శ్రీలంకలో ఒకప్పడు ఎల్టీటీఈ ప్రాబల్యం ఉన్న ఉత్తరాది రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తమిళ ప్రధాన రాజకీయ పార్టీ తిరుగులేని విజయం సాధించింది.
శ్రీలంకలో ఒకప్పడు ఎల్టీటీఈ ప్రాబల్యం ఉన్న ఉత్తరాది రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తమిళ ప్రధాన రాజకీయ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. 25 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో తమిళ నేషనల్ అలయెన్స (టీఎన్ఏ) క్లీన్స్వీప్ చేసింది. టీఎన్ఏ 38 స్థానాలకు గాను 30 సీట్లలో విజయదుందుబి మోగించింది.
శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే నాయకత్వంలోని అధికార యూపీఎఫ్ఏను టీఎన్ఏ చిత్తుగా ఓడించింది. ఎల్టీటీఈతో దశాబ్దాల పాటు సాగిన పోరు ముగిశాక శ్రీలంక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఆ దేశంలో నివసిస్తున్న తమిళులకు పరిమితంగా స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తారని భావిస్తున్నారు.