
జంతు విషాల తొలి డేటాబేస్ ఆవిష్కరణ
జంతువుల విషాలు, మానవులపై వాటి ప్రభావాలతో కూడిన మొట్టమొదటి జాబితాను అమెరికాలోని కొలంబియా వర్సిటీ డేటా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
న్యూయార్క్: జంతువుల విషాలు, మానవులపై వాటి ప్రభావాలతో కూడిన మొట్టమొదటి జాబితాను అమెరికాలోని కొలంబియా వర్సిటీ డేటా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనిని వెనమ్ నాలెడ్జి బేస్(వెనమ్‌కేబీ) అని పిలుస్తున్నారు. కేన్సర్, మధుమేహం, గుండెజబ్బులు, నొప్పుల నివారణల్లో విషం ఉపయోగాలకు సంబంధించి 5,117 అధ్యయనాలను క్రోడీకరించి జాబితాలో పొందుపరిచారు. మానవశరీరంపై 42,723 రకాల ప్రభావాలకు సంబంధించిన డాక్యుమెంట్లు వెనమ్‌కేబీలో ఉన్నాయి. జాబితా కొత్త పరిశోధనలకు, చికిత్సలకు ఉపయోగపడుతుందట.