పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.
పాక్ తరఫున మేటి బ్యాటర్‌గా ఎదిగి కెప్టెన్‌గానూ సేవలు అందిస్తున్నాడు బాబర్ ఆజం
29 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్ బ్యాటర్‌కు అమ్మాయిల్లోనూ ఫాలోయింగ్ ఎక్కువే.
ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌ను పెళ్లాడాలని చాలా మంది కోరుకుంటారనడంలో సందేహం లేదు.
ఈ విషయమై బాబర్ ఆజం ఫ్యాన్స్ కారణంగా ఓ బ్యూటీ చిక్కుల్లో పడింది
ఆమె పేరు నజీష్ జహంగీర్.. పాక్ టీవీ నటి
ఓ అభిమాని ఈమెను.. ‘‘బాబర్ నిన్ను పెళ్లిచేసుకోవాలని కోరితే ఏం చెప్తావు’’ అని ప్రశ్నించారు.
ఇందుకు బదులుగా.. ‘సారీ’ చెప్తానంటూ నో అంటానని చెప్పింది
దీంతో నజీష్‌పై బాబర్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కి దిగారు.
అలా బాబర్ పెళ్లి పేరిట ఫ్యాన్స్ తెచ్చిన తంటా.. ఈ బ్యూటీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది


