ఆకలికేకలు విజయవంతం చేయండి
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : కాపుల ఆకలి కేకల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకటరాయుడు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం కాపు కల్యాణ మండపం వద్ద నిర్వహించిన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహం కూడలి వద్ద ప్లేట్లు, గరిటెలతో శబ్ధం చేసే నిరసన కార్యక్రమం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాపులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కొత్తపల్లి సుబ్బలక్ష్మి
కాపునాడు జిల్లా మహిళా అధ్యక్షు రాలిగా కొత్తపల్లి సుబ్బలక్షి్మని చినమిల్లి వెంకట రాయుడు నియమించారు. తాడేపల్లిగూడెం పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న సుబ్బలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఎంపిక చేశారు. పెంటపాడు మండల అధ్యక్షుడిగా పెన్నాడ సూరిబాబును నియమించారు.
కాపుల ఆకలి కేకలు నిరసనకు అనుమతి
తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం ఉదయం నిర్వహించే కాపుల ఆకలి కేకలు నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. స్థానిక కాపు కళ్యాణ మండపం వద్ద పట్టణ అధ్యక్షులు మాకా శ్రీనివాస్ శనివారం రాత్రి మాట్లాడుతూ పోలీస్ ఐలండ్ వద్ద ఆదివారం ఉదయం 10–11 గంటల మధ్య నిర్వహించే ఈ కార్యక్రమానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతారని చెప్పారు. కాపు రిజర్వేషన్లను పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ కాపు కుటుంబాలు ప్లేట్లు, కంచాలపై గరిటెలతో చప్పుడు చేసే కార్యక్రమం నిర్వహిస్తాయన్నారు. దీనికి డీఎస్పీని అనుమతి కోరగా, ఆయన అంగీకరిస్తూ ఆ¯ŒSలై¯ŒS ద్వారా సమాచారం పంపించారన్నారు. కాపులంతా ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.