జుట్టుతో గిన్నిస్ రికార్డుకెక్కుతా!! | woman tries to enter guinnes record with longest hair | Sakshi
Sakshi News home page

జుట్టుతో గిన్నిస్ రికార్డుకెక్కుతా!!

Apr 13 2015 8:54 AM | Updated on Sep 3 2017 12:15 AM

జుట్టుతో గిన్నిస్ రికార్డుకెక్కుతా!!

జుట్టుతో గిన్నిస్ రికార్డుకెక్కుతా!!

చిన్నప్పటి నుంచి ఆమెకు జుట్టంటే అమితమైన ప్రేమ. అలా పెంచుతూనే ఉంది. అందుకే ఇప్పుడు ఆ జుట్టుతోనే గిన్నిస్ రికార్డు సాధిస్తానని చెబుతోంది.

చిన్నప్పటి నుంచి ఆమెకు జుట్టంటే అమితమైన ప్రేమ. అలా పెంచుతూనే ఉంది. అందుకే ఇప్పుడు ఆ జుట్టుతోనే గిన్నిస్ రికార్డు సాధిస్తానని చెబుతోంది. ఇంతకీ ఉత్తరప్రదేశ్లోని బాఘ్పత్ ప్రాంతానికి చెందిన ప్రియాంక జుట్టు పొడవెంతో తెలుసా.. ఆమె పొడవు కంటే ఎక్కువ.. అక్షరాలా 6 అడుగులు!!

జీవితంలో ఏనాడూ షాంపూలు గానీ, ఇతర రసాయన పదార్థాలు గానీ ఉపయోగించలేదని, కేవలం హెర్బల్ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించడం వల్లే తన జుట్టు ఇంత బలంగా, పొడవుగా ఉందని ఆమె తెలిపింది. తాను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి కూడా జుట్టంటే మహా ఇష్టమని ఆమె మీడియాకు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement