మహిళపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్ | Tribal woman gangraped; four held | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్

Sep 25 2013 11:37 AM | Updated on Sep 1 2017 11:02 PM

మహారాష్ట్రలోని వాజేశ్వరీ జిల్లాలో అకొలి గ్రామానికి చెందిన గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులలో నలుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రలోని వాజేశ్వరీ జిల్లాలో అకొలి గ్రామానికి చెందిన గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులలో నలుగురుని అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసులు బుధవారం థానేలో వెల్లడించారు. సాగర్ హదల్, సంజయ్ అర్నాడే మోహన్ కథక్, జగదీష్ గవిద్లుగా గుర్తించినట్లు చెప్పారు. ఐదో నిందితుడు వినోద్ కుమార్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదన్నారు. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మమ్మరం చేసినట్లు వివరించారు.

 

నిందితుల్లో ముగ్గురుది బాధితురాలి స్వగ్రామమే అని, మరో ఇద్దరు నిందితలది పక్క గ్రామమని పోలీసులు వివరించారు. అత్యాచారానికి గురైన గిరిజన మహిళ సోమవారం సాయంత్రం ఒంటరిగా వెళ్తుంది. ఆ సమయంలో ఐదుగురు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను కత్తితో బెదిరించి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అనంతరం ఆమెపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం జరిపారు. దాంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నిందితలను 48 గంటల్లో అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement