breaking news
ainapuram
-
‘కేక్’ బాధితుల ఇంట మరో విషాదం
సాక్షి, సిద్దిపేట: కుటుంబంలో ఇద్దరు మృతి చెందిన వారం రోజులు గడవక ముందే ఆ ఇంట మరో విషాదం జరిగిన ఘటన కొమురవెల్లి మండల పరిదిలోని అయినాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత బుధవారం రాత్రి పుట్టిన రోజు కేక్ తిని ఇస్తారిగల్ల రవీందర్, కుమారుడు రాంచరణ్‌లు మృతి చెందగా రవీందర్ భార్య నాగలక్ష్మి, కూతురు పూజితలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే... ఇదిలా ఉండగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న నాగలక్ష్మి నాన్నమ్మ(రాంచరణ్ తాతమ్మ) కర్రొల్ల బాలవ్వ(84) బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. నాగలక్ష్మి ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా భర్త, కుమారుడు మృతి చెందినట్లు తెలియని నాగలక్ష్మికి నాన్నమ్మ మృతి విషయం కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. చదవండి: పుట్టినరోజు కేక్‌లో విషం! -
అనుమానాస్పద స్థితిలోమహిళ మృతి
రంగారెడ్డి : దోమ మండలం ఐనాపురం గ్రామంలో ఓ మహిళ(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఐనాపురం గ్రామానికి చెందిన మహిళ ఆదివారం రాత్రి నుంచి కనిపించలేదు. ఈ క్రమంలో ఆమె గ్రామ సమీపంలోని పొలాలల్లో సోమవారం ఉదయం శవమై కనిపించింది. ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.