స్త్రీలోక సంచారం

Nilanshi Patel sets Guinness World Record for Longest hair  - Sakshi

గుజరాత్‌ పదహారేళ్ల నీలాంశీ పటేల్‌ 5 అడుగల 7 అంగుళాల జుట్టుతో 2018 గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది.  పశ్చిమ బెంగాల్‌ మిసెస్‌ ఎన్‌.సి.సేన్‌గా మాత్రమే వందేళ్ల క్రితం నాటి పాత రికార్డులలో ఉన్న మృణాళినీ దేవి భారతదేశంలో విమాన ప్రయాణం చేసిన తొలి మహిళగా ‘టైమ్స్‌’ పత్రిక చేసిన పరిశోధనలో నిర్థారణ అయింది.  న్యూఢిల్లీ కొత్త విషయాలను కనిపెట్టిన మహిళల పేటెంట్‌ దరఖాస్తులను సత్వరం పరిశీలించి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే ఈ ఏడాది కేబినెట్‌లో క్రిస్మస్‌ వేడుకల సమయాన్ని కుదించి, మిగతా సమయాన్ని పాలనా వ్యవహారాలకు కేటాయించారు.  పుస్తకం నటి మనీషా కొయిరాలా రాసిన ‘హౌ క్యాన్సర్‌ గేవ్‌ మి ఎ లైఫ్‌’ పుస్తకం ఈ నెల 28న మార్కెట్‌లోకి విడుదల అవుతోంది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top