలు కోసం వెచ్చించినదంతా పరిగణనలోకి తీసుకుంటే ఏకంగా 58 శాతం పన్నులు కట్టినట్లవుతుందని ముంద్రా చెప్పారు.