breaking news
a3 sedan
-
ఆడి కొత్త ఏ3 సెడాన్ @32 లక్షలు
ఆడి ఇండియా కంపెనీ ఏ3 సెడాన్ మోడల్లో అందిస్తున్న కొత్త వేరియంట్‌ను ఆవిష్కరిస్తున్న మాజీ క్రికెటర్ రవి శాస్త్రి, సినిమా నటి నిమ్రత్ కౌర్‌లు. ఈ కారు ధరలు రూ.30.5–32.2 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఏడాదితో భారత్‌లో తమ కార్యకలాపాలకు 10 సంవత్సరాలు పూర్తవుతాయని ఆడి ఇండియా కంపెనీ పేర్కొంది. -
23 లక్షలకే ఆడి సెడాన్ కారు
కార్ల ప్రేమికులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆడి చవక కారు మార్కెట్లోకి వచ్చేసింది. 2014లో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించిన ఆడి ఏ3 సెడాన్ కారు ఢిల్లీ మార్కెట్లో కొనుగోలుదారుల కోసం సిద్ధంగా ఉంది. దాని ప్రారంభ ధర 22.95 లక్షల రూపాయలు (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర). నాలుగు వేరియంట్లలో లభిస్తున్న ఈ కారులో పెట్రోలు లో మాత్రం ఒకే వేరియంట్ ఉంది. దాని ధర రూ. 28.95 లక్షలు. మిగిలిన మూడూ డీజిల్ కార్లే. ఆడి బ్రాండు ఉండి కూడా ఇంత తక్కువ ధరలో సెడాన్ కారు వస్తుండటంతో ఇది ఎంట్రీ లెవెల్ లగ్జరీ కార్లకు చాలా గట్టి పోటీని ఇస్తుందని అంటున్నారు. వాటితో పాటు డి2 సెగ్మెంట్ కార్లు, ప్రీమియం ఎస్‌యూవీలకు కూడా దీఇంతో ముప్పు తప్పకపోవచ్చునట. పలు ఫోక్సవ్యాగన్ కార్లను అందించిన ఎంక్యూబీ ప్లాట్‌ఫాం మీదే ఆడి ఎ3 సెడాన్ కూడా తయారైంది. ఆడి కంపెనీ నుంచి భారతదేశంలో విడుదలైన కార్లలో అత్యంత చవకైన, అతి చిన్న కారు ఇదే. దీని పొడవు 4,456 మిల్లీమీటర్లు, వెడల్పు 1,796 మిల్లీమీటర్లు, ఎత్తు 1,416 మిల్లీమీటర్లు. దీని వీల్‌బేస్ 2,637 మిల్లీమీటర్లు ఉంటుంది. దీంతో ఐదుగురు చాలా సుఖంగా ఇందులో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇందులో 425 లీటర్ల బూట్‌స్పేస్ కూడా ఉంది. లీటర్ డీజిల్‌కు 20.38 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందని తయారీదారులు చెబుతున్నారు.