breaking news
ajay manthena
-
'ఎంత అందంగా ఉన్నావె' పోస్టర్స్
ఓ అపార్ట్ మెంట్ లో చిగురించిన ప్రేమ నేపథ్యంలో ఎంత అందంగా ఉన్నావే చిత్రం రూపొందించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ఐ మహేంద్ర. యోగీశ్వర శర్మ సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అదనపు ఆకర్షణ. వినోదంతోపాటు భావోద్వేగాలు, చిలిపి సంఘటనలతో ఈ చిత్రం సరదాగా సాగిపోతుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు. -
ప్రేమికులకు కనెక్ట్ అయ్యే సినిమా
‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ‘నువ్విలా’ చిత్రం నాకెంత మంచి పేరు తెచ్చిందో, అంతకు రెట్టింపు పేరుని ఈ సినిమా తెస్తుందనే నమ్మకం ఉంది’’ అని అజయ్ మంతెన చెప్పారు. ఎస్.ఐ. మహేంద్ర దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ‘ఎంత అందంగా ఉన్నావె’ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. అజయ్ మంతెన, జియానా ఇందులో హీరో హీరోయిన్లు. ‘మంగళ’ తర్వాత తాను చేస్తున్న సినిమా ఇదని, బిజినెస్‌పరంగా మంచి స్పందన ఉందని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమికులకు కంపల్సరీగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. సాంకేతికంగా కూడా సినిమా బావుంటుంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా కెమెరామేన్ బాలరెడ్డి, చిత్ర సమర్పకుడు తమ్మిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు.