
తాగునీటి స్కామ్‌లో రూ. 4 లక్షల నకిలీ కరెన్సీ..
ళ్లలో ‘రైల్ నీర్’ తాగునీరుకు బదులుగా నాసిరకం నీటికి సరఫరాచేసిన కంపెనీలపై సీబీఐ దాడి చేసి స్వాధీనం చేసుకున్న రూ. 27కోట్ల నగదులో రూ.4 లక్షల విలువైన
స్వాధీనం చేసుకున్న రూ. 27 కోట్లలో గుర్తించిన సీబీఐ
న్యూఢిల్లీ: రైళ్లలో ‘రైల్ నీర్’ తాగునీరుకు బదులుగా నాసిరకం నీటికి సరఫరాచేసిన కంపెనీలపై సీబీఐ దాడి చేసి స్వాధీనం చేసుకున్న రూ. 27కోట్ల నగదులో రూ.4 లక్షల విలువైన నకిలీ కరెన్సీని అధికారులు గుర్తించారు. శతాబ్ది, రాజధాని రైళ్లలో నీటిని సరఫరా చేస్తున్న రైల్వే క్యాటరర్ శ్యామ్ బిహారీ అగర్వాల్‌కు చెందిన ఢిల్లీలోని ఆయన, ఆయన కుమారుల నివాసాలు, ఏడు సంస్థలపై శుక్రవారం రాత్రి సీబీఐ అధికారులు దాడి చేసి రూ. 27 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడు నగదు లెక్కింపు మెషిన్ల సాయంతో మొత్తం నగదును లెక్కించేందుకు ఐదుగురు అధికారులకు 15 గంటల సమయం పట్టింది. నకిలీ కరెన్సీకి సంబంధించి ఆయనపై కేసు నమోదు చేయనున్నారు.