breaking news
ahmad baba
-
ఈ పావలా చాలు
గురువు ముల్లా అహ్మద్ జీవన్ తన శిష్యుడైన మొగల్ చక్రవర్తి ఔరంగజేబుతో.. ‘మీరు ఇచ్చిన పావలా బిళ్ల ఎంతో శుభప్రదమయినదిగా రూపుదాల్చింది. నేను దానితో పత్తిగింజలు కొని పత్తి పండించాను. దైవం ఎంతో బర్కత్ (శుభాన్ని) ఇచ్చాడు. కొన్నేళ్లలో వందలు, లక్షలుగా మారాయి’’ అని చెప్పాడు. ఔరంగజేబు అది విని చాలా సంతోషించాడు.‘‘మీరు అనుమతిస్తే ఆ పావలా బిళ్ల గాథ వినిపిస్తాను’’ అని అన్నారు ఔరంగజేబు. ‘‘తప్పక వినిపించండి’’ అన్నారు ముల్లా జీవన్. అప్పుడు ఔరంగజేబు తన నౌకరుకు, ‘చాందినీచౌక్‌లోని సేఠ్ ఉత్తమ్‌చంద్ ని ఫలానా తారీఖు ఖాతాతో సహా ప్రవేశపెట్టమని’ పురమాయించాడు. సేఠ్ ఉత్తమ్‌చంద్ వచ్చి ఖాతా తెరచి వివరించసాగాడు. ముల్లా జీవన్, చక్రవర్తి ఇద్దరూ చెవులొగ్గి వింటున్నారు. ఓ చోట సేఠ్ ఆగిపోయాడు. అక్కడ పావలా అని రాసి ఉంది కాని, దాని వివరాలేమీ లేవు. ఔరంగజేబు మృదువుగా అడిగాడు, ఆ పావలా ఏమయింది? అని. ‘అనుమతిస్తే దాని బాధాకరమయిన గాథ వినిపిస్తా’’నన్నాడు సేఠ్. అనుమతించారు. ‘‘ఓ రోజు రాత్రి కుండపోతగా వర్షం కురుస్తోంది. నా ఇల్లు కూడా కురవడం మొదలయింది. నా పద్దు పుస్తకాలన్నీ అందులోనే ఉన్నాయి. నేనెంత ప్రయత్నించినా ఇల్లు కురవడాన్ని ఆపలేకపోయాను. బయటకు తొంగిచూశాను. ఓ వ్యక్తి వీధి లాంతరు కింద నిలబడి కనిపించాడు. నేనతన్ని ‘సాయం చేస్తావా?’ అని అడిగాను. అతను చేస్తానని అన్నాడు. నాలుగయిదు గంటలపాటు కష్టపడి ఇంటి మీది పెంకులను సర్ది, అతి కష్టం మీద వాన నీరు లోపల కురవకుండా ఆపడంతోపాటు లోనికి వచ్చి సామానంతా సర్దాడు కూడా. అంతలో తెల్లవారు అజాన్ అయింది. అతను సెలవు తీసుకున్నాడు. నేను అతనికి కూలీ ఇవ్వాలనుకున్నాను. జేబులో పావలా తప్ప ఏమీ లేదు. అతనితో ‘బాబూ! ప్రస్తుతం ఈ పావలా తీసుకుని పొద్దున నా షాపుకు వస్తే పూర్తి కూలీ ఇస్తా’నని అన్నాను. అతను, ‘నాకు ఈ పావలా చాలు, నేను మళ్లీ రాలేను’ అని చెప్పి వెళ్లిపోయాడు. అతను వెళ్లే ముందు నేనూ, నా భార్య ఎంతో ప్రాధేయపడ్డాము పొద్దున రమ్మని. కాని అతను రాలేదు.. అని ఇదంతా వివరించి ఉత్తమ్‌చంద్ వెళ్లిపోయాడు. చక్రవర్తి ముల్లా గారితో చెప్పాడు, ‘ఆ చవన్నీ’ (పావలా బిళ్ల) అదే!’ అని!!‘ నేను ప్రతిరోజు మాదిరిగానే మారువేషంలో ప్రజల బాగోగులు విచారించడానికి వెళ్లగా ఇది సంభవించింది అని చెప్పాడు ఔరంగజేబు చక్రవర్తి. (ఆ పావలానే ఔరంగజేబుకు తన గురువుకు ఇచ్చారు). -
తనిఖీలతో హడలెత్తించిన కలెక్టర్
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదివారం నిర్మల్ లో ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. నిర్మ ల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఇక్కడికి వచ్చారు. ఆర్డీవో భవన నిర్మాణ పను లు, నిర్మల్‌లోని బస్టాండ్ సమీపంలో రూ.8 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించినా వినియోగంలోకి తీసుకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భవనంలోని గదులు పరిశీలించారు. నిర్మాణానికి వెచ్చించిన నిధులు, భవనంలో రోగులకు కల్పించే మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. భవనం ఎందుకు వృథాగా ఉంచారని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ధూంసింగ్ను ప్రశ్నించారు. సరైన రోడ్డు సౌకర్యం లేదని, పూర్తి స్థాయిలో పనులు కాలేదని సమాధానమిచ్చారు. చిన్న కారణాలతో భవనాన్ని నిరుపయోగంగా ఉంచడం సరికాదని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైన వసతులు కల్పిస్తానని చెప్పారు. ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. నిధుల కొరత కారణంగా ఆలస్యమవుతోందని సంబంధిత కాంట్రాక్టర్ చెప్పడంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జల్ద అరుణశ్రీ, తహసీల్దార్ అజ్మీరా శంకర్‌నాయక్, ఆర్ఐ షబ్బీర్ అహ్మద్ ఉన్నారు.