breaking news
advertised
-
ప్రధాని అభ్యర్ధి ఎవరో ఇప్పుడే ప్రకటించం
కోల్కతా: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్’ ప్రధాని అభ్యర్ధిగా ఎవరి పేరును ప్రకటించడం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ముందుగానే చేసే అటువంటి ప్రకటన ప్రాంతీయ పార్టీలున్న తమ కూటమిలో విభేదాలకు బీజం వేస్తుందని, బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలన్న లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. శుక్రవారం కోల్కతాలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)నేత ఒమర్ అబ్దుల్లాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘దేశ క్షేమం కోసం బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయి. ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే అభ్యర్ధిని బరిలోకి దించుతాయి. బీజేపీ నియంత పాలనకు వ్యతిరేకంగా త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం’ అని ఒమర్ అన్నారు. -
జీఎస్టీ కొత్త రీటైల్ ధరలను పత్రికల్లో ప్రకటిస్తాం
న్యూఢిల్లీ: రెవెన్యూ సెక్రటరీ హస్ముక్ ఆదియా,ఇతర సీబీఈసీ అధికారులు న్యూఢిల్లీలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎస్టీ అమలుకు సంబంధించిన పలు అంశాలను మీడియాకు వివరించారు. జమ్ము కశ్మీర్ తప్ప మిగతారాష్ట్రాలన్నీ జీఎస్టీకి ఆమోదం తెలిపినట్టు రెవిన్యూ కార్యదర్శి హస్ముక్ ఆదియా ప్రకటించారు. ముఖ్యంగా జీఎస్టీఎన్లో సుమారు 2 లక్షల క్రొత్త రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని చెప్పారు. వీటిల్లో 39వేలు ఇప్పటికే ఆమోదం పొందాయన్నారు. రానున్న మూడు రోజుల్లో మిగిలినవాటిని కూడా ఆమోదించినున్నట్టు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికపుడు కేంద్రప్రభుత్వం మానిటర్ చేస్తోందని చెప్పారు. జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటివరకూ ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని చెప్పారు. ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో ఫీడ్ బ్యాక్ అండ్ యాక్షన్ రూంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సోమవారం క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఒక కమిటి నియమించినట్టు తెలిపారు. వివిధ డిపార్ట్మెంట్లలో సెక్రటరీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. టాప్ కార్యదర్శులతో కూడిన 15మందితో సెంట్రల్ పర్యవేక్షణ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఒక్కో అధికారికి నాలుగు, అయిదు జిల్లాల బాధ్యతలను అప్పగించామని చెప్పారు. ప్రతి మంగళవారం భేటీ ఉంటుందని తెలిపారు. తద్వారా వివిధ జిల్లాలనుంచి జీఎస్టీపై అమలు తీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకొని సమీక్షించనున్నునట్టు చెప్పారు. 20 లక్షల లోపు పన్నులు పరిస్థితి, బిల్లులు ఎలా యిస్తారనే దానిపై అనేక ప్రశ్నలు తమకెదురైనట్టు చెప్పారు. వీటికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే త్వరలోనే ఏ ఏ వస్తువుపై జీఎస్టీకి ముందు, అమలు తర్వాతి ధరలను స్పష్టంగా వివరించ నున్నట్టు తెలిపారు. ధరల మార్పు, సవరించిన ధర పాత ధర వివరాలను తయారీదారులు వార్తాపత్రికల్లో ప్రకటించాలని స్పష్టం చేశారు. టోల్, మండి చార్జీలు, రాష్ట్రాలకు వాహనాల ఎంట్రీపై ఫీజు కొనసాగుతుందనీ,అయితే సరుకులపై ఎంట్రీ పన్నుపై ఎటువంటి లెవీ ఉండదని తెలిపారు. రెవిన్యూ సీసీజీఎస్టీ అమలు తీరుపై వివిధ అంశాలపై డీడీ లైవ్ లో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించారు. మీడియాకోసం, వ్యాపారస్తులు, ఇతర ప్రజల కోసం 6రోజుల పాటు దూదర్శన్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మొదటి మూడురోజులు హిందీలో, తరువాత ఆంగ్లంలోఉంటుందనీ, ఈ కార్యక్రమానికి ప్రశ్నలను ముందుగానే పంపవచ్చని చెప్పారు.