breaking news
Aditya park hotel
-
బిర్యానీ ఫెస్టివల్..
అమీర్‌పేట: నోరూరించే వంటకాలు ‘పరాఠా, బిర్యానీ ఫుడ్ ఫెస్టివల్’లో భోజన ప్రియులను ఆహ్వానిస్తున్నాయి. అమీర్‌పేట ఆదిత్య పార్క్ హోటల్లో శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్ ఈనెల 21 వరకు కొనసాగుతుందని హోటల్ యాజమాన్యం గురువారం తెలిపింది. హోటల్ మాస్టర్ చెఫ్ ఎన్.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. శాఖాహారుల కోసం సబ్జి బిర్యానీ, మష్రూమ్, మక్కాయ్, కాబూలి, ఆవకాయ, పచ్చి మిరపకాయ బిర్యానీ, మాంసాహారులకు గోస్త్, ముర్గ్, నూర్ మహల్ ముర్గ్, అండా కగినా, ఆవాధి, మలాయ్ మహి, అంబర్ (మటన్) లేహా బిర్యానీతో బఫెట్‌ను అందుబాటులో ఉంచుతున్నావున్నారు. గులాబ్ ఫర్ని, గులాబ్ జామూన్, బేక్ట్ రసమలాయి, గాజర్ హల్వా, మిల్లి ఫుల్లి, డబుల్ కా మీఠా వంటి డెజర్ట్స్, బేక్ట్, పేస్ట్రీలు ప్రత్యేకమన్నారు. ప్రతి రోజు రాత్రి 7.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈ వంటకాలను ఆస్వాదించవచ్చని హోటల్ మేనేజర్ డి.వసంత్‌కుమార్ తెలిపారు. -
హోటల్ లో వ్యక్తి అనుమానాస్పదమృతి
హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ ఆదిత్యా పార్క్ హోటల్లోని రూం. నెంబర్ 310లో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన తిర్జీత్ చౌదరి(42)గా గుర్తించారు. కలకత్తాలోని కోలోప్లాస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ మీటింగ్ నిమిత్తం నగరానికి వచ్చినట్లు సమాచారం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.