breaking news
Ae Dil Hai Mushki
-
వివాదాలతోనే కలెక్షన్ల దుమ్మురేపింది
ఏదైనా సినిమా గురించి వివాదం వచ్చిందంటే.. అసలు అందులో ఏముందో చూద్దామని అంతా ఉత్సాహం చూపిస్తారు. సరిగ్గా అదే అంశం ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు బాగా కలిసొచ్చింది. కరణ్ జోహార్ తీసిన ఈ సినిమాలో పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించడంతో సినిమాను నిషేధించాలని, దాన్ని ప్రదర్శించడానికి వీల్లేదని తీవ్రస్థాయిలో గొడవలు చెలరేగాయి. ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మధ్యవర్తిత్వం పుణ్యమాని సినిమా విడుదలైంది. దాంతో ఈ సినిమాకు బంపర్ కలెక్షన్లు వచ్చాయి. విడుదలైన మొదటిరోజున ఏకంగా రూ. 13.30 కోట్లు వసూలుచేసింది. రణబీర్ కపూర్, అనుష్కా శర్మ, ఐశ్వర్యా రాయ్ లాంటి పెద్ద స్టార్లు ఎంతమంది నటించినా, ఇందులో పాకిస్థానీ ఫవాద్ ఖాన్ ఉన్నాడన్న ప్రచారం మాత్రం బాగా జరిగింది. దాంతో బంపర్ కలెక్షన్లు వచ్చాయి. మరోవైపు అజయ్ దేవ్గణ్ హీరోగా వచ్చిన శివాయ్ సినిమా కూడా దీని స్థాయిలో కాకపోయినా బాగానే వసూలుచేసింది. ఈ సినిమాకు రూ. 10.24 కోట్ల వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఎరికా కార్, సయేషా సైగల్ నటించిన ఈ సినిమా చాలావరకు హిమాలయాల్లోనే ఉంటుంది. పర్వత ప్రాంత అందాలను అద్భుతంగా తెరకెక్కించడంతో ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా వసూళ్లు బాగానే ఉన్నాయి. #ADHM Fri ₹ 13.30 cr. India biz... EXCELLENT at plexes... Note: Dhanteras. Pre-Diwali. — taran adarsh (@taran_adarsh) October 29, 2016 #Shivaay is STRONG at single screens/mass circuits... Fri ₹ 10.24 cr. India biz... Note: Dhanteras. Pre-Diwali. — taran adarsh (@taran_adarsh) 29 October 2016 -
కన్నీళ్లు పెట్టిన దర్శక-నిర్మాత
ముంబై: షారూఖ్ ఖాన్ ప్రశంసకు దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. తాను దర్శకత్వం 'యే దిల్ హై ముష్కిల్' సినిమా మ్యూజిక్ చాలా బాగుందని షారూక్ మెచ్చుకున్నప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని తెలిపాడు. ఆయన ప్రశంస తనకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నాడు. 'షారూఖ్ ఖాన్ అలా చెప్పడం ఆయన గొప్పతనం. ఈ సినిమా, మ్యూజిక్ ఎలా ఉంటుందోనని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. సంగీతం బాగుందని షారూఖ్ ప్రశంసించడం ఉత్సాహానిచ్చింది. ఇది మాకు చాలా పెద్ద విషయం. షారూఖ్ ప్రశంసతో నా కళ్లలో నీళ్లు తిరిగాయ'ని కరణ్ జోహార్ చెప్పాడు. అయితే 'యే దిల్ హై ముష్కిల్' ట్రైలర్ చూసి షారూఖ్ పెదవి విచారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన తోసిపుచ్చాడు. తాను ట్రైలర్ చూడలేదని, పాటలు మాత్రమే విన్నానని చెప్పాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నాడు. ఐశ్వరరాయ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఫవద్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'యే దిల్ హై ముష్కిల్' సినిమా దీపావళికి విడుదల కానుంది.