వైఎస్సార్ జిల్లా : కడప నగరంలో పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతోన్న 10 మంది బుకీలను కడప టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5.30 లక్షల నగదు, 10 మొబైల్స్, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ మసూమ్ బాషా తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు.