భారీ నిధుల సమీకరణ దిశగా టాటా స్టీల్‌ | Tata Steel board to consider fund raising proposal this week | Sakshi
Sakshi News home page

భారీ నిధుల సమీకరణ దిశగా టాటా స్టీల్‌

Apr 17 2017 8:20 PM | Updated on Sep 5 2017 9:00 AM

ప్రముఖ దేశీయ స్టీల్‌ సంస్థ టాటా స్టీల్ భారీ నిధుల సమీకరణపై దృష్టిపెట్టింది.

ముంబై:  ప్రముఖ దేశీయ స్టీల్‌ సంస్థ  టాటా స్టీల్ భారీ నిధుల సమీకరణపై దృష్టిపెట్టింది. ఫండ్‌ రైజింగ్‌ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ వారంలో భేటీ నిర్వహించనున్నట్లు టాటా స్టీల్  సోమవారం  ప్రకటించింది. ఏప్రిల్ 20 న గురువారం జరుగనున్న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో  నిధుల పెంపుదల ప్రతిపాదనపై చర్చించనున్నట్టు  సంస్థ బిఎస్ఇకి తెలిపింది.

 28 మిలియన్ టన్నుల స్టీల్  వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో  అంతర్జాతీయ స్టీల్ కంపెనీల్లో టాప్ కంపెనీల్లో ఒకటిగా టాటా స్టీల్ కొనసాగుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో టాటా స్టీల్ వార్షిక టర్నోవర్ 17.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా ఉన్న టాటాస్టీల్‌ 26 దేశాలలో కార్యకలాపాలను,  50 పైగా దేశాలలో  వాణిజ్యకార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement