హీరోహీరోయిన్లతో ఫోటోలు దిగుతూ తెగ వైరలయిపోయాడు ఓరీ.
కేవలం ఫోటోలు దిగుతూనే లక్షలు సంపాదిస్తున్నాడు. చెమటంటే చిరాకు అని చెప్పుకునే ఓరీకి పనిచేయడమంటే అస్సలు ఇష్టముండదు.
అందుకనే కొత్తగా ఆలోచించాడు. సెలబ్రిటీల ఎదపై చేతులు వేస్తూ అందరితోనూ ఒకే రీతిలో ఫోటోలు దిగుతాడు.
పార్టీలకు హాజరవుతుంటాడు. తనతో ఫోటో కావాలంటే లక్షలు ఇవ్వమని అడుగుతాడు. అదే అతడి సంపాదన మార్గం.
ఎప్పుడూ హీరోయిన్లతో కనిపించే ఓరీ ఈసారి అనంత్ అంబానీతో కనిపించాడు.
తనపైనా చేయి వేసి స్టిల్ ఇచ్చాడు. కాకపోతే నెక్స్ట్ ఫోటోలో అనంత్.. అతడి ముక్కు పిండేశాడు.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు పడీపడీ నవ్వుతున్నారు. ఆఖరికి కొత్త పెళ్లికొడుకునూ వదల్లేదు. నీకు ఇలాగే జరగాలని కామెంట్లు చేస్తున్నారు.
అనంత్.. ఒక ఫ్రెండ్‌లా అతడితో అంత చనువుగా ఉండటాన్ని మెచ్చుకుంటున్నారు.
కాగా అనంత్- రాధికల పెళ్లి జూలై 12న జరిగిన సంగతి తెలిసిందే!


