breaking news
aayirathil oruvan
-
'రేయ్.. ఎవర్రా మీరంతా'.. థియేటర్లలోకి మళ్లీ వచ్చేస్తున్నాడు
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్లీ విడుదల చేసినా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామ్ చరణ్ లవ్ ఎంటర్టైనర్ ఆరెంజ్‌ను రీ రిలీజ్ చేశారు. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఇటీవల మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు థియేటర్లలో మరోసారి ఆడియన్స్‌ను అలరించింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు, సమంత, అంజలి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా మరో సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం యుగానికి ఒక్కడు(ఆయిరత్తిల్ ఒరువన్) (Yuganiki Okkadu) మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 2010లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బిగ్ హిట్‌గా నిలిచింది. ఈ విజువల్ వండర్ మూవీకి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.తాజాగా యుగానికి ఒక్కడు దాదాపు 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో రీరిలీజ్ కానుందని వెల్లడించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహా ఓటీటీలో అందుబాబులో ఉంది. తమిళ వర్షన్ సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.From gritty battles to heart-stopping drama❤️🔥Witness @Karthi_Offl's most captivating and raw performance in #YuganikiOkkadu on the big screens once again 🔥#YuganikiOkkaduReRelease in theatres from MARCH 14thBook your tickets now! -- https://t.co/Y4GE3fy2MiAP & TG,… pic.twitter.com/fNsmtD2UwL— Primeshow Entertainment (@Primeshowtweets) March 10, 2025 -
సీక్వెల్ మూవీ: హీరోని మార్చిన డైరెక్టర్
తమిళ హీరో కార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. తమిళంలో తెరకెక్కిన ఆయిరత్తిల్ ఒరువన్ సినిమాకు తెలుగు అనువాదమే యుగానికి ఒక్కడు. ‘7/జి బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి హిట్ సినిమాలను అందించిన దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. తాజాగా సినిమాకు సీక్వెల్‌ని ప్రకటించాడు డైరెక్టర్ సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమాలో మాత్రం కార్తి హీరోగా నటించడం లేదు. కారణం ఏంటో తెలియదు కానీ.. కార్తి స్థానంలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ధనుష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆయిరత్తిల్ ఒరువన్ 2 కోసం పూర్తి స్థాయిలో కష్ట పడతామని ధనుష్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశాడు. ఓ యువకుడు కొండ పైనుండి కింద ఉన్న పర్వతాలను చూస్తుంటాడు. తొలిభాగమైన యుగానికి ఒక్కడు సినిమాకు ఇది కొనసాగింపుగా ఉంటుందనడానికి ఇదే ప్రూఫ్‌గా కనిపిస్తోంది. 2024లో ఈ సినిమా విడుదల కానుంది. A magnum opus !! The pre production alone will take us a year. But a dream film from the master @selvaraghavan ! The wait will be long. But we will give our best to make it all worth it. AO2 ..The Prince returns in 2024 https://t.co/HBTXeN66iA — Dhanush (@dhanushkraja) January 1, 2021 -
జయలలితా మజాకా!
ఎన్నికలలో గెలవడానికి ఏమేం చేయాలో తమిళలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తికాదు. సాధారణంగా ఎన్నికలలో గెలుపుకు ఉపయోగపడతాయంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఏ అవకాశాన్ని వదులుకోదు. తమిళనాడులో అయితే ఒక అడుగు ముందుకు వేసి భాష, వాదం, అభిమానం...దేనినైనా తమకు అనుకూలంగా మలచుకుంటారు. అన్నాడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి, పురట్చితలైవి (విప్లవ వనిత) జయలలిత కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. రాజకీయాలలో ఆమె అందరికంటే 'రెండాకులు' ఎక్కువే చదివారు. తమిళుల ఆరాధ్యదైవం, ఒకప్పుడు కోలీవుడ్ ఏలిన ఎంజీఆర్‌ను ఈ ఎన్నికలలో మళ్లీ తెరపైకి తెస్తున్నారు. తైరపైకి... అంటే నిజంగానే తెరపైకి తేవడమే. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఎంజిఆర్ మకుటం లేని మహరాజుగా వెలుగొందారు. ఎన్నికల వేళ తన రాజకీయ గురువు ఎంజీఆర్ సరసన తాను నటించిన చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఇంకా చేసే ప్రయత్నంలో ఉన్నారు. జనం గుండెల్లో ఎక్కడో గుర్తుగా ఉండిపోయిన ఎంజీఆర్‌ను బైటకు తెచ్చి ఆయనపై వాళ్లకు ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలచుకోవాలన్నది తమిళనాట అమ్మగా పేరొందిన జయలలిత ఆకాంక్ష. ఏది చేసినా సమయం, సందర్భం, అదను చూసుకుని చేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఈ సూత్రం ఈ విప్లవ వనిత బాగా వంటబట్టించుకు న్నట్లు ఉన్నారు. తగిన సమయానికే ఆమెకు ఈ ఐడియా వచ్చింది. ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్లు ఇక్కడ రాజకీయాలనే మార్చేస్తుంది. ఈ ఐడియా ఓట్లను కురిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. ఎంజీఆర్ అంటే తమిళులకు ఎంతటి అభిమానమో అందరికీ తెలుసు. ఆయన సినిమాలకు కూడా వారు హారతిపడుతుంటారు. దీనిని ఆమె గుర్తించారు. జనంలో ఎంజీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ఎలాగైనా ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె పథకంలో భాగంగానే ఎంజీఆర్, జయలలిత జంటగా నటించిన చిత్రాలను ఎన్నికల వేళ విడుదల చేస్తున్నారు. ప్రజాభిమానం మెండుగా ఉన్న సినిమా హీరోలకు, హీరోయిన్లకు కలసి వచ్చే అంశం ఇది. 1965లో తెరపైకి వచ్చిన 'అయిరత్తిల్ ఒరువన్' (వేలల్లో ఒకడు) చిత్రంలో ఎంజీఆర్‌తో జయలలిత తొలిసారిగా హీరోయిన్గా నటించా రు. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. చెన్నైలోని మిడ్‌ల్యాండ్, శ్రీకృష్ణ మేఘల థియేటర్లలో వందరోజులు దాటి ప్రదర్శితమైంది. మదురై, కోవై, తిరుచ్చి, సేలం తదితర ప్రాంతాల్లో 150 రోజులకు పైగా ఆడింది. ఈ 48 ఏళ్లలో పలు ప్రాంతాల్లో పలుమార్లు విడు దలై బయ్యర్లకు లాభాల పంట పండించింది. అలాంటి చిత్రం మళ్లీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ తో ఆధునిక హంగులు దిద్దుకుని ఈ నెల 14న విడుదల చేశారు. ఈ చిత్రం ప్రదర్శించే థియేటర్ల వద్ద సందడే సందడి. ఆయా థియేటర్లలో ఎంజీఆర్ అభిమానులు భారీ కటౌట్లు, బ్యానర్లు నెలకొల్పి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి తమ వీరాభిమానాన్ని నిరూపించుకున్నారు. అంతేకాకుండా కటౌట్లకు పుష్పాంజలి ఘటించారు. తమిళ అభిమానులు విరగబడి చూస్తున్నారు. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడడానికి తరలివస్తున్నారు. కొత్త చిత్రాలకు కూడా ఇంత ఆదరణ ఉండటంలేదని చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే ఎంజీఆర్‌ను తెరపై చూసే వీరాభిమానులు అన్నాడిఎంకెకు ఓట్లు కుమ్మరిచ్చేస్తారని ఆ పార్టీ నేతలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. అయిరత్తిల్ ఒరువన్ చిత్రం విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అన్నాడిఎంకె కార్యకర్తలు వీలైతే రాష్ట్రావ్యాప్తంగా మరిన్ని థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారు. అన్నాడిఎంకే చేసే ఈ ప్రయత్నం డిఎంకేతో సహా ఇతర ప్రతిపక్షాలకు కడుపుమంటగా మారింది. వెంటనే జయలలిత వేసిన ఈ సినిమా ట్రిక్కును అడ్డుకోవాలని ఈసీని ఆశ్రయించారు. అయితే సినిమాలను ఆపే హక్కు తమకు లేదని వాటిని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఎన్నికల సంఘం తేల్చి చెప్పటంతో పుండుమీద కారం చల్లినట్లైంది. చేసేదేమిలేక మిన్నకుండిపోయారు. s.nagarjuna@sakshi.com